Monday, June 15, 2009

ఆత్మ శాంతి కి తేలిక మార్గం

శౌనకాది మునులు సూత మహా ముని తో:

అలసులు మందబుద్ధిబలు లల్పతరాయువు లుగ్రరోగసం
కలితులు మందభాగ్యులు సుకర్మము లేవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్య మై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే

దానికి సూత మహర్షి సమాధానం:

అతిరహస్య మైన హరిజన్మ కథనంబు మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ
జాల భక్తి తోడఁ జదివిన సంసార దుఃఖ రాశిఁ బాసు తొలఁగి పోవు.

--- ఆంధ్ర మహాభాగవతం నుంచి
(సద్విచారం చేయడానికి ఆత్మ శాంతి ఎంతో అవసరం; విచారం వలననే జ్ఞానం; జ్ఞానం వలననే మోక్షం కలుగుతాయి.)
Post a Comment