Thursday, January 31, 2013

ద్వైతము సుఖమా?


పల్లవి:  ద్వైతము సుఖమా? అద్వైతము సుఖమా?

అనుపల్లవి: చైతన్యమా! విను సర్వ సాక్షీ!
విస్తారముగాను తెల్పుము నాతో (ద్వైతము)

చరణం: గగన పవన తపన భువనాద్యవనిలో
నగధరాజ శివేంద్రాది సురలలో
భగవద్భక్త వరాగ్రేసరులలో
బాగ రమించే త్యాగరాజార్చిత (ద్వైతము)

-- శ్రీ త్యాగరాజ స్వామి (వారి ఆరాధన సందర్భంగా పుష్య మాస బహుళ పక్ష పంచమీ )
 
"ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు"  అన్న త్యాగరాజ స్వామి వారే ఈ జటిలమైన ప్రశ్న ని శ్రీ రాముల వారినే అడిగారు.

For English: http://sahityam.net/wiki/Dvaitamu_sukhama

No comments: