Monday, January 13, 2025

శ్రీ కుఞ్చతాఞ్ఘ్రి స్తవమ్‌

బ్రహ్మైవాహం శివో హం విభురహమమలశ్చిద్ఘనోఽహం విమాయః
సోఽహం హంసస్స్వతన్త్రస్తదహమతిజరః ప్రజ్ఞయా కేవలోఽహమ్ ।
ధ్యేయధ్యాతృప్రమాణై: గలితమతిరహం నిశ్చలోఽహం సదేత
ప్రాజ్ఞా యచ్చిత్సభాయామతిశయమభజత్ కుఞ్చతాఞ్ఘ్రిం  భజేహమ్ ||242


నేను బ్రహ్మను, నేను శివుడను, నేను విభువును, పాపం లేనివాడను, చిద్ఘనుడను, మాయారహితుడను, హంసస్వరూపుడను, స్వతంత్రుడను, వార్ధక్యంలేని వాడను, కేవలం ప్రజ్ఞతో కూడినవాడను, ధ్యేయం, ధ్యాత, ప్రమాణం - అనే వీనికి అందనివాడను, సదా నిశ్చలుడను అని ప్రాజ్ఞులు ఏ పరమేశ్వరుని చిత్సభలో ఆనందాతిశయాన్ని పొందుతారు. అటువంటి, కుంచితాఞ్ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను.


--- ఉమాపతి శివ విరచితమ్‌ ( శ్రీ  క్రొధి నమ సంవత్సర భొగి, పుష్య పూర్ణిమ,  ఆరుద్రా నక్షత్రమ్‌, సోమవారం )



No comments: