Sunday, December 1, 2013

సదానందయోగి శతకము

శివుఁడు జీవుండు రెండువస్తువు లటంచు
నిచ్చ నెంచిన సాయుజ్య మెట్లు కల్గు?
శివశివా భేద మన్నది సేయరాదు,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

నీట వెలసినలవణంబు నీటఁ గలియు
నీరు గాకుండ దారీతి నిశ్చయముగ;
శివుని దలఁచిన జీవుండు శివుఁడు గాఁదె,
నవ్యతరభోగి శ్రీసదానందయోగి.

సదానందయోగి కృతము సదానందయోగి శతకము నుంచి 13 మరియు 14 వ పద్యాలు

Full Sataka on: http://www.andhrabharati.com/shatakamulu/sadAnaMdayOgi/index.html

--- శ్రీ విజయ నామ సంవత్సర కార్తీక మాస శివరాత్రి సందర్భంగా....

No comments: