ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ | నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||
ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక- | కెందరికి దోబుట్ట డీజీవుడు |
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ- | మెందరికి గావింప డీజీవుడు ||
ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక- | కెక్కడో తనజన్మ మీజీవుడు |
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు- | డెక్కడికి నేగునో యీజీవుడు ||
ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక- | కెన్నిదనువులు మోవ డీజీవుడు |
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి | యెన్నిపదవుల బొంద డీజీవుడు ||
-- అన్నమయ్య
(అక్షయ తృతీయ సందర్భంగా!)
Sunday, May 16, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment