Friday, September 16, 2011

చింత

మాత్రా సమం నాస్తి శరీరపోషణం
విద్యాసమం నాస్తి శరీర భూషణం
భార్యాసమం నాస్తి శరీరతోషణం
చిన్తాసమం నాస్తి శరీరశోషణం
తల్లివలె శరీరాన్ని పోషించేది మరేదీ లేదు. విద్యతో సమానమైన శరీర అలంకారం లేదు. భార్య వలే శరీరానికి సౌఖ్యం కలిగించేది మరొకటి లేదు. చింత వలే శరీరాన్ని ఎండపెట్టేదీ లేదు.

చిన్తా చితాసమా హ్యుక్తా బిన్దుమాత్రవిశేషతః
సజీవం దహతే చిన్తా నిర్జీవం దహతే చితా
ఒక్క ం తేడాతో చింత, చిత సమానమైనవి. చిత చనిపోయిన శరీరాన్ని కాలుస్తుంది. చింత బతికిఉండగానే కాలుస్తుంది. 

అందుకే 
చిన్తా నాస్తి కిల
తేషాం - చిన్తా నాస్తి కిల

శమ దమ కరుణా సమ్పూర్ణానాం
సాధు సమాగమ సంకీర్ణానాం || చిన్తా ||
పరమహంసగురు పద చిత్తానాం
బ్రహ్మానన్దామృత మత్తానామ్ || చిన్తా ||

-- శ్రీ సదాశివ బ్రహ్మేన్ద్ర విరచితా "చిన్తా నాస్తి కిల" 

అంతరింద్రియములను, బహిరింద్రియములను పూర్తిగా అదుపులో ఉంచుకొన్నవారికి - సజ్జన సంగతియందు కాలము గడుపువారికి దుఃఖము లేదు! చింతలేదు! 
పరమహంసలైన శ్రీ గురువులపాదములయందు తమ్ముతామర్పించుకొన్న వారికి బ్రహ్మానందామృతపానముచే తమ్ము దా మరచువారికి చింత ఏమున్నది? శోకమే మున్నది?

పరమహంసగురు పద చిత్తానాం బ్రహ్మానన్దామృత మత్తానామ్ చిన్తా నాస్తి కిల తేషాం - చిన్తా నాస్తి కిల! 
http://www.maganti.org/audiofiles/air/songs/mbk/chintanastikila.html

No comments: