సప్త కోటి మహా మంత్రాః బుద్ధి భ్రమణ కారకః
ఏక ఎవ పరో మంత్రో రామ ఇత్యక్షర ద్వయం
{There are 70 million great "mantras" that exist in scriptures that could cause confusion!
There is only one highest mantra made up of two letters: "rA, ma" .}
మన శాస్త్రాల్లో ఏడు కోట్ల మంత్రాలున్నాయని చెపుతారు. అన్నీ కఠినమైనవి, త్వరగా అర్ధం కానివీ. కాని "రామ" మంత్రం అన్నిటినీ అధిగమించింది.
-- నిన్ను నీవు తెలుసుకో నుంచి ("హంస")
Wednesday, May 26, 2010
Sunday, May 16, 2010
ఈ జీవుడు - మాయలు
ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ | నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||
ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక- | కెందరికి దోబుట్ట డీజీవుడు |
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ- | మెందరికి గావింప డీజీవుడు ||
ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక- | కెక్కడో తనజన్మ మీజీవుడు |
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు- | డెక్కడికి నేగునో యీజీవుడు ||
ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక- | కెన్నిదనువులు మోవ డీజీవుడు |
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి | యెన్నిపదవుల బొంద డీజీవుడు ||
-- అన్నమయ్య
(అక్షయ తృతీయ సందర్భంగా!)

Monday, May 3, 2010
కడునడుసు చొరనేల?
కడునడుసు చొరనేల కాళ్ళు గడుగనేల | కడలేని జన్మసాగర మీదనేల ||
దురితంబులనెల్లదొడవు మమకారంబు- | లరిదిమమతలకు దొడ వడియాసలు |
గురుతయిన యాసలకు గోరికలు జీవనము | పరగ నిన్నిటికి లంపటమె కారణము ||
తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ- | ముదుటయినతాపమున కుండగ జోటు |
పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ- | మదము పెంపునకు దనమనసు కారణము ||
వెలయు దనమనసునకు వేంకటేశుడు గర్త | బలిసి యాతనిదలచుపనికి దాగర్త |
తలకొన్న తలపులివి దైవమానుషముగా | దలచి యాత్మేశ్వరుని దలపంగ వలదా ||

Subscribe to:
Posts (Atom)