Showing posts with label రామ నవమి. Show all posts
Showing posts with label రామ నవమి. Show all posts

Tuesday, April 4, 2017

श्रीरामगीता - శ్రీరామగీతా

प्रत्यक्परोक्षादि विरोधमात्मनो-
र्विहाय सङ्गृह्य तयोश्चिदात्मताम् ।
संशोधितां लक्षणया च लक्षितां
ज्ञात्वा स्वमात्मानमथाद्वयो भवेत् ॥ २६॥

ప్రత్యక్పరోక్షాది విరోధమాత్మనో-
ర్విహాయ సఙ్గృహ్య తయోశ్చిదాత్మతామ్ ।
సంశోధితాం లక్షణయా చ లక్షితాం
జ్ఞాత్వా స్వమాత్మానమథాద్వయో భవేత్ ॥

http://sanskritdocuments.org/doc_giitaa/raamagitaa.html?lang=te

Swami ChinmayAnanda's English translation for the above verse:
Rejecting the difference of nearness and remoteness, and so on... between jIvAtma and paramAtma, one should know one's own nature as that of pure consciousness, arrived at through the inquiry and implied by the method of implication. Thereafter, realizing one's own true Self and Brahman, one should merge to become one with it.

In Adhyatma rAmAyaNa, uttara kAnDa, 5th sarga is called SrI rAma gItA. It has 62 verses and it is an instruction from Lord rAma to his brother LakshmaNa who is looking for surest path to supreme realization.
This verse is 26th SlOka in SrI rAma gIta.

pratyaksha-parOksha-Adi virOdham AtmanOH
vihAya; samgRhya tayOH cidAtmatAm
samSOdhirAm lakshaNayA ca lakshitAM
jnAtvA svamAtmAnam atha advayO bhavEt


My interpretation:
pratyaksham i.e, imminence and parOksham i.e, transcendence are virOdham mutually opposing qualities of Self. By vihAya giving up this contradictions within the description of Self, accepting the true nature of cidAtmatAm pure consciousness in them -- samSOdhitAm one should perform inquiry into its lakshaNayA quality as the goal and the one who is lakshitAm aiming at that goal. jnatvA Having realized svamAtmAnam the own Self as supreme, atha advayO bhavEt one should become non-dual .

Let one and all engage in such a great inquiry resulting in non-dual realization as instructed by Lord rAma. om tat sat.



Friday, December 5, 2014

నిజమైన రాజులు

గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు 
రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు 
 - కరుణశ్రీ 
 

అలాంటి రాజులేలిన శ్రీ రామ భక్తి సామ్రాజ్యానికి నన్ను చేర్చిన నావలు స్వామి శ్రీ విరాజేశ్వర సరస్వతి పాదుకలు

Tuesday, April 8, 2014

అత్రి ముని కృత రామ స్తుతి

నమామి భక్త వత్సలం. కృపాలు శీల కోమలం..
భజామి తే పదాంబుజం. అకామినాం స్వధామదం..
నికామ శ్యామ సుందరం. భవామ్బునాథ మందరం..
ప్రఫుల్ల కంజ లోచనం. మదాది దోష మోచనం.. 1 ..

ప్రలంబ బాహు విక్రమం. ప్రభోప్రమేయ వైభవం..
నిషంగ చాప సాయకం. ధరం త్రిలోక నాయకం..
దినేశ వంశ మండనం. మహేశ చాప ఖండనం..
మునీంద్ర సంత రంజనం. సురారి వృంద భంజనం.. 2 ..

మనోజ వైరి వందితం. అజాది దేవ సేవితం..
విశుద్ధ బోధ విగ్రహం. సమస్త దూషణాపహం..
నమామి ఇందిరా పతిం. సుఖాకరం సతాం గతిం..
భజే సశక్తి సానుజం. శచీ పతిం ప్రియానుజం.. 3 ..

త్వదంఘ్రి మూల యే నరాః. భజంతి హీన మత్సరా..
పతంతి నో భవార్ణవే. వితర్క వీచి సంకులే..
వివిక్త వాసినః సదా. భజంతి ముక్తయే ముదా..
నిరస్య ఇంద్రియాదికం. ప్రయాంతి తే గతిం స్వకం.. 4 ..

