Monday, February 27, 2012

Maunam - Silence

Aparokshaanubhuti is a prakarana of Bhagavan Adi Samkara. It takes a suitable saadhaka to the self realization.
Bhagavtpaada's description of mounam, maunam or silence:  
 
 
यस्माद्वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह |
यन्मौनं योगिभिर्गम्यं तद्भवेत्सर्वदा बुधः ||१०७||
वाचो यस्यान्निवर्तन्ते तद्वक्तुं केन शक्यते |
प्रपञ्चो यदि वक्तव्यः सोऽपि शब्दविवर्जितः ||१०८||
इति वा तद्भवेन्मौनं सतां सहज संज्ञितम् |
गिरा मौनं तु बालानां प्रयुक्तं ब्रह्मवादिभिः ||१०९||
-- http://sanskritdocuments.org/all_sa/aparokshaanbhuuti_sa.html

107. The wise should always be one with that silence wherefrom words together with the mind turn back without reaching it, but which is attainable by the Yogins.
108-109. Who can describe That (i.e., Brahman) whence words turn away ? (So silence is inevitable while describing Brahman). Or if the phenomenal world were to be described, even that is beyond words. This, to give an alternate definition, may also be termed silence known among the sages as congenital. The observance of silence by restraining speech, on the other hand, is ordained by the teachers of Brahman for the ignorant.

-- http://www.sankaracharya.org/aparokshanubhuti.php 

Monday, February 20, 2012

Siva Bhujangam

यतोऽजायतेदं प्रपञ्चं विचित्रं
स्थितिं याति यस्मिन्यदेवान्तमन्ते ।
स कर्मादिहीनः स्वयज्ज्योतिरात्मा
शिवोऽहं शिवोऽहं शिवोऽहं शिवोऽहम् ॥

http://www.sringeri.net/2010/02/11/stotra/shiva/shiva-bhujangam.htm

yatO ajAyate idam prapancham vicitram
sthitim yaati yasmin yad Eva antam antE
saH karmAdihInaH svyam jyotiH AtmA
SivOham SivOham SivOham SivOham

From where this wonderful world originates,  in which it is sustained, into that it merges in the end; THAT which has no actions etc., (includes thoughts, words as well) the self effulgent "Atma"; I am THAT Shiva (Atma); I am that Shiva; I am THAT I AM!

-- From Adi SaMkara's Siva Bhujangam on the occasion of Maha Siva raatri....

Sunday, February 19, 2012

అక్లిష్ట కర్మ

శ్రీ రామాయణన్ని పరిశీలిస్తే శ్రీ రామచంద్ర ప్రభువుని వివిధ సమయాలలో అక్లిష్ట కర్మణః అనే విశేషణం తో గుర్తించటం జరుగుతుంది. (బాలకాండ లొ 77 సర్గ, అయోధ్య కాండ లో 24, 72, 76, 85 వ సర్గలలో ,   అరణ్య కాండ 24, 31, 33, 3 8, 39, 50 వ సర్గలలో, కిష్కింధ కాండ 26, 53 సర్గలలో,  సుందర కాండ 30, 35, 42, 43, 58 వ సర్గలలో ముఖ్యంగా జయ శ్లోకాలలో,  యుద్ధ కాండ లోని 41, 68, 72, 128 సర్గలలోనూ)

ఈ అక్లిష్ట కర్మ అంటే ఏమిటి?  శ్రీరామచంద్రమూర్తి చేసిన పనులన్నీ క్లిష్టమైనవిగానే కనిపిస్తాయి గదా?  అరణ్యాలకు వెళ్ళడం, అనేక మైన రాక్షసులను సంహరించడం,  ఋషులను రక్షించడం, సీతమ్మను వెతకడం , సేతు బంధనం, రావణ వధ.... ఈ రకం గా శ్రీ రామ చంద్రుని ఏ కర్మ ను విశ్లేషించినా అది క్లిష్టం గానే కనిపిస్తుంది.

అక్లిష్ట కర్మ అంటే చిక్కు పడని పని.   కర్తను ఈ ప్రపంచముతో బంధించని/ముడివేయని  పనిని అక్లిష్ట కర్మ అంటారు. 
శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు:
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః | 
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || (4 వ అధ్యాయం , 19వ శ్లోకం)
ఎవని సర్వ కార్యములు కామ సంకల్ప రహితములో, జ్ఞానమనే అగ్నిలో దహించబడినవో వానిని పండితుడు అని బుధులు (అన్నీ చక్కగా తెలిసినవారు) అంటారు. 
పరమాత్మ శ్రీ రామునిగా ఆచరించి చూపించిన అక్లిష్ట కర్మణత్వమే,  శ్రీ కృష్ణునిగా గీతగా వచించారు. 
కర్మ ఫలములను ఆశించని స్వధర్మానుష్టానమే అక్లిష్ట కర్మ.  స్వధర్మమునందు వెనుదిరుగకుండుటయే ధైర్యము.  ధైర్యమైన స్వధర్మానుష్టానాచరణ, ప్రబొధములే అవతార ప్రయోజనము.  అటువంటి అక్లిష్ట కర్మ వలనే  మానవుడు కర్మబంధాల నుంచి విమిక్తుడవుతాడు! మోక్షగామి అవుతాడు!!

--శ్రీ ఖరనామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి, ఆదివారం (చివరి మాఘ ఆదివారం) సందర్భంగా

Let one and all get on with the untangling work diligently and attain the final goal of life - saccidaananda - infinite existence, consciousness and bliss.

Monday, February 13, 2012

ఆరోగ్యం - ArOgyam

धर्मार्थकाममोक्षाणां आरोग्यं मूलमुत्तमम् ।
रोगास्त​स्यापहर्तारः श्रेयसो जीवितस्य च ॥

జీవితమనే వృక్షమునకు రోగములను తొలగించి శ్రేయస్సును కలిగించే ధర్మ అర్థ కామ మోక్షములనే ఫలములను పండించే ఉత్తమమైన మూలమే ఆరోగ్యము.

dharma-artha-kaama-mokshaaNaam ArOgyam mUlam-uttamam
rOgAstsyApahartAraH SrEyasO jIvitasya ca

"ArOgyam" is the best root of the life tree, that removes illnesses, and gives good fruits of dharma, artha, kaama and moksha. 

What is "swastha" i.e health?

समदोषः समाग्निश्च समधातुमलक्रियः ।
प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते ॥
samadOshaH samAgniSca samadhaatumalakriyaH
prasannAtmEndriyamanAH svastha iti-abhidhiiyatE

The equilibrium of three doshas (vaata, pitta, kapahs - loosely represents three states of matter born out of three qualities) the fire (digestive fire indeed!) the seven dhaatus (rasa, rakta, maamsa, vasa, asthi, meda, viiryas) and the three excretions (sweat, urine, stools)
AND
composed SELF, sense organs (Five jnanedriyas and five karmendriyas) and the mind (the controller of indriyas)
IS
called swastha i.e Health! 

(What a complete definition of Health!)

-- from Caraka Samhita

Sunday, February 5, 2012

బాల కృష్ణునిలో శివుడు


శరీరాన్నంటుకున్న దుమ్ము విభూతి పూత అవగా, నుదుటి పైన ముత్యపు బొట్టు ఫాలమునున్న చంద్రవంక అవగా, నుదుటి మీద పెట్టిన నల్లని బొట్టు మన్మధుని కాల్చిన మూడవ కన్ను అవగా, కంఠమాలికలోని పెద్ద నీలపు రత్నము శివుని నీలకంఠము లా కనిపించగా, మెడలోని హారములు శివుని మెడలోని పన్నగ హారములు అవగా, బాల లీలలు చూపుచున్న బాలకుడు శివునకు తనకూ యెట్టి భేదము లేనట్లుగా వెలసెను.

-- మాఘ మాస ఆదివారం శుద్ధ త్రయోదశి ప్రదోషం సందర్భంగా పరమ భాగవతులు దర్శించిన శివ కేశవాభేధం
-- శ్రీ పోతన భాగవతం నుంచి  

Friday, February 3, 2012

ఒక సూర్యుడు

ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుండు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై.

ఒకే సూర్యుడు, సమస్త జీవులకు వేర్వేరుగా ఒక్కోక్క సూర్యుడున్నట్లు తోచునట్లుగా ఏ దేవుడు సర్వకాలాలలోనూ తన లీలచే తననుంచే ఉద్భవించిన జీవ సమూహముల హృదయకమలములలో అనేక రూపములలో నోప్పుచుండునో ఆ దేవుడైన హరిని (శ్రీ కృష్ణుని) నేను శుద్ధ మనస్కుడనై ప్రార్థించెదను.  

-- పోతన భాగవతము లో భీష్మ పితామహుడు అంపశయ్య నుంచి శ్రీ కృష్ణుని గూర్చి;
-- భీష్మ ఏకాదశి సందర్భంగా