Friday, June 21, 2019

స్మరామి వేంకటేశ్వరం

సరోజపత్ర లోచనం సుసాధు ఖేద మోచనం 
చరాచరాత్మక ప్రపంచ సాక్షిభూత మవ్యయమ్ 
పురారి పద్మజామరేంద్ర పూజితాంఘ్రి పంకజం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

పురాణపూరుషం సమస్త పుణ్యకర్మ రక్షణం 
మురాసురాది దానవేంద్ర మూర్ఖజాల శిక్షణమ్ 
ధరాధరోద్ధరం ప్రశాంత తాపసాత్మ వీక్షణం 
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

శరాసనాది శస్త్రబృంద సాధనం శుభాకరం 
ఖరాఖ్య రాక్షసేంద గర్వకాననోగ్రపావకమ్
నరాధినాధ వందితం నగాత్మజాత్మ సన్నుతం 
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

సురారి శౌర్య నిగ్రహం సుపర్వరాట్ పరిగ్రహం 
పరాత్పరం మునీంద్రచంద్ర భావగమ్య విగ్రహమ్
ధరామరాఘ శోషణం సుధాతరంగ భాషణం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

https://m.facebook.com/story.php?story_fbid=10162246572960151&id=776915150


Tuesday, June 18, 2019

శ్రీకృష్ణుడు - శృంగారము

శృంగారాకృతితోడ వచ్చి 'పదముల్ శృంగార సారంబుతో
డం గూఢంబుగఁ జెప్పు' నీ వనగ 'నట్లా చెప్పలే' నన్న నన్
ముంగోపంబునఁ జూచి లేచి యట నే మ్రొక్కంగ మన్నించి త
చ్చృంగారోక్తులు తానె పల్కికోను నా శ్రీకృష్ణు సేవించెదన్

-- మాతృశ్రీ తరిగొండ వేంగమాబ, శ్రీ వేంకటాచల మహాత్మ్యము (పద్య కావ్యము), ప్రథమాశ్వాసము, 13 వ పద్యం. శార్దూల విక్రీడితము

In a kAvya, the rasa rAja SRngAra is a must.

Most handsome form of Sri kRSNa appears to poetess Tarigonda Vengamamba and instructs her to include the flavor of attraction in her devotional kAvya Sri Venkatachala mahatmyam and politely refuses to do so. Getting gently angry on her and getting up from there he only introduces those padyas of Sringara rasa into the kAvay; "such form of kRSNa i worship." - Says poetess.

How cute!