Friday, June 29, 2012

తొలి ఏకాదశి

ఏకాదస్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజన ద్వయం
శుధ్ధోపవాసః ప్రథమః సత్కధా శ్రవణం తథా

-- దేహేంద్రియ సంఘాతాన్ని అదుపులోకి తెచ్చి అంతఃకరణ చతుష్టయాన్ని శుద్ధి చేసి ఐహిక ఆముష్మిక ఫలితాలను ప్రసాదించగల ఏకాదశీ వ్రతాన్ని ప్రారంభిచే తొలి ఏకాదశి సందర్భంగా

మొదటి పాదాన్ని మాత్రం చూస్తే ఏకాదశి నాడు రెండు పూటలా భొజనం చెయ్యడమే కర్తవ్యం అని చెప్పినట్లుగా ఉంటుంది. కానీ "భో, జన" =  "ఓ జనులారా" అని సరిగ్గా అన్వయం చేసుకున్న తరువాత అసలు రెండు కర్తవ్యాలూ శుద్ధోపవాసమూ మరియూ సత్ కధా శ్రవణమూన్ను. 
(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి "ఏకాదశి వ్రత మహత్యం" ప్రవచనం లో ఉటంకించ బడినది )

EkAdasyAntu kartavyam sarvEshAm bhO jana dvayam
SuddhOpavAsaH prathamaH sat katdhA SravaNam tathA

bhO jana sarveshaam - Oh all people, there are two things apply for a EkadaSi vratam. 1. Complete fasting (as much as possible to the body condition of the individual) 2. listening to sat kadhaa i.e, divine narrations of great people.

By doing these two on the Ekadasi day, the body and senses will come into control and mind gets purified giving wonderful results in the matters related to this world and beyond!

-- On the occasion of toli EkAdaSi tomorrow; the day when everyone can start the vrata of cAturmASya and EkAdaSi.


2 comments:

KVS said...

ప్రసాదు గారూ,

"భోజన" పదానికి "భో! జన!" అని అన్వయించుకుంటే మీరన్నట్టు బాగానే ఉంది.
కాకపొతే, "భోజనం" అంటే 'అనుభవించునది' అని కుడా అర్థం చెప్పుకోవచ్చు. అలా అనుకుంటే, "శుధ్ధోపవాసము", "సత్కథాశ్రవణము" అనేవాటిని ఆనందంగా అనుభవించాలి అని ఆలంకారికంగా చెప్పినట్టు ఉంది ఈ శ్లోకం. - "శుధ్ధోపవాసమూ, సత్కథాశ్రవణములే ఏకాదశిరోజున చేయాల్సిన రెండు భోజనములు (ఆనందమునూ, పుష్టినీ కలిగించే ఆహారములు)" అనే అర్థం కుడా సరిపోతోంది ఈ శ్లోకానికి.

Prasad Chitta said...

మీ అన్వయం కూడా చాలా బాగుంది శర్మ గారూ. చాలా సంతోషం