కం. అపరాధ సహస్రంబులు
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముడనై చేసితి
జపలుని నను గావు శేష శాయివి కృష్ణా!! 48
కం. నర పశుడ మూఢ చిత్తుడ
దురితారంభుడను మిగుల దోషగుడను నీ
గుఱుతెఱుగ నెంత వాడను
హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా!! 49
కం. పంచేంద్రియ మార్గంబుల
గొంచెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నించుక మిమ్మెరిగినాడ నిప్పుడె కృష్ణా!! 50
కం. దుష్టుండ దురాచారుడ
దుష్ట చరిత్రుండను జాల దుర్బుద్ధిని నే
నిష్ట నిను గొల్వ నేరను
గష్టుడ నను గావు కరుణను కృష్ణా!! 51
రచయిత- నృసింహకవి.
Monday, August 30, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment