జ్యావల్లీ ధ్వని గర్జనంబుగ సురల్ సారంగయూథంబుగా
నా వి ల్లింద్రశరాసనంబుగ సరోజాక్షుండు మేఘంబుగా
దా విద్యుల్లతభంగి నింతి సురజి ద్దావాగ్ని మగ్నంబుగా
బ్రావృట్కాలము సేసె బాణచయ మంభ శ్శీకరశ్రేణి గాన్
ఏకకాలమందు అమ్మ శృంగార వీర రసాలలో హరికి, అరికి (నరకాసురునికి) ఇలా కనిపించింది:
రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు
కందర్ప కేతువై ఘన ధూమకేతువై యలరు బూబోణి చేలాంచలంబు
భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయు నాకృష్టమై మెలతచాప
మమృత ప్రవాహమై యనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు
హర్షదాయి యై మహారోష దాయి యై పరగు ముద్దరాలి బాణవృష్టి
హరికి నరికి– జూడ నందంద శృంగార వీరరసము లోలి విస్తరిల్ల.
అటువంటి తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రపంచం లోని జనులందరి మీదా ఉండాలని ఆశిస్తూ ఆది శంకరుల కనకధార నుంచి ఒక శ్లొకం:
కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణా పూరతరంగితైరపాంగైః
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిం దయాయాః
--- గోవత్స ద్వాదశి, ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య....
No comments:
Post a Comment