ఏదైనా కాస్త ఉపయోగం కూడా లేని సంగతి చెపితే మా నాయనమ్మ చెపుతూ ఉండేది.
ఒరే, నువ్వు చెప్పింది "మా చచ్చిపోయిన గేద పగిలిపోయిన కుండెడు పాలు ఇచ్చేది" అన్నట్లు గా ఉందిరా! అని.
అంత గొప్ప విషయం సరే చూద్దాం అంటే "గేదా" చచ్చిపోయింది. పోనీ కుండ చూసి అది ఎంత గొప్ప గేదో నిర్ణయిద్దామంటే కుండా పగిలిపోయింది.
ఏ రకమైన జ్ఞానాన్నీ కలిగించ లేని ఇలాంటి విషయాలని "వ్యర్ధ ప్రలాపం" అనవచ్చు.
ఈ మధ్యన వార్తా పత్రికల్లొనూ, టి వీ చానళ్ళ లోనూ, ఇటువంటి విషయాలు చాల ప్రాముఖ్యతనిచ్చి చెపుతూ ఉంటే చూసి ఇక్కడ రాయాలనిపించింది.
బ్లాగుల్లో వ్యర్ధ ప్రలాపాలు ఎంతైనా చెయ్య వచ్చు.. ఇవి ఉన్నది అందుకే కదా!
--- ఈ రోజు పొలాల అమావాస్య. పొలం పనులన్నీ అయిపోయి పశువులకు పూజ చేసే రోజు . వర్షాభావం వాళ్ళ ఈ సంవత్సరం పొలం పనులు ఇంకా మొదలే కాలేదు!
Thursday, August 20, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment