Saturday, September 21, 2013

కలి నాశనం

ఈ కలి కాలం లో కలి ప్రభావాన్ని తప్పిచుకునే మార్గం త్రిలోక సంచారి ఐన నారదుడు తన తండ్రిగారైన బ్రహ్మ దేవుని దగ్గర తెలుసుకున్న విషయాన్ని "కలి సంతరణ" ఉపనిషద్ గా మనందరికీ తెలుసు. "హరే రామ హరే రామ రామ రామ హరే హరే; హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే" అనే మహా మంత్రాన్ని మూడున్నర కోట్ల జపం, నామ సంకీర్తన వినా మరోక మార్గం లేదని ఉపనిషద్ వచనం.
http://nonenglishstuff.blogspot.in/2009/09/blog-post_14.html

అది కూడ చెయ్య లేని వారికి వ్యాస భగవానుడు మహా భారతం లో నలోపాఖ్యానాన్ని విన్న వారికీ, చెప్పిన వారికీ కలి పురుషుని ప్రభావం బాధించదని ఫల శృతి ఇచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రస్తుతం చేస్తున్న ప్రవచనంలో ఉటంకించబడి గుర్తుకొచ్చిన ఒక శ్లోకం.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ
ఋతుపర్ణస్య రాజర్ష్యేః కీర్తనం కలినాశనం

కర్కోటకుడనే నాగుణ్ణీ, మహాపతివ్రత ఐన దమయంతినీ, పరమ ధర్మాత్ముడైన నలుణ్ణీ, రాజర్షి ఐన ఋతుపర్ణుణ్ణీ కీర్తించుటవలన కలి నాశనం అవుతుంది

భగవన్నామ జపం, పుణ్యశ్లోకుల కీర్తనం ఈ కలి కాలం లో దివ్యౌషధాలు.

ఓం తత్ సత్

No comments: