Wednesday, March 13, 2024

ముగ్ధనాయిక

 ముగ్ధనాయిక పారవశ్యము

ఉ॥ పానుపుఁ జేరినంతఁ బతిప్రక్కను నీవిక జాఱి (వల్వయుం దానట మేఖలాగుణధృతంబయి నిల్చె నితంబ మం దటన్) మేనతఁ డంట, నాతఁడని, నేనని, యిట్టిది కేళి యంచు, నే మైనను భేదమే యెఱుఁగ నంగన! యంగజు మాయ యెట్టిదో! 

శ్రీ తాళ్ళపాక తిరువెంగళప్ప శృంగార అమరు కావ్యము 31 ( సంస్కృత మూలం 97 )

ఇందులో త్రిపుటి లీనమయ్యే భావన స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే సంస్కృత మూలంలో:

कान्ते तल्पमुपागते विगलिता नीवी स्वयं तत्क्षणाद्‌ तद्वासः श्लथमेखल गुणधृत्तं किंचिन्नितम्बे स्थितम् ।

एतावत्सखि वेद्मि केवलमहं तस्याङ्गसङ्गे पुनः कोऽमै कास्मि रतं तु किं कथमिति स्वत्पापि मे न स्मृतिः ॥९७॥

-- Amaru kaavyam 97

In yogic paralance this is known as triputi layam by the jeeva, who is the mugdha nAyika. This Telugu kavyam was dedicated to Lord Venkateswara by the poet. 

No comments: