Tuesday, August 11, 2009

జ్ఞాత

ధీ శక్తి ఉన్నంతదాకా అందు జ్ఞేయ వస్తువులుంటాయి. అది లేనిచో అవీ ఉండవు
జ్ఞాత సర్వకాలాలలోనూ జ్ఞాతయే
కనుక ద్వైతానికి అస్తిత్వం లేదు!

-- శ్రీ శంకర ఉవాచ నుంచి

నా వివరణ:
"ధీ శక్తి" జాగ్రత్, స్వప్న అవస్థల్లో మాత్రమే ఉంటుంది. సుషుప్తి లో ఉండదు.
1. జగ్రదావస్థలొ ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి బాహ్య జ్ఞేయ వస్తువులని ప్రకాశవంతం చేస్తుంది
2. స్వప్న అవస్థలో ఇంద్రియాలన్నీ మూయబడి ఉండటం వల్ల అంతరంగంలో జ్ఞేయ వస్తువులని సృష్టి చేస్తుంది
3. సుషుప్తి లో ధీ శక్తి లేక పోవడం వల్ల జ్ఞేయ వస్తువులు ఉండవు

కాని ఈ మూడు అవస్థల్లోనూ జ్ఞాత ఉంటాడు. (ఏకం ఏవ అద్వితీయం)
"ధీశక్తి", "జ్ఞేయ వస్తువులు" ఒక దాని మిద ఇంకొకటి ఆధార పడి ఉండగా, జ్ఞాత సర్వాధారమైన ఆత్మ గా, నిరాధారుడైన బ్రహ్మగా సర్వకాలాలలోనూ జ్ఞాతగా ఉంటాడు.

శ్రీ శంకరులు ఇంకొక సందర్భం లో ఇలా అంటారు
"ఆత్మ జ్ఞేయ విషయం కాదు. అందు బహుత్వ దోషం లేదు. కనుక అది ఎవరిచేతనైనా అంగీకరింపబడినదీ, నిరాకరింపబడినదీ కాదు."
మరొక సందర్భం లో:
"దేని జ్ఞానం వలన ఇక జ్ఞేయ విషయం మిగలదో, దేని ఆనందం వలన ఇక వాంఛనీయమైన ఆనందం ఉండదో, ఏది ప్రాపించుట వలన ఇక ప్రాప్యమే ఉండదో, దానిని బ్రహ్మమని తెలుసుకో"

ఓం తత్సత్

No comments: