శ్రీ రామాయణన్ని పరిశీలిస్తే శ్రీ రామచంద్ర ప్రభువుని వివిధ సమయాలలో అక్లిష్ట కర్మణః అనే విశేషణం తో గుర్తించటం జరుగుతుంది. (బాలకాండ లొ 77 సర్గ, అయోధ్య కాండ లో 24, 72, 76, 85 వ సర్గలలో , అరణ్య కాండ 24, 31, 33, 3 8, 39, 50 వ సర్గలలో, కిష్కింధ కాండ 26, 53 సర్గలలో, సుందర కాండ 30, 35, 42, 43, 58 వ సర్గలలో ముఖ్యంగా జయ శ్లోకాలలో, యుద్ధ కాండ లోని 41, 68, 72, 128 సర్గలలోనూ)
ఈ అక్లిష్ట కర్మ అంటే ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి చేసిన పనులన్నీ క్లిష్టమైనవిగానే కనిపిస్తాయి గదా? అరణ్యాలకు వెళ్ళడం, అనేక మైన రాక్షసులను సంహరించడం, ఋషులను రక్షించడం, సీతమ్మను వెతకడం , సేతు బంధనం, రావణ వధ.... ఈ రకం గా శ్రీ రామ చంద్రుని ఏ కర్మ ను విశ్లేషించినా అది క్లిష్టం గానే కనిపిస్తుంది.
అక్లిష్ట కర్మ అంటే చిక్కు పడని పని. కర్తను ఈ ప్రపంచముతో బంధించని/ముడివేయని పనిని అక్లిష్ట కర్మ అంటారు.
శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు:
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః |
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః || (4 వ అధ్యాయం , 19వ శ్లోకం)
ఎవని సర్వ కార్యములు కామ సంకల్ప రహితములో, జ్ఞానమనే అగ్నిలో దహించబడినవో వానిని పండితుడు అని బుధులు (అన్నీ చక్కగా తెలిసినవారు) అంటారు.
పరమాత్మ శ్రీ రామునిగా ఆచరించి చూపించిన అక్లిష్ట కర్మణత్వమే, శ్రీ కృష్ణునిగా గీతగా వచించారు.
కర్మ ఫలములను ఆశించని స్వధర్మానుష్టానమే అక్లిష్ట కర్మ. స్వధర్మమునందు వెనుదిరుగకుండుటయే ధైర్యము. ధైర్యమైన స్వధర్మానుష్టానాచరణ, ప్రబొధములే అవతార ప్రయోజనము. అటువంటి అక్లిష్ట కర్మ వలనే మానవుడు కర్మబంధాల నుంచి విమిక్తుడవుతాడు! మోక్షగామి అవుతాడు!!
--శ్రీ ఖరనామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి, ఆదివారం (చివరి మాఘ ఆదివారం) సందర్భంగా
Let one and all get on with the untangling work diligently and attain the final goal of life - saccidaananda - infinite existence, consciousness and bliss.
Sunday, February 19, 2012
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
చక్కగా 'అక్లిష్ట కర్మ' గురించి వివరించారు. మంచి విషయాలను తెలియజేస్తున్నారు. ధన్యవాదాలండి.
చాలా సంతోషం అమ్మా భారతీ!
Post a Comment