Sunday, February 5, 2012

బాల కృష్ణునిలో శివుడు


శరీరాన్నంటుకున్న దుమ్ము విభూతి పూత అవగా, నుదుటి పైన ముత్యపు బొట్టు ఫాలమునున్న చంద్రవంక అవగా, నుదుటి మీద పెట్టిన నల్లని బొట్టు మన్మధుని కాల్చిన మూడవ కన్ను అవగా, కంఠమాలికలోని పెద్ద నీలపు రత్నము శివుని నీలకంఠము లా కనిపించగా, మెడలోని హారములు శివుని మెడలోని పన్నగ హారములు అవగా, బాల లీలలు చూపుచున్న బాలకుడు శివునకు తనకూ యెట్టి భేదము లేనట్లుగా వెలసెను.

-- మాఘ మాస ఆదివారం శుద్ధ త్రయోదశి ప్రదోషం సందర్భంగా పరమ భాగవతులు దర్శించిన శివ కేశవాభేధం
-- శ్రీ పోతన భాగవతం నుంచి  
Post a Comment