తమేక మద్భుతం ప్రభుం. నిరీహమీశ్వరం విభుం..
జగద్గురుం చ శాశ్వతం. తురీయమేవ కేవలం..
భజామి భావ వల్లభం. కుయోగినాం సుదుర్లభం..
స్వభక్త కల్ప పాదపం. సమం సుసేవ్యమన్వహం.. 5 ..

అనూప రూప భూపతిం. నతోSహముర్విజా పతిం..
ప్రసీద మే నమామి తే. పదాబ్జ భక్తి దేహి మే..
పఠంతి యే స్తవం ఇదం. నరాదరేణ తే పదం..
వ్రజంతి నాత్ర సంశయం. త్వదీయ భక్తి సంయుతా.. 6 ..

-- ఇతి అత్రి మహాముని కృతా శ్రీరామ స్తుతిః సంపూర్ణా

This is a prayer rendered by great Atri mahAmuni to Lord SrI  rAma. In fifth verse he says "You are the wonderful lord (lord, lord multiple words declaring the lordship over all layers of physical, psychological and spiritual existence), eternal teacher of the world, the fourth state of existence which is completely independent. I sing the prise of the husband of the whole world. Impossible to be attained by those who are not honest or just act like bhaktas (ku+yOgis), you are the kalpa vRkhsa (wish granting tree) for the devotees and equal towards everyone. prayed by such devotees always."

Wishing one and all a great SrI rAma navami.....



Wednesday, April 17, 2013

తారక మంత్రము


రాగం - ధన్యాసి; తాళం - ఆది 

పల్లవి: తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా

అను పల్లవి: మీఱిన కాలుని దూతలపాలిటి
మృత్యువె యది నమ్మర యన్నా

చరణం 1: ఎన్ని జన్మముల నెంచి చూచినను
ఏకో నారాయణుడన్నా
అన్ని రూపులై ఉన్న పరాత్ముని
నా మహాత్ముని కథలను విన్న ||తా||

చరణం 2: ఎన్ని జన్మముల జేసిన పాపము
లీ జన్మముతో విడునన్నా
అన్నిటికి కడసారి జన్మమిది
సత్యం బిక పుట్టుట సున్నా ||తా||

చరణం 3: ధర్మము తప్పక భద్రాద్రీశుని
తనమదిలో నమ్ముచునున్న
మర్మము దెలిసిన రామదాసుని హృ
న్మందిరమున నే యున్న ||తా||

 -- శ్రీ రామదాసు

tAraka mantramu kOrina dorikenu
dhanyuDanaitini OrannA


tArakam means 'that which helps you cross over' the difficult samsAra. mantram means 'helps crossing over by the means of thought' So, tAraka mantram is one which helps to cross over this repetitive samsAra by simply thinking about it. Such a formula can only be given by someone who has successfully used and experienced the result of the formula by himself. A Guru can provide such a tAraka mantramu to a deserving sishya. Having got such a mantram one becomes accomplished - dhanya.

mI~rina kAluni dUtalapAliTi
mRtyuve yadi nammara yannA


It is the death for the yama dUtas (kAluni dUtalu). The tArakamantram is the death for yama dutas. Have faith in this!

enni janmamula nenci cUcinanu
EkO nArAyaNuDannA
anni rUpulai unna parAtmuni
nA mahAtmuni kathalanu vinna


The ultimate Atma (paramAtma) appears in various forms e.g., mathya, kUrma... kRShna, rAma... but in the essence he is the only ONE. Listening to those narrations of lord nArAyaNa in various forms leads to the fruition of tArakam.

enni janmamula jEsina pApamu
lI janmamutO viDunannA
anniTiki kaDasAri janmamidi
satyam bika puTTuTa sunnA


The pApamulu i.e., sins carried out by me over several past lives are going to be detached / removed from me in this life (due to the power of the tAraka mantramu!) This is the very last life and I am absolutely sure not to take another birth! (or the probability of me taking another form is ZERO)

dharmamu tappaka bhadrAdrISuni
tanamadilO nammucununna
marmamu delisina rAmadAsuni hR
nmandiramuna nE yunna


Not falling off from the path of righteousness and being faithful to the Lord of bhadrAdri from deep of heart; also who knows the secret (marmamu) that the lord resides in the heart-temple of SrI rAmadAsu (the servant of rAma) - declares that "I have got the tAraka mantram as desired and I have become accomplished by it."

-- On the occasion of rAma Navami this Friday 19th April.

Let there be grace of Lord rAma on one and all and let everyone who desires the tAraka mantram; HE lets them have it. 

om tat sat.

Friday, March 8, 2013

మోక్ష సాధన ఎప్పుడు?

సరిగ్గా పది మాసాల క్రితం భగవత్ చింతనకు తరుణం ఎప్పుడు? అని మహాకవీంద్రుడు గొప్ప శివ భక్తుడు అయిన ధూర్జటి యోక్క కాళహస్తీశ్వర శతకం లోని ఒక పద్యాన్ని చూశాం. 

ఇప్పుడు పరమ రామ భక్తుడైన రామదాసు గారి దాశరథీ శతకం నుంచి అదే భావాన్ని గమనిద్దాం:

మనమున నూహపోహణములు మర్వకమున్నె కఫాది రోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుటల్
తనువునకున్ విరోధమది దాశరథీ కరుణాపయోనిధీ.

--శ్రీ నందన నామ సంవత్సర మాఘ బహుళ ఏకాదశి (విజయ ఏకాదశి) సందర్భంగా...

A verse from dASarathI satakam of bhakta rAmadAsu that reinforces the same bhava as my past post - http://nonenglishstuff.blogspot.in/2012/04/blog-post_16.html made exactly 10 months back.

Uha (proper understanding), apOha (misunderstanding) are the capabilities of mind. While these capabilities of mind are strong, before the diseases take over the body and while body is still strong to take up the austereties, MAN should take up the sAdhana i.e., practice to attain mOksha (ultimate realization). Not performing tattva vicAra (self enquiry) is counter productive of having body (+ mind + intellect)

-- SrI nandana nAma samvatsara mAgha bahuLa EkAdaSi (Vijaya EkAdaSi)

Sunday, February 24, 2013

మహా మాఘి

విన్నపమాలకించు రఘువీర! నహిప్రతి లోకమందు నా
కన్న దురాత్ముడున్, బరమకారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడున్ బతితకల్మషదూరుడు లేడు  వి
ద్వన్నుత నీవె నాకు గతి, దాశరథీ కరుణాపయోనిధీ

vinnapamAlakincu raghuvIra nahiprati lOkamandu nA
kanna duraatmuDun baramakAruNikOttama vElpulandu nI
kanna mahAtmuDun batitakalmashadUruDu lEDu vi
dvannuta nIve nAku gati dASarathI karuNApayOnidhI


శ్రీ రామదాసు యొక్క ఇదే భావాన్ని శ్రీ కృష్ణ శతక కర్త ఇలా

రఘునాయక నీ రూపము
లఘుమతితో దలప గలనే లక్ష్మీ రమణా
అఘముల బాపుము దయతో
రఘురాముడవైన లోక రక్షక, కృష్ణా!

O RaghuNAyaka, dASarathI, SrI rAmA! there is no one better than you( Thou - is the real self, Atma) in compassion (karuNa) and who can cleance the aghamu (sins) of devotee. At the same time there is no one who is a great sinner than me (me here represents the ignorant ahamkAra, ego which thinks itself as atma or soul) over here. Thy grace, thy name is the only path for me to cleance me of my sins (of ahamkAra and Ignorance)

Past post on this subject: http://nonenglishstuff.blogspot.in/2011/02/blog-post_18.html

mahA mAghi on 25th February 2013. Let the grace of Lord be on one and all and bad impacts of past bad deeds be removed for all those who surrender to Lord.

Thursday, March 29, 2012

శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం - 2

నమస్తే నమస్తే సమస్త ప్రపంచ
ప్రభోగ ప్రయోగ ప్రమాణ ప్రవీణ
మదీయం మన స్త్వత్పద ద్వన్ద్వ సేవాం
విధాతుం ప్రవృత్తం సుచైతన్య సిధ్ధ్యై

namastE namastE samasta prapanca
prabhOga prayOga pramANa pravINa
madIyaM mana stvatpada dva&n&dva sEvAM
vidhAtum pravRttaM sucaitanya sidhdhyai

prabhOga = the capability to enjoy 
prayOga = the capability to give it to someone else for enjoyment
pramANa = the complete understanding of 


this whole world  (samasta prapanca)


one who possesses these three qualities is called Iswara or the LORD. 

I bow down again and again for such LORD (Sri RAMA) and let my mind get engaged in the seva of your lotus feet (tvat pada dvandwa) such that it attains the su-chaitanya (the right knowledge! that leads to moksha). 

-- from SrI rAma bhujanga prayaata stotram of Adi Sankaracharya

om tat sat

Wednesday, March 28, 2012

శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం

యదావర్ణయత్ కర్ణమూలేఽన్త కాలే 
శివో రామ రామేతి రామేతి కాశ్యాం
తదేకం పరం తారక బ్రహ్మరూపం
భజేఽహం భజేఽహం భజేఽహం భజేఽహం

yat AvarNayat karNa-mUlE anta-kAle
SivaH "rAma rAmEti rAmEti" kASyAm
tat Ekam param tArakabrahmarUpam
bhajE'ham bhajE'ham bhajE'ham bhajE'ham

I pray to Lord Raama, the ONE, transcendent, whose name is uttered in the ears of devotees in the city of Kaasi at the time of death, by none other than Lord Shiva as "raama, raama, raama" which denotes the form to "taaraka brahma" that transcends devotees beyond this samsaara of birth and death!

-- May this SrI rAma navami over the weekend bring both material and spritual upliftment to one and all.

Full stotram with meanings @ http://sanskritdocuments.org/all_pdf/raamabhujanga.pdf

Sunday, October 16, 2011

రామ

రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దసోsస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర

1. రామో రాజమణిః సదా విజయతే
2. రామం రమేశం భజే
3. రామేణాభిహతా నిశాచరచమూ
4. రామాయ తస్మై నమః
5. రామాన్నాస్తి పరాయణం పరతరం
6. రామస్య దసోsస్మ్యహం
7. రామే చిత్తలయః సదా భవతు మే
8. భో రామ మాముద్ధర 

-- రామ శబ్దం - ఏ విభక్తిలోఐనా.....


Wednesday, June 29, 2011

హృదయకపి

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ||

-- శివానందలహరి

అత్యంత చపలమైన నా హృదయ కపి ఎల్లప్పుడూ మోహారణ్యంలో యువతుల కుచ గిరులపైన తిరుగుతూ, ఆశా శాఖలను (ఊడలనూ) పట్టుకుని ఊగుతూ, స్వైర విహారం చేస్తొంది. ఓ శివా, నీవు కపాలివి, భిక్షుడవు; ధృఢమైన భక్తి అనే బంధనం తో దీనిని బంధించి నీ అధీనం చేసుకోవయ్యా! (ఈ కోతి నీ వెనకాల తిరుగుతూ ఉంటే ఉపయోగం గా ఉంటుందేమో! దీనిని నేనే పట్టి నీకప్పగించే శక్తి నాకు లేదు!! స్వామీ శరణు!!!)

ఇదే భావాన్ని భక్త రామదాసు:
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ.

ధూర్జటి:
తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగియించి నీదుచరణ స్తంభంజునం గట్టివై
చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!

Saturday, June 11, 2011

రామేశ్వరం ఏ సమాసం?

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయో రప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్‌

-- దశ పాపహర దశమి, శ్రీరామ చంద్ర మూర్తి రామేశ్వరం లో ప్రతిష్ఠించిన రోజు

రామేశ్వరం ఏ సమాసం? తత్‌ పురుషమా? "రామస్యఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు- అని అర్థం ఏర్పడుతుంది. అపుడు అది శివాధిక్యం చెపుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివునికంటె ఏ విధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు. అతనికి పైన ఇంకో ఈశ్వరుడా? ఈసందేహాలన్నీ తీర్చెవా రెవరు? వారు విష్ణుమూర్తినే అడిగి చూడామని అనుకొని వైకుంఠం వెళ్ళారు. "ఇంత చిన్న విషయానికి ఇంతదూరం ఎందుకు వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెసుస్తున్నదే తత్పురుష అని. రామస్య ఈశ్వరః అని. విష్ణుమూర్తి దేవతలతో అన్నాడట. కాని దేవతలకు మాత్రం సందేహనివృత్తి కాలేదు.

