Saturday, August 18, 2012

తత్త్వసారము

1. తత్త్వసారము తెలిసికోరన్నా
సద్గురుని చెంత నిజము కనుగొని లాభమొందన్నా
పామరత్వము పారద్రోలి
ద్వేషభావము రూపుమాపి
అంతటను పరమాత్మ గలడని
నిమ్మనంబున బోధ సల్పుము 

2. పాముకాదు తాడురోరన్నా
దీపకాంతిలో సత్యవిషయము తెలిసికోరన్నా
తాడు తాడైయుండి యుండగ
తాడు పామని భ్రమసి ఏడ్చుచు
తామసంబున కాలమంతయు
పాడుచేయక తెలివి నొందుము

ఎన్ని జన్మలు గడిచెనోరన్నా
బహు కాలమందు జీవితంబులు అంతమగునన్నా
అన్ని హంగులతోను గూడిన
ఉత్తమంబగు జన్మ నొందియు
తన్ను తాను తెలిసికొనక
కన్ను మూసిన జన్మ వ్యర్థము


107. యత్నమెన్నడు వీడబోకన్నా
మోక్షపదవియు యత్న ఫలమని యెరుగుమోరన్నా
సమయమేమియు పాడుచేయక
సాధనంబును చేయుచుండుము
విడువకుండను ఆచరించిన
సత్వరంబుగ ముక్తి కలుగును

108. తత్త్వ సారము ఇంతియేయన్నా
విద్యాప్రకాశుని మాట గైకొని ఆచరించన్నా
ఋషులు తెలిపిన శాస్త్ర వాక్యము 
పరమసత్యము మదిని నమ్ముము
ఉచ్చరించిన గలుగు పుణ్యము
ఆచరించిన గలుగు మోక్షము

--శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామి (శుక బ్రహ్మాశ్రమము, శ్రీ కాళహస్తి)

A youtube video with all 108 tattvas - http://www.youtube.com/watch?v=XfPIez79xhk