ऐरण्डमवलम्ब्य कुन्ञरम् न कोपयेत्
ఆముదం చెట్టు ఆసరా చూసుకుని ఏనుగకు కోపం కలిగించ కూడదు
अतिप्रवृद्धापि शल्मली वारणस्थम्भो न भवति
ఎంత లావుగా పెరిగినా బురుగచెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించదు
अतिदीर्घोऽपि कर्णिकारो न मुसली भवति
కర్నికారం (కొండగోడు) కర్ర ఎంత పొడవు గా ఉన్నా రోకలి గా ఉపయోగించదు
अतिदीप्तोऽपि खद्योतो न पावकः
ఎంత ప్రకాశిస్తున్నా మెరుగుడుపురుగు నిప్పు కాదు
न प्रवृद्धत्वम् गुणहेतुः
(ధనాదుల చేత) బాగా ఎదిగినంత మాత్రాన సద్గుణాలు రావు
सुजीर्णोऽपि पिछुमन्दो न शुञ्कलायते
ఎంత ముదిరినా వేపకర్ర అడకత్తెరకు (సరోతా) ఉపయోగపడదు
यथा बीजम् तथा निष्पत्तिः
విత్తనాన్ని బట్టి దిగుబడి ఉంటుంది
यथा श्रुतं तथा बुद्धिः
చదువును పట్టి బుద్ధి
यथा कुलं तथाचारः
కులాన్ని పట్టి ఆచారం (నడవడిక)
संस्कृतः पिचुमन्दो न सहकारो भबति
ఎంత దోహదం చేసినా వేప తియ్యమామిడి కాదు
-చాణక్య నీతి సూత్రాలు (ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు గారి ఆంధ్ర తాత్పర్యం)
ఇటువంటి 562 సూత్రాలు 8 అధ్యాయాల్లో "రాజనీతి సూత్రాణి" పేరుతొ రచించ బడ్డాయి. ఇవి అందరికీ ఉపకరిస్తాయి.
Monday, December 28, 2009
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ
Post a Comment