మూర్తిత్రయేశ్వరసదాశివపంచకం యత్
ప్రాహుః పరాత్మవపురేవ సదాశివో$స్మిన్
తత్రేశ్వరస్తు స వికుంఠపదస్త్వమేవ
త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే
--శ్రీమన్నారాయణీయము 90వ దశకము 2వ శ్లోకం
mUrtitrayESvarasadASivapancakaM yat
prAhu@h parAtmavapurEva sadASivO smin
tatrESvarastu sa vikunThapadastvamEva
tritvaM punarbhajasi satyapadE tribhAgE
--SrImannArAyaNIyamu 90va daSakamu 2va SlOkam
In the the sadASiva panchakam, the supreme soul "sadASiva" thou art! thou alone the lord of vaikuntha; thou exists as the triad of creator, maintener and destroyer in the three fold divided satya lOka.
SrI Narayana bhattatiri, author of Srimad nArAyaNIyam, while establishing the supremacy of lord Vishnu in 90th daSakam can't help equating the lord Vishnu as sadASiva. In supreme principle the forms have no hierarchy. It is the same supreme principle worshipped as multitude of forms and names.
On the occasion of SrAvaNa mAsa SivarAtri of durmukhi year!!
Showing posts with label ఏకాదశి. Show all posts

Tuesday, August 30, 2016
Friday, January 8, 2016
సాంబ ఏకః సహాయః
సంతః పుత్రాః సుహృదయుతవా సత్కళత్రం సుగేహం
విత్తాధీశప్రతిమ వసుమాన్ కోభవీతు ప్రకామం
ఆశాస్వాస్థా అమృతకిరణాస్పర్ధికీర్తిచ్చటావా
సర్వం వ్యర్థం మరణ సమయే సాంబ ఏకః సహాయః
Listen the sAmbAshTakam:
http://www.shaivam.org/gallery/audio/sanskrit/sk_sambashtakam.mp3
Great sons, wonderful friends, good wife, beautiful house
wealth equivalent of kubera, all desires fulfilled,
healthy and fit, glory spreading like bright rays of moon
all these are useless at the time of death. Only the supreme lord (samba) comes to rescue.
-- Sri manmatha year mArgaSIrsha mAsa SivarAtri today.....

Wednesday, April 29, 2015
జ్ఞానికి ఇద్దరు భార్యలు
ద్వేకాంతేతిషతః సమ్యక్ పార్స్వయోః సత్యతైకతే
ఇందోరివ విశాఖే ద్వే సమాహ్లాదిత చేతసీ
--యోగ వాసిష్ఠము స్థితి ప్రకరణము 23 వ సర్గ 37 వ శ్లోకం
dve kAntE iti ishataH samyak pArSvayOH satyata EkatE
indOH iva viSAkhE dvE samAhlAdita cEtasI
-- yOga vAsishTham, sthiti prakaraNam, 23rd Sarga, 37th verse.

For a realized man there are two wives on both sides called satyata
i.e., truthfulness and Ekata i.e., oneness just like the beautiful twin
stars of viSAkha are of both sides to the moon, giving bliss to composed
mind!
mOhinI EkAdaSi today....
mOhinI EkAdaSi today....
Friday, December 5, 2014
నిజమైన రాజులు
గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు
రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు
- కరుణశ్రీ
అలాంటి రాజులేలిన శ్రీ రామ భక్తి సామ్రాజ్యానికి నన్ను చేర్చిన నావలు స్వామి శ్రీ విరాజేశ్వర సరస్వతి పాదుకలు
Tuesday, February 25, 2014
ఏకో గమ్యః - Only destination
త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవమితి
ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ|
రుచీనాం వైచిత్ర్యాదృజుకుటిల నానాపథజుషాం
నృణామేకో గమ్యస్త్వమసి పయసామర్ణవ ఇవ||7||
त्रयी साङ्ख्यं योगः पशुपतिमतं वैष्णवमिति
प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च।
रुचीनां वैचित्र्यादृजुकुटिल नानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥ ७॥
-- From Pushpadanta viracita Siva mahimna stotram.
prabhinnE prasthAnE different spiritual practices of trayI (three vedas), sAmkhyam (samkhya) yOgaH (yoga) paSupati matam (pASupatas) vaishNavam (vaishnavas) param idam adaH pathyam iti (this or that is the best and well suited thus) rucInAm vaicetryAt (due to the difference in attitudes of individuals) Rju kuTila nAnA patha jushAM (selected by straight or step by step paths / methods or streams) nRNAM (for the people) EkO gamyaH tvam aSi ( only destination is YOU ALONE! O LORD!! ) payasAm arNavam iva (just like for all the water streams the final resting place is the great ocean alone)
-- Today is vijaya EkAdaSi of SrI vijaya nAma samvatsara just two days away from the mahA SivarAtri on 27th Feb 2014. (Link to last year Vijaya EkadaSi post - http://nonenglishstuff.blogspot.in/2013/03/blog-post.html )
Let there be grace of Lord Siva be one and all in making them reach the "ONLY DESTINATION"
(For full Siva Manimna Stotram with English Trans.. http://www.ms.uky.edu/~sohum/sanskrit/mahimna/mahimna.htm )
om tat sat

Friday, March 8, 2013
మోక్ష సాధన ఎప్పుడు?
సరిగ్గా పది మాసాల క్రితం భగవత్ చింతనకు తరుణం ఎప్పుడు? అని మహాకవీంద్రుడు గొప్ప శివ భక్తుడు అయిన ధూర్జటి యోక్క కాళహస్తీశ్వర శతకం లోని ఒక పద్యాన్ని చూశాం.
ఇప్పుడు పరమ రామ భక్తుడైన రామదాసు గారి దాశరథీ శతకం నుంచి అదే భావాన్ని గమనిద్దాం:
మనమున నూహపోహణములు మర్వకమున్నె కఫాది రోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుటల్
తనువునకున్ విరోధమది దాశరథీ కరుణాపయోనిధీ.
--శ్రీ నందన నామ సంవత్సర మాఘ బహుళ ఏకాదశి (విజయ ఏకాదశి) సందర్భంగా...
A verse from dASarathI satakam of bhakta rAmadAsu that reinforces the same bhava as my past post - http://nonenglishstuff.blogspot.in/2012/04/blog-post_16.html made exactly 10 months back.
Uha (proper understanding), apOha (misunderstanding) are the capabilities of mind. While these capabilities of mind are strong, before the diseases take over the body and while body is still strong to take up the austereties, MAN should take up the sAdhana i.e., practice to attain mOksha (ultimate realization). Not performing tattva vicAra (self enquiry) is counter productive of having body (+ mind + intellect)
-- SrI nandana nAma samvatsara mAgha bahuLa EkAdaSi (Vijaya EkAdaSi)

Tuesday, September 11, 2012
నిత్య ప్రబుద్ధ ముదిత - ever awake blissful
యస్యైచ్చయేవ భువనాని సముద్భవంతి
తిష్ఠంతి యాంతి చ పునర్ విలయం యుగాంతే
తస్మై సమస్త ఫలభోగ నిబంధనాయ
నిత్య ప్రబుద్ధ ముదితాయ నమశ్శివాయ
-- శృంగేరి శంకరాచార్య జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి వారి అనుగ్రహ భాషణం లో ఉటంకించ బడిన ప్రార్థనా శ్లోకం
-- పరమ ఏకాదశి (అధిక మాస కృష్ణ పక్షం లో వచ్చే ఏకాదశి) సందర్భంగా
yasya iccha Eva bhuvanAni samudbhavanti, tishThanti, yaanti ca punar vilam yugAntE
whose will alone creates (multiplicity of) worlds, sustains, moves / grows, and merges them back into in the end,
tasmai samasta phala bhOga nibandhanAya, nitya prabuddha muditAya namaH SivAya!
For him I bow down, Lord Siva! who is the ordainer of all fruits of enjoyment, ever awake and blissful!
-- The prArthana SlOkam quoted by jagadguru SrI bhAratI tIrtha swami in his recent anugraha bhAshaNam.
-- parama EkAdaSi tomorrow

Friday, June 29, 2012
తొలి ఏకాదశి
ఏకాదస్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజన ద్వయం
శుధ్ధోపవాసః ప్రథమః సత్కధా శ్రవణం తథా
-- దేహేంద్రియ సంఘాతాన్ని అదుపులోకి తెచ్చి అంతఃకరణ చతుష్టయాన్ని శుద్ధి చేసి ఐహిక ఆముష్మిక ఫలితాలను ప్రసాదించగల ఏకాదశీ వ్రతాన్ని ప్రారంభిచే తొలి ఏకాదశి సందర్భంగా
మొదటి పాదాన్ని మాత్రం చూస్తే ఏకాదశి నాడు రెండు పూటలా భొజనం చెయ్యడమే కర్తవ్యం అని చెప్పినట్లుగా ఉంటుంది. కానీ "భో, జన" = "ఓ జనులారా" అని సరిగ్గా అన్వయం చేసుకున్న తరువాత అసలు రెండు కర్తవ్యాలూ శుద్ధోపవాసమూ మరియూ సత్ కధా శ్రవణమూన్ను.
(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి "ఏకాదశి వ్రత మహత్యం" ప్రవచనం లో ఉటంకించ బడినది )
EkAdasyAntu kartavyam sarvEshAm bhO jana dvayam
SuddhOpavAsaH prathamaH sat katdhA SravaNam tathA
bhO jana sarveshaam - Oh all people, there are two things apply for a EkadaSi vratam. 1. Complete fasting (as much as possible to the body condition of the individual) 2. listening to sat kadhaa i.e, divine narrations of great people.
By doing these two on the Ekadasi day, the body and senses will come into control and mind gets purified giving wonderful results in the matters related to this world and beyond!
-- On the occasion of toli EkAdaSi tomorrow; the day when everyone can start the vrata of cAturmASya and EkAdaSi.

