Monday, December 30, 2013
గువ్వలచెన్న శతకము
నిత్యానిత్యము లెఱుఁగుచు సత్యంబగుదానిఁ దెలిసి సత్కృత్యములన్
నిత్యముజేయుచు దశదిక్స్తుత్యముగా మెలఁగుమన్న గువ్వలచెన్నా! 59
ఎప్పటికైనను మృత్యువు తప్పదని యెఱింగియుండి తగినచికిత్సం
దప్పింప నెఱుఁగకత్తఱి గుప్పున నేడ్చెదరదేల? గువ్వలచెన్నా! 104
జరయును మృత్యువు మొదలుగ మరలఁగ రాకుండునట్టి మార్గంబేదో
గురుతెఱుఁగఁ జేయుమని శ్రీ గురుగురుని భజియింపవలయు గువ్వలచెన్నా! 105
పరమార్థము నొక్కటెఱిఁగి నరుఁడు చరింపంగవలయు నలువురిలోఁ బా
మరుఁడనఁగ దిరిగినను దన గురియొక్కటి విడువకుండ గువ్వలచెన్నా! 106
For full Satakam - http://www.andhrabharati.com/shatakamulu/guvvalachenna/index.html
31 డిసెంబర్ 2013, కృష్ణాంగారక చతుర్దశి, మార్గశిర మాస శివరాత్రి సందర్భం గా...
Having understood what is permanent and what is temporary, having realized the TRUTH, performing righteous deeds always, conduct yourself in a way that all ten directions praise O guvvala cenna! (59)
Having known that death is inevitable, not trying to cure it all the way, why do people cry post mortem? O guvvala cenna! (104)
To get the right direction to the path of non repetition of old age and death, one should pray to a realized sage for rightly recognizing such a path. O guvvala cenna! (105)
Having realized the ultimate truth, one should carryout the worldly transactions as if knowing nothing but not losing the focus from that ultimate ONE. O guvvala cenna! (106)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment