Saturday, January 29, 2011

కొఱగానివి

వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు,
భక్తి విస్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,
సదాభ్యాసము లేని విద్య, పరిహాసము లేని వాచ్య ప్రసంగముల్,
గ్రాసము లేని కొలువు, కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

--- జక్కన చెప్పిన 'పెమ్మయ సింగధీమణి' శతకము నుంచి

vaasana lEni puvvu = A flower devoid of sweet smell,
budha vargamu lEni puramu = A city devoid of realized, wise men
bhakti visvaasamu lEni bhaarya = A wife devoid of devotion, faith
guNavantudu kaani kumaarudu = A son devoid of good qualities
sadaabhyasamu lEni vidya = A vidya (knowledge in a branch of science or arts etc., ) devoid of continuous practice (for own as well as others benefit!)
parihaasamu lEni vachya prasangamu = A speech (or a piece of literature work) devoid of sense of humor
graasamu lEni koluvu = A job devoid of right remuneration
koragaanivi = Absolutely useless! (they are useless even when possessed --- Just like black money in foreign banks!)

4 comments:

Unknown said...

కారము లేని కూర .పద్యం కూడా చేప్పండి దయచేసి

Unknown said...

పేరడీ:. వాసన లేని పువ్వు........
కారము లేని కూర మమకారము లేని సతీ సుతుల్ పుర స్కారము లేని గౌరవము సంతసమీయని జీతభత్యముల్
క్షీరము లేని పాయసము సేమము కోరని బంధు వర్గమున్
సార విహీనమంచు మనసా వచసా గ్రహియించు సోదరా!

venkatdubagunta said...

Whether this book is available,if so,where can I find...please

డా. రాంభట్ల వేంకటరాయ శర్మ said...

బాగుందండి