Monday, November 21, 2011
మానవ జీవిత పరమావధి
25 సంవత్సరాల క్రితం, శ్రీ క్షయ నామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి (ఉత్పత్తి ఏకాదశి) రోజున, నేను 8 రూపాయలకి "కర్మ యోగము" అనే పుస్తకమును శ్రీ రామకృష్ణ మిషన్ వారి ప్రచురణల నుంచి కొని చదవటం ప్రారంభించాను. ఆ పుస్తకం కర్మ యోగము మీద శ్రీ వివేకానందుల ప్రసంగాల సంకలనం.
మానవ జీవితమునకు అర్థమేమిటి? అనే ప్రశ్న కలగడమే అదృష్టం. దానికి సరైన సమాధానం దొరకడం ఇంకా కష్టం.
25 సంవత్సరాల తరువాత ఈ శ్రీ ఖర నామ సంవత్సర ఉత్పత్తి ఏకాదశి నాడు "కర్మ యోగము" నుంచి ఒక తెలుగు వాక్యం మరియు ఒక సంస్కృత వాక్యం :
1. "మానవ జీవిత పరమావధి సుఖము కాదు; జ్ఞానము. "
2. "ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ"
జీవులన్నీ కూడా సుఖము కొరకే జీవిస్తూన్నవి. ఆ సుఖ లాలస లో అమృతానంద కారకమైన ఆత్మ "జ్ఞానము" ను సంపాదించే ప్రయత్నము చేయుటకు అనుకూలమైన బుద్ధి జీవుని జన్మ మానవ జన్మ.
మోక్ష కారకమైన ఆత్మజ్ఞానము కొరకు సాధన చేస్తూ జగత్తు హితము కొరకు పాటుపడటమే మానవ జీవిత పరమార్థం
ఈ రెండు వాక్యాలూ నా ఆలోచనలను నడిపిన దారిలో నా కోసం నేను రాసుకున్న (బ్)లాగు పొస్టులు. -
1. know thy self
2. yOga vEdAnta
3. plain truths
-- ఈ శ్రీ ఖర నామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి, చివరి కార్తీక సోమవారం సందర్భంగా
Friday, August 7, 2009
విష్ణు తిధి...ఏకాదశి
తొలి ఏకాదశి... వైకుంఠ ఏకాదశి... ముక్కోటి ఏకాదశి... ఆ పేరులోనే ఏదో పవిత్రత! అంతెందుకు, ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు.
హిందూ సంప్రదాయంలో పరమపవిత్రమైన తిథి ఏకాదశి. ఎంత పవిత్రమైనదంటే... ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకూ ఏదో ఒక విశిష్టతను ఆపాదించి హరినామస్మరణ చేస్తారు భక్తులు. ఒక్కోరోజుకూ ఒక్కో ప్రాధాన్యత. వాటిలో ముఖ్యమైనది ఆషాడమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీన్నే ‘తొలిఏకాదశి’ అంటారు. పూర్వం ఆషాడశుద్ధ ఏకాదశినే సంవత్సరారంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై శయనించే రోజు కాబట్టి ఈ రోజును శయనైకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఖగోళపరంగా చూస్తే ఈరోజుదాకా ఉత్తరదిశగా వాలి కనిపించే సూర్యుడు ఒకింత దక్షిణ దిశగా వాలినట్లు కనిపిస్తాడు. సూర్యుడంటే ప్రత్యక్షనారాయణుడు. అందువల్ల కూడా మన పూర్వులు ఈరోజును శయనైకాదశిగా వ్యవహరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయం.
ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు. చాలా ప్రాంతాల్లో తొలిఏకాదశి నాడు ‘గోపద్మ వ్రతం’ చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నాలుగు నెలలూ వర్షాకాలం కాబట్టి పశువుల కొట్టాలను శుభ్రం చేసి వాటికి ఎలాంటి అనారోగ్యమూ రాకుండా కాపాడుకునే ప్రయత్నం ఇది. అలాగే ఈ నెల బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణువును పూజించి ఏకాదశివ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక.
శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈరోజున వెన్న దానం చేయాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశిఘడియల్లో హరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయని పద్మపురాణంలో ఉంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి రాజ్యాన్నీ భార్యాబిడ్డలనూ కోల్పోయిన హరిశ్చంద్రుడు భాద్రపద బహుళ ఏకాదశి(దీన్నే అజ ఏకాదశి అంటారు)నాడు వ్రతం ఆచరించి అన్నిటినీ పొందగలిగాడని పురాణప్రవచనం.
ముక్కోటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి బహుళంలోది ఉత్పత్తి ఏకాదశి. విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టిన కన్య మురాసురుని సంహరించిన దినం ఇది. తొలిఏకాదశినాడు శయనించిన విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఈ రోజును ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు భక్తులు. మార్గశిర శుద్ధంలో వచ్చేది మోక్షొకాదశి, సౌఖ్యదా ఏకాదశి. అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే ఆరోజును ‘ముక్కోటి/వైకుంఠ ఏకాదశి’ అంటారు. చాంద్రమానాన్ని బట్టీ ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణ్వాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆరోజున స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని ప్రతీతి. అలాగే, అర్జునుడికి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో విశ్వరూపం చూపి గీతాబోధన చేసింది ఈరోజేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక మార్గశిర బహుళంలో వచ్చేది విమలైకాదశి. దీన్నే సఫలైకాదశి అని కూడా అంటారు. పుష్యశుద్ధంలిో వచ్చేది నంద/పుత్ర ఏకాదశి. అదే మాసం బహుళంలో వచ్చేది కల్యాణైకాదశి.
భీష్మఏకాదశి
మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా ఆచరిస్తారు భక్తులు. ఈరోజునే కామదైకాదశి, జయైకాదశి అని కూడా వ్యవహరిస్తారు. మరో పదిహేను రోజులకు వచ్చేది విజయైకాదశి. ఆరోజున పాదరక్షలు దానం చేయడం మంచిదంటారు. రాముడు సేతువు నిర్మాణాన్ని ప్రారంభించి విజయం పొందిన రోజు ఇదేనని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఫాల్గుణ మాసంలో ధాత్రైకాదశి, సౌమ్యైకాదశి వస్తాయి. చైత్రశుద్ధంలో వచ్చే ఏకాదశిని దమనైకాదశి అంటారు. దీనికే అవైధవ్య ఏకాదశి అని కూడా పేరు. చైత్ర బహుళ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందంటారు. ఈ రోజును వరూధిన్యైకాదశి అంటారు. వైశాఖ మాసంలో మొదట వచ్చే మోహిన్యేకాదశి నాడు చెప్పులు, పాలు, చల్లటినీరు... బహుళంలో వచ్చే సిద్ధైకాదశినాడు గొడుగు... దానం చేస్తే మంచిదంటారు. ఇవన్నీ సూర్యప్రతాపం నుంచి రక్షణ కల్పించేవే. జ్యేష్ఠంలోనూ అంతే. మొదటిది త్రివిక్రమైకాదశి. నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కాబట్టి దీన్నే నిర్జలైకాదశి అంటారు. ఆరోజు నీళ్లకుండలు, నెయ్యి, గొడుగు వంటివి దానం చేస్తారు. ఇక ఆఖరిది జ్యేష్ఠ బహుళ ఏకాదశి... దీన్నే యోగిన్యైకాదశి అంటారు.
ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.
--- ఈనాడు ఆదివారం లో వచ్చింది

Thursday, July 2, 2009
యోగనిద్ర
చారుపటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూర మృణాల హార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సార నిభాంగ శోభితభుజంగమ తల్పమునందు యోగని
ద్రా రతిఁ జెంది యుండు జఠర స్థిత భూర్భువ రాది లోకుఁ డై
-- శయన ఏకాదశి సందర్భంగా శ్రీ మదాంధ్ర భాగవతము నుంచి

Subscribe to:
Posts (Atom)