Saturday, December 18, 2010

సంసారం అంటే?

కః పునః అయం సంసారః నామ?
సుఖదుఃఖసంభోగః సంసారః |
పురుషస్య సుఖ దుఃఖానాం సంభొక్తృత్వం సంసారిత్వం ఇతి |

ఏమిటి ఈ సంసారం అంటే?
సుఖదుఃఖసంభొగమే సంసారం.
పురుషుడు సుఖదుఃఖాలను అనుభవించడమే వానికి సంసారిత్వం.

-- భగవాన్ ఆది శంకరుల గీతా భాష్యం (13-20) నుంచి

Wednesday, December 15, 2010

వ్యర్థం పర్యటనం





నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్దిస్య విత్తాశయా
వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో
మజ్జన్మాంతర పుణ్యపాక బలత త్వం శర్వ సర్వాంతర
స్తిష్ఠస్యేవ హి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం

-- శ్రీ శంకర భగవత్పాదులు రచించిన శివానందలహరి లొ 57 వ శ్లొకం

nityam sva udara poshaNaaya sakalaan uddisya vitta ASyaa
vyartham paryatanam karOmi bhavatah sevaam na jaane vibhO!
mat janmaantara puNya paaka balata tvam Sarva sarvaantaraha
tisthasi eva hi tena vaa pasupate te rakshaNiiyah asmi aham.

O lord of all beings (pasupate), daily for providing myself the food (nityam sva udara poshaNaaya) and desiring wealth (vitta ASayaa), I wander around in vain from one place to another (sakalaan uddisya vyartham paryatanam karOmi). Vibho, I dont know how to serve thee! (bhavata seva na jaane vibho!). You, who sits always in the hearts of everyone and know everything (tvam, sarva, sarvaantaraha tistaseva) you should only save me (te rakshaNiiyosmaham) on account of the fruition of my past good deeds (as it were - if there are any!) (mat janmaantara puNya paaka balata)

-- This English translation is mine and is subject to all sorts of human errors!!

This "vyartha paryaTana" is true in both the cases of:
a. in this world going around here and there as well as
b. the jeeva going through multiple births in different worlds
one after the other without reaching the ultimate TRUTH!

om tat sat

Friday, December 10, 2010

అవస్థలు - మార్పు

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
తస్మైశ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిషు, జాగ్రదాదిషు, అపి, తథా, సర్వాసు, అవస్థాసు, అపి,
వ్యావృత్తాసు, అనువర్తమానం, "అహం", ఇతి, అంతః, స్ఫురంతం, సదా,
స్వాత్మానం, భజతాం, యః, భద్రయా ముద్రయా, ప్రకటీకరోతి,
తస్మైశ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్య కౌమార వార్ధక్య అవస్థల్లోనూ
జగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల్లోనూ
దర్శన స్పర్శనాది అవస్థల్లోనూ
భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోనూ,
సదా "అహం" = "నేను" అని అన్ని మార్పుల్లోనూ మార్పు చెందకుండా ప్రకాశిస్తున్న ఏ ఆత్మ కలదో
ఆ అత్మ స్వరూపమును భక్తులకు చిన్ముద్ర చే ప్రకటిస్తున్నటువంటి గురు మూర్తి శ్రీ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను.


-- శ్రీ శంకరుల దక్షిణామూర్తి స్తొత్రం 8 వ శ్లొకం

Saturday, December 4, 2010

మంత్రం - దీక్ష

దివ్య జ్ఞానం యతో దద్యాత్ కుర్యాత్ పాపస్య సంక్షయం
తస్మాద్దీక్షేతి సా ప్రొక్తా మునిభిస్తత్వవేదిభిః

ఇది దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది, పాపం యొక్క సంక్షయం చేస్తుంది. అందుచేత ఇది తత్త్వవేత్తలైన మునుల చేత "దీక్ష" అని చెప్పబడింది

గ్రన్ధే దృష్ట్వా తు మన్త్రం వై యో గృహ్ణాతి నరాధమః
మన్వన్తరసహస్రేషు నిష్కృతిర్నైవ విద్యతే

పుస్తకం చూచి మంత్రం గ్రహించే నరాధమునికి వేయి మన్వంతరాలకి కూడ ఆ పాపం నుండి విముక్తి లేదు

-- చర్యాపాదం, శైవ దర్శనం

Thursday, December 2, 2010

మాననివి

రాకన్మానవు హానివృద్ధులు మహారణ్యంబులో డాగినన్
పోకన్మానదు దేహమేవిధమునన్ బోషించి రక్షించినన్
గాకన్మానవు పూర్వజన్మకృతముల్ గాగల్గు నర్థంబులున్
లేకన్మానవదెంత జాలిబడినన్ లేముల్ సిరుల్ రాఘవా !

-- రాక, పోక, కాక, లేక మానని విషయాల గూర్చి