Friday, September 23, 2011

వ్రాత ప్రతులు

మా అమ్మగారు స్వహస్తాలలో రాసుకున్న "గీతా సందేశము"

మా మేనమామ శ్రీ బాచిమంచి శ్రీహరి శాస్త్రి గారు రామప్రభూ అనే మకుటంతొ ఒక శతకాన్ని రచించారు. దానిలోనుంచి మా మాతామహులు మరియు మాతామహి గూర్చిన రెండు పద్యాలు వారి స్వహస్తాలతో మా అమ్మకి రాసి ఇవ్వగా అవి ఇలా ఈ బ్లాగులోకి



-- పితృ పక్షమైన మహాలయ పక్షం లో వచ్చే ఏకాదశి సందర్భంగా, పరమపదించిన పెద్దలను తలచుకుంటూ




Posted by Picasa

Friday, September 16, 2011

చింత

మాత్రా సమం నాస్తి శరీరపోషణం
విద్యాసమం నాస్తి శరీర భూషణం
భార్యాసమం నాస్తి శరీరతోషణం
చిన్తాసమం నాస్తి శరీరశోషణం
తల్లివలె శరీరాన్ని పోషించేది మరేదీ లేదు. విద్యతో సమానమైన శరీర అలంకారం లేదు. భార్య వలే శరీరానికి సౌఖ్యం కలిగించేది మరొకటి లేదు. చింత వలే శరీరాన్ని ఎండపెట్టేదీ లేదు.

చిన్తా చితాసమా హ్యుక్తా బిన్దుమాత్రవిశేషతః
సజీవం దహతే చిన్తా నిర్జీవం దహతే చితా
ఒక్క ం తేడాతో చింత, చిత సమానమైనవి. చిత చనిపోయిన శరీరాన్ని కాలుస్తుంది. చింత బతికిఉండగానే కాలుస్తుంది. 

అందుకే 
చిన్తా నాస్తి కిల
తేషాం - చిన్తా నాస్తి కిల

శమ దమ కరుణా సమ్పూర్ణానాం
సాధు సమాగమ సంకీర్ణానాం || చిన్తా ||
పరమహంసగురు పద చిత్తానాం
బ్రహ్మానన్దామృత మత్తానామ్ || చిన్తా ||

-- శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచితా "చిన్తా నాస్తి కిల" 

అంతరింద్రియములను, బహిరింద్రియములను పూర్తిగా అదుపులో ఉంచుకొన్నవారికి - సజ్జన సంగతియందు కాలము గడుపువారికి దుఃఖము లేదు! చింతలేదు! 
పరమహంసలైన శ్రీ గురువులపాదములయందు తమ్ముతామర్పించుకొన్న వారికి బ్రహ్మానందామృతపానముచే తమ్ము దా మరచువారికి చింత ఏమున్నది? శోకమే మున్నది?

పరమహంసగురు పద చిత్తానాం బ్రహ్మానన్దామృత మత్తానామ్ చిన్తా నాస్తి కిల తేషాం - చిన్తా నాస్తి కిల! 
http://www.maganti.org/audiofiles/air/songs/mbk/chintanastikila.html

Thursday, September 15, 2011

జిహ్వ, ప్రమాణం

జిహ్వే ప్రమాణం జానీహి భాషణే భొజనేపి చ
అత్యుక్తిరతిభుక్తిశ్చ సత్యం ప్రాణాపహారిణీ
jihvE pramaaNaM jaanIhi bhaaShaNE bhojanE..pi cha
atyuktiratibhuktishca satyaM praaNaapahaariNI

జిహ్వే  ప్రమాణం  జానీహి  భాషణే  భొజనే అపి చ
అతి ఉక్తిః అతి భుక్తిః చ సత్యం ప్రాణ అపహారిణీ

ఓ నాలుకా, నీ మితి ని తెలుసుకో, భోజనానికీ, భాషణానికీ కూడా.  అతి భాషణ, అతి భోజనాలు ప్రాణాలను అపహరించగలవు. 

O Tongue! know your limits with respect to both "talking" and "eating." For,  or over talking or over eating both could kill!





Saturday, September 10, 2011

మనుష్యుల అనుష్ఠానం

అనుష్ఠితం తు యద్దేవైరృషిభిర్యదనుష్ఠితం
నానుష్ఠేయం మనుష్యైస్తు తదుక్తం కర్మ ఆచరేత్

అనుష్ఠితం తు యత్ దేవైః  ఋషిభిః యత్ అనుష్ఠితం
న అనుష్ఠేయం మనుష్యైః తు తత్ ఉక్తం కర్మ ఆచరేత్

anushThitaM tu yat dEvai@H  Rshibhi@h yat anushThitam
na anushThEyaM manushyai@h tu tat uktam karma AcarEt

దేవతలు చేసిన పనులు, ఋషులు చేసిన పనులు మనుష్యులు చేయగూడదు. వాళ్ళు చెప్పినట్లు మాత్రమే చెయ్యాలి.

Human beings should not try to imitate the actions of Devas and Rishis. Mankind should only follow the teachings of them.




Thursday, September 1, 2011

గణనాథపరాక్రమము

अलसा कृपणा दीना निद्रा तंद्रा प्रमीलिका
क्लीबा च निरहंकारा चेत्यस्टौ दॆवताः स्मृताः

అలసా కృపణా దీనా నిద్రా తంద్రా ప్రమీలికా
క్లీబా చ నిరహంకారా చేత్యస్టౌ దెవతాః స్మృతాః

శ్రీబ్రహ్మాణ్డపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితొపాఖ్యానే గణనాథపరాక్రమో నామ సప్తవింశో 'ధ్యాయః 

సోమరితనం (अलसा), దిగులు (दीना), బేలతనం(कृपणा), నిద్ర(निद्रा), కునుకు(तंद्रा), కర్తవ్యం దాకా వచ్చి వెనుదిరగడం(क्लीबा), సంకోచము (प्रमीलिका), తనపై తనకే నమ్మకం లేకపోవడం (निरहंकारा) ఈ ఎనిమిదీ విఘ్న శక్తులు.

విశుక్రుడు అనే రాక్షసుడు ఈ ఎనిమిది శక్తులు గల "జయవిఘ్నశిల" అనే యంత్రాన్ని ప్రయోగించగా, విఘ్నేశ్వరుడు ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేయడంచేత దేవతలలో అగ్రపూజ్యుడయ్యాడు

More on: http://online.eenadu.net/Editorial/Antaryamiinner.aspx?qry=010911anta

-- వినాయక చవితి సందర్భంగా

Wednesday, August 31, 2011

అవిద్య, జడ, దరిద్ర, జన్మ జలధిలో మునిగిన వారికి తారణోపాయం

अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी
जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी ।
दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ
निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति ॥

అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ,
జడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।
దరిద్రాణాం చిన్తామణిగుణనికా,
జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి ॥

The "spek of dust" at your lotus feet becomes:
The island-city of rising Suns, for the ignorant;
The stream of ever flowing Nectar of the cluster-of-consciousness-flowers, for the unconsciousness (dull-witted) beings;
The string of chintaamanis (the jewel grants the wishes), for the destitute;
The tusk of Varaha Avataara (that lifted the earth from drowning), for those submerged in the ocean of births (and deaths)

-- From Saundarya laharI (Third sloka) of Samkara Bhagavatpaada.
(on the occasion of Gauri tritiya and Varaha Jayanti)

Saturday, August 27, 2011

కాలము - మహిమలు

సీ|| ఘనుని హరిశ్చంద్రు కాటికాపరి చేసె
మురసుతు సార్వభౌమునిగ సలిపె
అల రంతిదేవుని అన్నాతురుగా జేసె
పేద కుచేలు కుబేరు జేసె
ధర్మాత్ము బలిని పాతాళమునకు దొక్కె
కలుషాత్ము నహుషు స్వర్గమునకెత్తె

కాలమున ఇట్టి మహిమలు కలవియవుట
మానవుడు మేను విడచిన మరుదినము కాక
సుగుణ దుర్గుణములు కలిమి లేములు
ఎన్నరాదని వచియింతురెల్ల బుధులు.


-- కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం నుంచి (బిల్వమంగళుడు, రాధ తో)
మా అమ్మ ఈ పద్యాన్ని ఇతరుల మంచి చెడ్డలను గూర్చి ప్రస్తావన వచినప్పుడు అప్పుడప్పుడూ ఉటంకిస్తూ ఉండే వారు.