Saturday, July 18, 2009

గోవింద ద్వాదశ మంజరికా స్తోత్రము

భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే


మూఢ! జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్భుద్ధిమ్ మనసి వితృష్ణామ్
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం - 1

నారీస్తనభర నాభీదేశం దృష్టామాగా మోహావేశం
ఏతన్మాంసవసాది వికారం మనసి విచిన్తయ వారం వారం - 2

నళినీదళ గత జల మతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తం - 3

యావద్విత్తోపార్జనసక్త స్తావన్నిజపరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్ఝరదేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే - 4

యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా భిభ్యతి తస్మిన్ కాయే - 5

అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతస్సుఖలేశ స్సత్యం
పుత్రాదపి ధనభాజాం భీతి స్సర్వత్రైషా విహితా రీతిః - 6

బాలస్తావ త్క్రీడాసక్త స్తరుణస్తావ త్తరుణీసక్తః
వృద్ధస్తావ చ్చిన్తాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః - 7

కా తే కాన్తా కస్తే పుత్త్ర స్సంసారోయ మతీవ విచిత్రః
కస్య త్వం వా కుత ఆయాతః తత్త్వం చిన్తయ యదిదం భ్రాంతః- 8

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మొహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః - 9

వయసి గతే కః కామవికార శుష్కే నీరే కః కాసారః
క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్త్వే క స్సంసారః - 10

మా కురు ధన జన యౌవన గర్వం హారతి నిమేషాత్కాల స్సర్వమ్
మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా - 11

దినయామిన్యౌ సాయం ప్రాత శ్శిశిరవసన్తౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్చత్యాయు స్తదపి న ముఞ్చత్యాశావాయుః - 12

ద్వాదశ మఞ్జరికాభిర శేషః కథితో వైయాకరణ స్యైషః
ఉపదేశోభూ ద్విద్యానిపుణైః శ్రీమచ్చఞ్కర భగవచ్చరణైః


మోహ ముద్గరః

Thursday, July 2, 2009

యోగనిద్ర

చారుపటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూర మృణాల హార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సార నిభాంగ శోభితభుజంగమ తల్పమునందు యోగని
ద్రా రతిఁ జెంది యుండు జఠర స్థిత భూర్భువ రాది లోకుఁ డై

-- శయన ఏకాదశి సందర్భంగా శ్రీ మదాంధ్ర భాగవతము నుంచి