Monday, December 18, 2017

కామేశ్వరీ శతకము


జననాభావమనుగ్రహింపు, మది శక్యంబు కాదేని పై
జననంబందును నా కొసంబు మెటులో సంగీతసాహిత్యముల్
పనిలేదీయుదరంపు పోషణముకునై భాషాంతరమ్ముల్ జగ
జ్జననీ దీనికి నింత వ్యర్థపుఁ బ్రయాసంబేల కామేశ్వరీ!

-- తిరుపతి వెంకట కవుల కామేశ్వరీ శతకం నుంచి