Sunday, October 20, 2013

పెంజీకటికవతల

లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ తుది నలోకం బగు పెం
జీకఁటి కవ్వల నెవ్వఁడు
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్

లోకాలు, వాటి అధిపతులు, వానిలో ఉండే జీవులు అన్నీ తెగిన తరువాత అలోకమైన (శూన్యమైన) పెను చీకటి (పెంజీకటి) ని దాటి ఏకాకృతిలో వెలిగే జ్యొతి తత్త్వాన్ని నేను సేవిస్తాను.

-- పోతన, శ్రీ మదాంధ్ర మహా భగవతం గజేంద్ర మోక్ష ఘట్టం నుంచి

Having transcended the multiplicity of worlds, their respective lords, their inhabitants into the invisibility of great darkness in the end, the form of undivided light, THAT I pray to.

No comments: