Friday, December 10, 2010

అవస్థలు - మార్పు

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
తస్మైశ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిషు, జాగ్రదాదిషు, అపి, తథా, సర్వాసు, అవస్థాసు, అపి,
వ్యావృత్తాసు, అనువర్తమానం, "అహం", ఇతి, అంతః, స్ఫురంతం, సదా,
స్వాత్మానం, భజతాం, యః, భద్రయా ముద్రయా, ప్రకటీకరోతి,
తస్మైశ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్య కౌమార వార్ధక్య అవస్థల్లోనూ
జగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల్లోనూ
దర్శన స్పర్శనాది అవస్థల్లోనూ
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ,
సదా "అహం" = "నేను" అని అన్ని మార్పుల్లోనూ మార్పు చెందకుండా ప్రకాశిస్తున్న ఏ ఆత్మ కలదో
ఆ అత్మ స్వరూపమును భక్తులకు చిన్ముద్ర చే ప్రకటిస్తున్నటువంటి గురు మూర్తి శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను.


-- శ్రీ శంకరుల దక్షిణామూర్తి స్తొత్రం 8 వ శ్లొకం

No comments: