Monday, November 21, 2011

మానవ జీవిత పరమావధి


25 సంవత్సరాల క్రితం, శ్రీ క్షయ నామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి (ఉత్పత్తి ఏకాదశి) రోజున, నేను 8 రూపాయలకి "కర్మ యోగము" అనే పుస్తకమును శ్రీ రామకృష్ణ మిషన్ వారి ప్రచురణల నుంచి కొని చదవటం ప్రారంభించాను.  ఆ పుస్తకం  కర్మ యోగము మీద శ్రీ వివేకానందుల ప్రసంగాల సంకలనం.

మానవ జీవితమునకు అర్థమేమిటి? అనే ప్రశ్న కలగడమే అదృష్టం. దానికి సరైన సమాధానం దొరకడం ఇంకా కష్టం.

25 సంవత్సరాల తరువాత ఈ శ్రీ ఖర నామ సంవత్సర ఉత్పత్తి ఏకాదశి నాడు "కర్మ యోగము" నుంచి ఒక తెలుగు వాక్యం మరియు ఒక సంస్కృత వాక్యం :

1. "మానవ జీవిత పరమావధి సుఖము కాదు; జ్ఞానము. " 
2. "ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ" 

జీవులన్నీ కూడా సుఖము కొరకే జీవిస్తూన్నవి. ఆ సుఖ లాలస లో అమృతానంద కారకమైన ఆత్మ "జ్ఞానము" ను సంపాదించే ప్రయత్నము చేయుటకు అనుకూలమైన బుద్ధి జీవుని జన్మ మానవ జన్మ.

మోక్ష కారకమైన ఆత్మజ్ఞానము కొరకు సాధన చేస్తూ జగత్తు హితము కొరకు పాటుపడటమే మానవ జీవిత పరమార్థం

ఈ రెండు వాక్యాలూ నా ఆలోచనలను నడిపిన దారిలో నా కోసం నేను రాసుకున్న (బ్)లాగు పొస్టులు. -
1.   know thy self
2.   yOga vEdAnta
3.   plain truths

-- ఈ శ్రీ ఖర నామ సంవత్సర  కార్తీక బహుళ ఏకాదశి, చివరి కార్తీక సోమవారం సందర్భంగా


No comments: