అంతా మిథ్య తలంచి చూచిన, నరుడిట్లౌ టెరింగిన్, సదా
కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళహస్తీశ్వరా !
పుడమి న్నిన్నొక బిల్వ పత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం
బడయన్; నేరక పెక్కు దైవములకుం బప్పుల్, ప్రసాదంబులుం,
గుడుముల్, దోసెలు, సారె సత్తు, లటుకుల్, గుగ్గిళ్ళునుం బెట్టుచుం
జెడి యెందుం గొఱగాక పోదు రకటా శ్రీ కాళహస్తీశ్వరా!
-- శ్రీ కాళహస్తీశ్వర శతకము, ధూర్జటి.
Sunday, April 18, 2010
Subscribe to:
Posts (Atom)