విష్ణువు నడిగాం సరిగదా, ఇక ఆ శివుణ్ణే అడుగుదాం, ఆయన ఏంచెప్తాడో చూదాం అని అనుకొని "విష్ణు స్తత్పురుషం బ్రూతే" అని అనుకొంటూ కైలాసానికి వెళ్ళగా, శివుడు "ఇందులో సందేహానికి అవకాశం ఏముందయ్యా? రామేశ్వర పదం బహువ్రీహిసమాసం రాముడే ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు' అని ఆయన బదులు చెప్పాడట.

దేవతలకు ఏమీ తోచింది కాదు. వ్యాకరణ విషయంలో శివకేశవులకు ఈలాటి భేదాభిప్రాయాలు కలుగుతవని దేవతలకు కలలోనయినా తోచలేదు. "వీరిద్దరికి పేరుతో ప్రసక్తి ఉన్నందున వేరే మధ్యవర్తిని అడిగి సందేహం తొలగించుకొందామని "బహువ్రీహిం మహేశ్వరః" శివుడుబహువ్రీహీ సమాసం అని చెప్పుకొంటూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట.

బ్రహ్మదేవతలకు కలిగిన సందేహాన్ని జరిగినసమచారాన్నీ శాంతంగావిని "ఇది తత్పురుషసమాసము కాదు, బహువ్రీహిన్నీ కాదు, మరి కర్మధారయసమాసం, వీరరాఘవు డంటే వీరుడు ఒకడూ రాఘవుడు మరొకడూనా? కాదుగదా? ఆలాగే రామేశ్వరు డంటే రాము డొకడూనూ ఈశ్వరుడింకోడూనా? రాముడే యీశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అర్థం. కాగా "రామశ్చాసావీశ్వరశ్చ" రామేశ్వరః అని కర్మధారయమే యిది అని తీర్పు చేశారుట బ్రహ్మగారు.

-- జగద్గురు బోధలు నుంచి

Tuesday, May 31, 2011

రాముడు, శివుడు

కృతాభిషేకస్స రరాజ రామః
సీతా ద్వితీయాస్సహ లక్ష్మణేన |
కృతాభిషేకోతు అగరాజ పుత్ర్యా
రుద్రస్స నందిర్భగవానివేశః || 43

కృత, అభిషేకః, స, రరాజ, రామః
సీతాద్వితీయాః, సహ, లక్ష్మణేన |
కృత, అభిషేకః, తు, అగ-రాజ-పుత్ర్యా
రుద్రః, స, నందిః, భగవాన్, ఇవ, ఈశః ||

43. siitaa dvitiiyaH=Seetha, as second-half [along with]; saH raamaH= that, Rama; kR^ita abhiSekaH= on making [having taken,] river bath; saha lakSmaNena= with Lakshmana; aga raaja putryaa= with mountain, king's, daughter [Paarvati]; kR^ita abhiSekaH= making [having taken,] sacred bath, but; sa nandiH= one with Nandi, the Holy Bull; iishaH bhagavaan rudraH iva= all-controlling, god, Rudra [Shiva in fury,] like; raraaja= shone forth.

ఈ విధంగా సీతా, రామ, లక్ష్మణులలో పార్వతీ, శివ, నందులలోని అబేధాన్ని దర్శించారు ఆదికవి!

--వాల్మీకి రామాయణే ఆది కావ్యే అరణ్య కాణ్డే షోడశః సర్గః
(కృష్ణాంగారక చతుర్దశి, మాస శివరాత్రి సందర్భంగా )

Sunday, May 15, 2011

రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె...

సమస్యా పూరణం: "రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై" అన్న దానికి పూరణ

చేవ నొసంగ జాతికిని జీవ మొసంగగ బండ రాతికిన్
సేవ నొసంగ కోతికిని శిక్ష నొసంగగ చుప్పనాతికిన్
దేవ మునీంద్ర శాపమును దీరిచి ముక్తి నొసంగగా
రావణ కుంభకర్ణులకు; రాముడు పుట్టె గుణాభిరాముడై

మహా కవుల పూరణ లో సమస్య పూర్తిగా కనిపించకుండా పోయింది!

-- "
కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పూరణ

Thursday, April 14, 2011

రామాఖ్యం మన్మహే మహః

"వైదేహీవివృతం దివ్యం సచ్చిత్సుఖరసం చ యత్,
వైదేహీవిచితం ధ్యేయం తాపత్రయహరం చ యత్,
వైదేహీసంయుతం ధర్మ్యసంసిద్ధిదం చ యత్,
జ్ఞానధ్యానాధ్వరాప్యం తత్ రామాఖ్యం మన్మహే మహః" 1,2

"ప్రమాతా చ ప్రమాణం చ ప్రమేయం చ ప్రమేతి హ
యదేకం భాతి తత్సర్వం రామాఖ్యం మన్మహే మహః" 3

1,2 : "దివ్యమూ, సచ్చిదానందరూపమూ అయిన ఏ మహాతేజస్సు విదేహముక్తావస్థయందు ఆవిష్కృతం అవుతుందో, ధ్యానింపదగినదీ, త్రివిధతాపవినాశకమూ అయిన ఏ తేజస్సు దేహస్మృతి కూడ లేని నిర్వికల్పసమాధిస్థితిలో అన్వేషింపబడుతుందో వైదేహీదుహితా సహితమూ ధర్మసంరక్షకమూ అయిన ఏ తేజస్సు ధర్మసంమత మైన సిద్ధిని ప్రసాదిస్తుందో, అట్టి 'రామ' అను పేరుతో ఉన్న జ్ఞాన - ధ్యాన - యజ్ఞములచే పొందదగిన మహా తేజస్సును మననం చేయుచునాము."
3: "అద్వితీయమైన ఏ మహాతేజస్సు ప్రమాతగాను, ప్రమాణముగాను, ప్రమేయముగాను, ప్రమగాను భాసిస్తూన్నదో, 'రామ' అను సకలజదాత్మయైన ఆ మహా తేజస్సును మననం చేయుచున్నాము."

-- ఇది మహామహోపాధ్యాయ ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారి పితృచరణులు బ్రహ్మశ్రీ పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు రచించి అనుదినమూ బ్రాహ్మీముహుర్తమున వారిచే ఉపాంశుజపమందు అనుసంధానము చేయబడిన శ్రీ రామాద్వైత ప్రతిపాదక శ్లొకత్రయము.
-- ( శ్రీమద్రామాయణామృతతరంగిణిలో మనోభావ లహరీ విలాసాలు అనే గ్రంధం నుంచి )

Monday, April 11, 2011

జానకీపతీ! నిను నమ్మితి, నిన్నే నమ్మితి.

నమ్మితి రామచంద్ర మది నమ్మితి రాజకులేంద్ర మేలుగా
నమ్మితిఁ గీర్తిసాంద్ర కడునమ్మితి దాసచకోరచంద్ర నా
నమ్మిక లేమి చేసెదవొ నమ్మగ నర్హుల గానివారలన్
నమ్మనయా దయాబ్ధివని నమ్మితి నిన్మది జానకీపతీ

వందే నీలసరోజకోమలరుచిం వందే జగద్వందితం
వందే సూర్యకులాబ్ధికౌస్తుభమణిం వందే సురారాధితమ్
వందే సాధకవంచక ప్రహరణం వందే జగత్కారణం
వందే వింశతిపంచతత్త్వరహితం వందే సదా రాఘవమ్

-- స్వస్తి శ్రీ ఖర నామ సవంత్సర శ్రీరామనవమి సందర్భంగా

Monday, February 7, 2011

రామా! ఆర్తరక్షామణీ!

బాలక్రీడలఁ గొన్నినాళ్ళు, పిదపన్ భామాకుచాలింగనా
లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్ళు, మరి యిల్లున్ ముంగిలిన్ గొన్నినా
ళ్ళీలీలన్ విహరించితిన్, సుఖఫలం బిందేమియున్ లేదుగా
హాళిన్ నీ పద సేవఁ జేసెదను రామా! ఆర్తరక్షామణీ!

