Wednesday, July 11, 2012

శ్రాద్ధం - శ్రద్ధ

శ్రద్ధయా దాత్తం శ్రాద్ధం - శ్రద్ధ తో చేయబడునది శ్రాద్దము.

-- ఆషాఢ బహుళ అష్టమి మా తండ్రి గారి ఆబ్దీక శ్రాద్ధం సందర్భంగా జగద్గురువుల మాట "శ్రద్ధ యొక్క అవసరం"

3 comments:

కీసర వంశము KEESARAVAMSAM said...

హరు మెప్పించి మహా తపో నియతు(డై యాకాశగంగానదిన్
ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తభంబుగా నవ్య సు
స్థిర లీలం బితృకృత్య మంతయు నొనెర్చెన్ వారితానేక దు
స్తర వంశవ్యధు( డా భగీరధు(డు నిత్య శ్రీకరుం డల్పు(డే!

శంకరుడిని మెప్పించి, మహా తపోనిష్ఠ కలవాడై ఆకాశగంగను
భూమి మీదకు తెచ్చి అఖండమైన తన కీర్తిలతకు స్తంబముగా
ఎంతోకాలము ఉండేటట్లు చేసి పితృకార్యమును తీర్చినవాడూ,
తన వంశస్థులకు వాటిల్లిన తీవ్ర కష్టాన్ని తీర్చినవాడూ,
నిత్యమంగళకరుడూ, ఆ భగీరధుడు సామాన్యుడా?

పోతనగారి భాగవతము తొమ్మిదవ స్కందము మత్తేభవృత్తములోని ఈ పద్యాన్ని మా తండ్రిగారు పితృకార్యముచేసే రోజున, భోక్తలు భోజనము చేసే సమయములో, శ్రీవిష్ణు సహస్రనామమునకు ముందు ఇది ఎంతో రాగయుక్తముగా చదివేవారు. అప్పుడు వారి కంఠము ఆర్ద్రము అగుట మా అందరికి బాగా జ్ఞాపకము. వారి ఆనతిన మేము ఇప్పుడు పితృకార్యము
రోజున ఈ పద్యమును చదువుట అలవాటు చేసుకున్నాము.
జాజిశర్మ.
స్వస్తి.

Prasad Chitta said...

చాలా సంతోషం జాజి శర్మ గారూ. చాలా మంచి పద్యం చెప్పారు.