Friday, December 28, 2012

బుద్ధి కన్య

శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణ ధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే
సకల భువన బంధో సచ్చిదానంద సింధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్

-- శివానందలహరీ (84 వ శ్లోకం)

శంకర భగవత్పాదులు శ్రీ శివానందలహరి లో ఒక (గడుసు) ప్రతిపాదన చేస్తున్నారు.

శివా, నీకు కన్యాదానం చేస్తాను అనేదీ ప్రతిపాదన. కన్య ఎవరు? సర్వగుణ సమన్విత ఐన నా బుద్ధే కన్య.

ఎందుకు? (పార్వతీ దేవి ఒప్పుకుంటుందా?) - ఈ కన్యని ఇచ్చేది గౌరీ దేవితో కూడి ఉన్న శివునికి పరిచర్య చేయడానికి.

అల్లుడిని తెచ్చుకునేటప్పుడు శివుడూ, భవుడూ అయినవాడిని, సకల భువనాలకీ బంధువైనవాడినీ, సత్-చిత్-ఆనంద సింధువు అయినంటువంటి వాడినీ తెచ్చుకోవాలి.

అంతా బాగానే ఉంది. సమస్య ఏమిటి? శివా, నువ్వు ఇల్లరికం వచ్చేయాలి. ఈ బుద్ధి కన్య నన్ను వదిలి ఉండలేదు కాబట్టి, నా హృదయము అనే గృహం లో (హృదయగేహే) ఎప్పుడూ ఉండటానికి (ఇల్లరికం) వచ్చేయవయ్యా!

-- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలలో ఉటంకించ బడింది.

O Siva! I would give my "buddhi-kanya" (girl of intellect) to you as kanyadaana, to serve you along with Gauri. O friend of all worlds, O sat-cit-Ananda-sindhO, ocean of existence-consciousness-bliss, please come and stay in the house of my heart always! (as the buddhi-kanya will not be able to leave me, so you should come and live in the house of my heart!!)

-- mArgaSirSha pUrNimA - Arudra Nakshatram

Thursday, December 20, 2012

నారాయణ నవరత్నములు

సిరులన్ మించిన వాడటంచు బహుదాసీ దాసవర్గంబులన్
గరులన్ గల్గినవాడటంచు బహుభోగాఢ్యుండటంచున్ మహా
హరులన్ గల్గినవాడటంచు నధికారారూఢుడంచున్ సదా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 1

సిరులన్ చేకుర చేతురో విభవమున్ సిద్ధింపగా చేతురో
పరమారోగ్యము సంఘటింతురో జరావ్యాధుల్ నివారింతురో
పరిపూర్ణాయువు గల్గజేయుదురొ దంభప్రజ్ఞులే గాని యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా -2

సిరిమంతుల్ సిరులిచ్చినన్ నిలుచునే శ్రీమంతులొక్కప్డు దు
ర్భర దారిద్ర్య దశావశాత్ములగుచున్ రారాని దుఃఖమ్ములన్
దురపాయంబుల చిక్కి స్రుక్కుటలు నెందున్ చూడమే మూఢతన్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 3

సిరులే లేశము నివ్వ నేర్చునవి రక్షింపంగ దా నేర్చునే
సిరులన్ నిల్పగ నేర్చుగాక నరుడా శ్రేయంబులీ నేర్చునే
స్మరణీయుండితరుండు లేడు హరియే సర్వార్థ సంధాత యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 4

కరుణాసాగరుడార్తబంధుడు జగత్కళ్యాణ సంధాత సం
సరణాంబోనిధినౌక సాధుజనహృత్సత్పద్మసంవాసి దు
ర్భర సంసారహరుండు భక్త సుమనోవాంఛా ప్రదుండుండగా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 5

దురహంకారులు గర్వచిత్తులు సదాదోషైక దృక్కుల్ మహా
దురితాచార పరాయణుల్ చపల చిత్తుల్ (చోరులుం) ధూర్తులున్
పరమార్థ ప్రతికూలవర్తనులు లోభగ్రస్తులాశాపరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 6

కరుణాదూరులు వంచనాపరులు శుష్కాతి ప్రియాలాపకుల్
పరవిద్యాబలవిత్త వృద్ధులు సహింపన్ లేని నీచాత్మకుల్
పరదాక్షిణ్య పరోపకార రహితుల్ స్వార్థప్రియుల్ మచ్చరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 7