-- శ్రీ రామ దాసు(?)

Tuesday, November 23, 2010

జయ శ్లొకములు

జయత్యతిబలో రామో లక్ష్మణః చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవొ రాఘవేణాభిపాలితః || 5-42-33

దాసోహం కొసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః |
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః || 5-42-34

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవెత్ |
శిలాభిః తు ప్రహరతః పాదపైః చ సహస్రశః || 5-42-35

అర్దయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం |
సమృద్ధార్థొ గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం || 5-42-36

ధర్మాత్మా సత్యసంధస్చ రామో దాశరథీర్యది || 6-90-71 (second half)
పౌరుషే చాప్రతిద్వంద్వస్తదేనం జహి రావణిం | 6-90-72 (first half)

--వాల్మీకి రామాయణం నుంచి

Wednesday, September 29, 2010

అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాము డనంత రూపమున వింతలు సలుపగ అంతా రామమయం బీ జగమంతా రామమయం
సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు నఖిల జగంబులు అంతా రామమయం బీ జగమంతా రామమయం
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అంతా రామమయం బీ జగమంతా రామమయం
నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు అంతా రామమయం బీ జగమంతా రామమయం
అష్ట దిక్కులును ఆదిశేషుడును అష్ట వసువులును అరిషడ్వర్గము అంతా రామమయం బీ జగమంతా రామమయం
ధీరుడు భద్రాచల రామదాసుని కోరిక లొసగెడి తారక నామము అంతా రామమయం బీ జగమంతా రామమయం

---- భద్రాచల రామదాసు

Thursday, June 3, 2010

రాముని గుణములు

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియత ఆత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ |1-1-8|
బుద్ధిమాన్ నీతిమాన్ వాఙ్గ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః |
విపులాంసో మహాబాహుః కంబు గ్రీవో మహాహనుః |1-1-9|
మహోరస్కో మహేష్వాసో గూఢ జత్రుః అరిందమః |
ఆజాను బాహుః సుశిరాః సులలాటః సువిక్రమః |1-1-10|

సమః సమ విభక్త అంగః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్ |
పీన వక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభ లక్షణః |1-1-11|
ధర్మజ్ఞః సత్యసంధః చ ప్రజానాం చ హితే రతః |
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిః వశ్యః సమాధిమాన్ |1-1-12|
ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా|1-1-13|
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేద వేదాఙ్గ తత్త్వజ్ఞో ధనుర్వేదే నిష్ఠితః |1-1-14|
సర్వ శాస్త్ర అర్థ తత్త్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
సర్వలోక ప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః |1-1-15|

సర్వదా అభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః |
ఆర్యః సర్వసమః చ ఏవ సదైవ ప్రియ దర్శనః |1-1-16|
స చ సర్వ గుణోపేతః కౌసల్య ఆనంద వర్ధనః |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవాన్ ఇవ |1-1-17|
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియ దర్శనః |
కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథ్వీ సమః |1-1-18|

ధనదేన సమః త్యాగే సత్యే ధర్మ ఇవ అపరః |
తం ఏవం గుణ సంపన్నం రామం సత్య పరాక్రమం |1-1-19|

-- వాల్మీకి రామాయణం నుంచి

Wednesday, May 26, 2010

రామ మంత్రం

సప్త కోటి మహా మంత్రాః బుద్ధి భ్రమణ కారకః
ఏక ఎవ పరో మంత్రో రామ ఇత్యక్షర ద్వయం

{There are 70 million great "mantras" that exist in scriptures that could cause confusion!
There is only one highest mantra made up of two letters: "rA, ma" .}

మన శాస్త్రాల్లో ఏడు కోట్ల మంత్రాలున్నాయని చెపుతారు. అన్నీ కఠినమైనవి, త్వరగా అర్ధం కానివీ. కాని "రామ" మంత్రం అన్నిటినీ అధిగమించింది.

-- నిన్ను నీవు తెలుసుకో నుంచి ("హంస")