Friday, February 3, 2012

ఒక సూర్యుడు

ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుండు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై.

ఒకే సూర్యుడు, సమస్త జీవులకు వేర్వేరుగా ఒక్కోక్క సూర్యుడున్నట్లు తోచునట్లుగా ఏ దేవుడు సర్వకాలాలలోనూ తన లీలచే తననుంచే ఉద్భవించిన జీవ సమూహముల హృదయకమలములలో అనేక రూపములలో నోప్పుచుండునో ఆ దేవుడైన హరిని (శ్రీ కృష్ణుని) నేను శుద్ధ మనస్కుడనై ప్రార్థించెదను.  

-- పోతన భాగవతము లో భీష్మ పితామహుడు అంపశయ్య నుంచి శ్రీ కృష్ణుని గూర్చి;
-- భీష్మ ఏకాదశి సందర్భంగా
Post a Comment