Friday, November 25, 2011

శివ తత్త్వం


నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు
నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు
కోరితే సొకమ్ముబాపగలడు...((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగపైకెత్తగలడు పాపులను తుంగలో తొక్కగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు కొండపై ఉండగలడు వరమిచ్చి గుండెలో పండగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు ఒద్దంటే రెంటినీ మూయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు సగము పంచీయగలడు తిక్కతో అసలు తుంచేయగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు మనలోన కలవగలడు దయతోటి తనలోన కలపగలడు((నాలోన))

నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు 
నాలోన గల శివుడు నీలోన గల శివుడు నాటకాలాడగలడు 
తెరదించి మూటగట్టేయగలడు(౩)

-- శ్రీ తనికెళ్ళ భరణి గారి అనుభూతి నుంచి జారిన తత్త్వం..
 శివ తత్త్వాన్ని జానపద పరిభాషలో పోలి స్వర్గం, పోలాల అమావాస్య సందర్భంగా
(ఇదే తత్త్వాన్ని మొన్న వేసిన జీవన్ముక్తానందలహరీ అనే టపా లో దేవ భాష లో చూశాం)

1 comment:

Anonymous said...

వింటే ఇంకా బాగుంటుంది. స్వీయస్వరంలో తనికెళ్ళ భరణిగారు చక్కగా పాడారు కూడా...