Sunday, January 17, 2010

అగ్ని కి సమ్మెట పోటు

అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైన దప్పవు యథార్ధము; తానది ఎట్టులన్నచో
యినుమును గూర్చి యగ్ని నలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా!

-- భాస్కర శతకం నుంచి

చెడ్డ వారి తో కలిసి తిరిగితే మంచి వారికి కూడా కస్టాలు వస్తాయని ఇనుము తో పాటు అగ్ని కి కూడా సమ్మెట పోటు సామ్యం చెపుతోంది ఈ పద్యం దృష్టాంతాలంకారములు బాగా వాడిన శతకం భాస్కర శతకం లోనిది. మారవి వెంకయ్య కవి ఈ శతక రచయిత.

Wednesday, January 13, 2010

సంక్రాంతి పురుష లక్షణం

త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్ర త్రినేత్రకం
లంబకర్ణం రక్తదంతం లమ్బభ్రూ దీర్ఘనాశికమ్
అష్ట బాహు ద్విపాదం చ వికృతం కృష్ణ వర్ణకం
శతయోజనం మౌన్నత్యం విస్తీర్ణమ్ ద్వాదశం స్మృతం
ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంతేః పురుషస్యతు

--మకర సంక్రాంతి సందర్భంగా