నరులెవ్వారలు సర్వసంపదలతో నానాధికారాలతో
సరస ప్రజ్ఞలతో మహామహిమతో జానొందిరేనిన్ పరా
త్పరు నిన్ గూరిచి వారు చేసిన సుపూజాలబ్ధముల్ సర్వమున్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 8

దొరలందిట్టి సమర్థుడున్ సరసుడున్ దూరార్థ సందర్శియున్
వరదాక్షిణ్యుడు స్వాశ్రితావన మహాప్రావీణ్యుడున్ పుణ్యుడున్
దొరకంజాలడు సుమ్ము ముజ్జగములందున్ నమ్ము నామాట నీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 9

-- మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి గ్రామవాసులు కీ. శే. శ్రీమాన్ తిరునగరి వెంకయ్య గారు వ్రాసియుంచుకున్న లిఖితప్రతి యందు 9 పద్యాలు. (కవి ఎవరో తెలియదు.)

If anyone wants to spend 20minutes listening to reading this padyas out by me to myself and thinking aloud slightly in English, please watch the video....


Saturday, December 15, 2012

तोटकाष्टकं - తోటకాష్టకం


విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ 1
vidita-akhila-SAstra-sudhA-jaladhE; mahita-upanishat-kathita-artha-nidhE; hRdayE kalayE vimalaM caraNaM bhava Sankara dESika mE SaraNam

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదం
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ 2
karuNA-varuNA-Alaya pAlaya mAm; bhava-sAgara duHkha vidUna-hRdam; racaya akhila-darSana-tattva-vidaM bhava Sankara dESika mE SaraNam
 
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ 3
bhavatA janatA suhitA bhavitA nija-bOdha-vicAraNa cArumatE; kalaya-Iswara-jIva-vivEka-vidam bhava Sankara dESika mE SaraNam

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణమ్ 4
bhava Eva bhavAn iti mE na itarAm sam-ajAyata cEtasi kautukitA mama vAraya mOha-mahA-jaladhiM bhava Sankara dESika mE SaraNam

సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ 5
sukRtE-adhikRtE bahudhA bhavataH bhavitA sama-darSana-lAlasatA ati-dInam-imam paripAlaya mAm bhava Sankara dESika mE SaraNam

జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ 6
jagatIM avituM kalitA kRtayO vicaranti mahAmaha sat calataH ahimASuH-iva-atra-vibhAsi gurOH bhava Sankara dESika mE SaraNam

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోఽపి సుధీః
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ 7
guru-pungava pum-gava kEtana tE samatAm ayatAm na-hi kah api su-dhIH SaraNAgata-vatsala-tattva-nidhE bhava Sankara dESika mE SaraNam

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ 8
viditA na mayA visad-Eka-kalA na ca kincana kAncanam asti gurOH drutam Eva vi-dhEhi kRpAM sahajAM bhava Sankara dESika mE SaraNam

-- ఆనందగిరి (తోటకాచార్యులు) శంకరులనుద్దేశించి ఆశువుగా చెప్పిన అష్టకం

దేశిక అంటే "దిశ్" నుంచి వచ్చిన దిశ, సరైన దిశ, దారి చూపించే గురువు.

1. గురు చరణలను హృదయం లో కలన చేయాలని (ధ్యానం లో) శిష్యుని కర్మ శరణాగతి!
2. రచయ - నా యందు అఖిల దర్శన తత్త్వాన్ని రచించవయ్యా అనే ప్రార్థన.
3. కలయ - ఈశ్వర జీవ వివేకాన్ని నాలో కలుగజేయ మనే ప్రార్థన.
4. వారయ - నాలోని మోహమనే మహాసముద్రాన్ని నివారిచమనే ప్రార్థన.
5. పరిపాలయ - దీనుడైన నన్ను పరిపాలించమనే ప్రార్థన.
6. మహామహులు జగత్తును రక్షించడానికి సంచరిస్తూ ఉంటారనీ, అటువంటి వారిలో శంకరులు సూర్యుని వంటి వారనే విషయాన్ని చక్కగా లెలియజేసారు తోటకాచార్యులు.
7. శరణన్న వారిని వాత్సల్యంలో రక్షించడం శంకరుల సహజ లక్షణం.
8.నాకేమీ తెలియదు. నా దగ్గరేమీ లేదు. (నా లాంటి అప్రయోజకుడైన, దేనికీ పనికిరాని శిష్యుడిని కూడా) గురువు తన సహజమైన కృపతో ఉద్ధరిస్తాడనే అపూర్వమైన రహస్యాన్ని చెప్పారు ఈ శ్లోకంలో!

For Meaning in English: http://sanskritdocuments.org/all_sa/totaka8_sa.html