Wednesday, October 22, 2014

సకలము నీవే

స్వామి! నామనమెందు సంచరించిన నీవు
                ప్రేమతో నచట గన్పింపుమయ్య
కరము నా కరములే కార్యముల్ జేసిన
                నదియె నీవయి పూజలందుమయ్య
చిత్తమెద్దానిని చింతించినన్ దయ
                నది నీవుగా మారి యలరుమయ్య
విమల! నా సకలేంద్రియము లేవి గ్రహియించు
                నవియె నీవయి వాటికందుమయ్య

అన్నివేళల అంతట అనవరతము
భావమందున సకలము నీవయగుచు
సేవ యొసగుము కృపతోడ చిద్విలాస
పరమ కరుణాతరంగ! శ్రీ పాండురంగ!


-- ఆశ్వయుజ మాస శివరాత్రి, నరక చతుర్దశి  సందర్భంగా

No comments: