పితృవంశీయాచ్ఛోదోపాఖ్యానమ్.
సూతః: లోకా స్సోమపథానామ యత్ర మారీచనన్దనాః | వ ర్తన్తే దేవపితరో యా న్దేవా భావయన్త్యలమ్. 1
అగ్ని ష్వాత్తా ఇతి ఖ్యాతా యజ్వానో యత్ర సరిస్థతా | అచ్ఛోదానామ తేషాంతు మానసీ కన్యకా సరిత్. 2
అచ్ఛోదంనామచ సరః పితృభి ర్ని ర్మితంపురా | అథతత్ర తపశ్చక్రే దివ్యం వర్షసహస్రకమ్. 3
ఆజగ్ముః పితరస్తుష్టాః కిల దాస్యామ తే వరమ్ | దివ్యరూపధరా స్సర్వే దివ్యమాల్యానులేపనాః. 4
సర్వే యువానో బలినః కుసుమాయుధసన్నిభాః | తన్మధ్యే మావసుంనామ పితరం వీక్ష్య సాఙ్గనా. 5
వవ్రే వరార్థినీ సఙ్గం కుసుమాయుధపీడితా | యోగభ్రష్టాతు సా తేన వ్యభిచారేణ భామినీ. 6
ధరా మస్పృశతీ పూర్వం పపాతాథ భువస్థ్సలే | తథాచ మాదసుర్యస్మా దిచ్ఛాం చక్రే న తాం ప్రతి. 7
ధైర్యేణ తస్య సాలోకే అమావాస్యేతి విశ్రుతా | పితౄణాం వల్లభా తస్మా ద్దత్తస్యాక్షయకారకా. 8
ఆచ్ఛోదా7ధోముఖీ దీనా లజ్జితా తపనఃక్షియాత్ | సా పితౄ నా్ర్పర్థయామాస పునరాత్మసమృద్ధయే. 9
విలజ్జమానా పితృభి రిదముక్తా తపస్వినీ | భవిష్యదర్థ మాలోక్య దేవకార్యంచ తేతదా. 10
ఇదమూచు ర్మహాభాగాః ప్రసాదా చ్ఛుభయా గిరి | దివి దివ్యశరీరేణ యత్కిఞ్చి తి్ర్కయతే బుధైః. 11
తేనైవ తత్కర్మఫలం భుజ్యతే వరవర్ణిని | సద్యః ఫలన్తి కర్మాణి దేవత్వే ప్రేత్య మానుషే. 12
తస్మాత్త్వం పుత్తి్ర తపసా ప్రాప్స్యసే ప్రేత్యతత్ఫలమ్ | అష్టావింశే భవిత్రీ త్వం ద్వాపరే *మీనయోనిజా.
వ్యతిక్రమ్య పితౄణాంత్వం కష్టం కుల మవాప్స్యసి | తస్మాద్రాజ్ఞో వసోఃకన్యా త్వమవశ్యం భవిష్యసి. 14
కన్యాభూత్వైవ లోకాన్త్సా్వ న్పునః ప్రాప్స్యసి దుర్లభా | పరాశరస్య వీర్యేణ సుతమేక మవాస్స్యసి. 15
ద్వీపేతు బదరీప్రాయే బాదరాయణ మచ్యుతమ్ | స వేద మేకం బహుధా విభజిష్యతి తే సుతః. 16
పౌరవస్యాత్మజౌ ద్వౌతు సముద్రాంశస్య శన్తనోః | విచిత్రవీర్యతనయ స్తదా చిత్రాఙ్గదో నృపః. 17
ఇమావుత్పాద్య తనయౌ క్షత్తియ్రా వస్యధీమతః | ప్రౌష్ఠపద్యష్టకారూపా పితృలోకే భవిష్యసి. 18
నామ్నా సత్యవతీ లోకే పితృలోకే తథా7ష్టకా | ఆయురారోగ్యదా నిత్యం సర్వకామఫలప్రదా. 19
భవిష్యసి పరేలోకే నదీత్వం చ గమిష్యసి | పుణ్యతోయా సరిచ్ఛేష్ఠ్రా లోకే ష్వచ్ఛోదసంజ్ఞితా. 20
ఇత్యుక్త్వా సగణస్తేషాం తతైవ్రాన్తకధీయత | సాప్యవాప సుచారిత్రఫలం యత్కథితం పురా. 21
ఇది శ్రీ మత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే పితృవంశీయాచ్ఛోదో పాఖ్యానవర్ణనం నామ చతుర్దశో7ధ్యాయః.
చతుర్దశాధ్యాయము
(పితరుల కన్యయగు అచ్ఛోద చరితము.) అగ్నిష్వాత్తపితరుల చరితము
(పురాణములందును శాస్త్రములందును చెప్పబడిన పితృదేవతలు ఏడు గణములుగా ఉన్నారు. వీరిలో మూడు మూర్తిలేని గణములు. ఆ గణముల పేర్లు 1. వైరాజులు 2. అగ్నిష్వాత్తులు 3. బర్హిషదులు; మూర్తి కలవి నాలుగు గణములు. 1. సుకాలినః 2. హవిష్మంతః 3. ఆజ్యపాః 4. సోమపాః. వీరిలో మొదటి గణము విషయము పదుమూడవ అద్యాయమున చెప్పబడినది. ఈ అధ్యాయమున రెండవ గణమువారి విషయము చెప్పబడును.
(ప్రతి గణము విషమునను తెలియవలసిన విషయములు-1. ఆ గణము వారు నివసించు లోకము. 2. ఆ గణము పేరు. 3. వారి తండ్రి నామము 4. ఆ గణము వారిని ఆరాధించు వారు. 5. వారి మానసీకన్యా నామము.)
సోమ పథములను లోకములు గలవు. వీనియందు మరీచి అను ప్రజాపతికి కుమారులు అగు పితృదేవతలు నివసింతురు. వీరిని దేవతలు ఆరాధింతురు. ఈ పితరులకు అగ్నిష్వాత్తులు అని పేరు. (అగ్నిషు-ఆత్త=ఆగ్నులయందు సమగ్రముగా హవిస్సు వేల్చి యజ్ఞములను చేసినవారు.) వీరందరును యజ్వలు-యజ్ఞములను చేసినవారు.
వారి మానపుత్రిక అచ్ఛోదా అను ఆమె. ఆమె నదీరూపురాలు ఐనది. పూర్వము పితృదేవతలు అచ్ఛోదమను సరస్సును సృష్టించిరి. ఆ సరస్తీరమున ఈమె వేయి దివ్య సంవత్సరముల కాలము తపస్సు ఆచరించెను. పితరులు సంతుష్టులై ఆమె కడకు వచ్చిరి. నీకేమి వరము కావలెనో ఇత్తుము. కోరుకొనుము-అనిరి. వారందరును దివ్యములగు రూపముల ధరించినవారు దివ్యములగు మాలికలు పుష్పములు దాల్చినవారు. దివ్యగంధములు పూసికొనినవారు. యువకులు; బలశాలురు; మన్మథుని వంటివారు. వారిలోనుండి "మావసుడు' అను పితరుని ఆమె కామపరవశురాలై వరునిగా కోరుకొనెను. ఆ సుందరి ఈ వ్యభిచార దోషముచేత యోగ భ్రష్టురాలయ్యెను. అంతవరకును దేవభావమున భూమిని తాకకయున్న ఆమె భూస్థలిపై పడిపోయెను.
కాని మావసుడు ఆ అచ్ఛోదను కామించక ధైర్యముతో ఉండెను. అందుచే ఆమె "మావస్య' (మావనునికి ప్రియురాలు) కాలేదు. కనుక ఆమెకు "అమావస్య' అను పేరు వచ్చెను (మావస్యకానిది) తన తపస్సుచే పితరులను మెప్పించినందున ఈ అచ్చోద లేదా అమావాస్య పితృదేవతలకు ఇష్టురాలు మాత్రమయినది. అందుచే అమావస్యా (అమావాస్యా) తిథియందు పితరులకు ఆర్పించినది అక్షయమగును. అనంతఫలమును ఇచ్చును.
_____________________________________________________________________________________
* మత్స్య.
తన తపస్సు తన ఈ దోషముచే క్షీణించుటవలన అచ్ఛోద దీనురాలయి ముఖము వంచుకొని సిగ్గుపడుచు తాను మరల తన తపస్సును సమృద్ధి నొందించుకొనుటకై ఉపాయమును తెలుపవలసినదిగా తన తండ్రులగు పితరులను వేడుకొనెను. ఆ మహాభాగులు అనుగ్రహము కలవారైరి. వారు జరుగబోవు విషయములను దేవకార్యమును (తమ ధ్యాన దృష్టితో) దర్శించిరి. శుభమగు వాక్కుతో వారు ఆ తపస్విని (తపోవంతురాలు-జాలిపడదగిన దీనురాలు) తో ఇట్లు పలికిరి: సుందరియగు పుత్తీ్ర! వివేకవంతులగు వారు (భూలోక సంబంధి కానటువంటి) దివ్య శరీరముతో చేసిన ఏ కర్మమునకైనను ఫలమును వారు అదే శరీరముతో అనుభవింతురు. మానుష శరీరముతో నున్నవారు మాత్రము తాము చేసిన కర్మల ఫలమును (కొన్నిటిని) ఆ దేహమును విడిచిన తరువాత అనుభవింతురు. (నీవు మనుష్య స్త్రీగా అయియున్నావు. కనుక) నీవు తపస్సు ఆచరించినచో దాని ఫలమును నీవు ఈ దేహమును విడిచిన తరువాత (మరియొక జన్మములో కాని దేవలోకమునకాని) అనుభవింతువు.
ఇప్పుడు నీవు నీ తండ్రుల విషయమున వ్యతిక్రమము (నియమము తప్పి కామ బుద్ధిని చూపుట) చేసితివి. కనుక ఇరువది ఎనిమిదవ ద్వాపరయుగమున చేప కడుపున జన్మించి నీచమగు కులమును చేరుకొందువు. ఇది జరుగుటకై నీవు తప్పక వసుడను రాజునకు కూతురవు అగుదువు. కన్యగా ఉండి (కన్యాత్వము చెడకయే) చివరకు మరల దుర్లభములగు నీలోకములను నీవు చేరెదవు. ఎట్లన-పరాశరుని విర్యముతో ఒక కుమారుని కనెదవు. అతడు సాక్షాత్ అచ్యుతు (నారాయణు) డే. బదరీవృక్షములు తరచుగా కల ద్వీపమున జనించుటచే అతనికి బాదరాయణుడు అని వ్యవహారము కలుగును. ఆ నీకుమారుడు ఒకటిగా అయి యున్నవేదమును నాలుగుగా విభజించును. సముద్రుని అంశచెత జనించిన పూరు వశీయుడైన శంతనుని వలన చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అను కుమారులను ఇద్దరను కనెదవు. భూలోకమున నీకు సత్యవతి అనిపేరు. పితృలోకమున నీకు అష్టకా అని పేరు. అచట నీవు ప్రౌష్ఠపదీ-అష్టకా-(భాద్రపద శుక్ల పూర్ణిమ గడచిన వెంటనే వచ్చు సప్తమీ తిథి) రూపముతో ఉందువు. నీవు పర (పితృ) లోకమునందుండి ప్రాణులకు ఆయురారోగ్యములను కోరిన ఫలములను ఇత్తువు.
నీవు భూలోకమున నదీ రూపమును పొంది అచ్ఛోద అను పేర పుణ్యజలములుగల నదీ శ్రేష్ఠవైయుందువు.
ఇట్లు పలికి ఆ పితృగణము అచ్చటనే అంతర్ధానమును పొందిరి. ఆ అచ్ఛోదయను పితృ కన్యయును వారిచే ఇంతవరకును చెప్పబడిన సత్కర్మ ఫలమును పొందెను.
ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున పితృకన్యయగు అచ్ఛోద చరితమను చతుర్దశాధ్యాయము.
Wednesday, October 6, 2010
Monday, October 4, 2010
పతన కారణాలు
विहितस्याननुष्ठाना न्निन्दितस्य च सेवनात् |
अनिग्रहच्चेन्दियाणां नरः पतनमृच्छते ||
విహితస్యాననుష్ఠానా న్నిందితస్య చ సేవనాత్
అనిగ్రహచ్చేంద్రియాణాం నరః పతన మృచ్ఛతే
vihitasya ananusthanaha ninditasya ca sevanaat
anigraha ca indriyaaNaam narah patanam Rchchhte
A man selects of fall down by
a. Not performing the prescribed duties,
b. performing the actions that are condemned
c. by not controlling the sense organs
Note: The basis of "prescribed duties" and "condemned actions" is the saastram; guidance of controlling senses is to be derived from the lives of elders who are well studied in the saastras and lived as per the norms of them.

Wednesday, September 29, 2010
అంతా రామమయం
అంతరంగమున ఆత్మారాము డనంత రూపమున వింతలు సలుపగ అంతా రామమయం బీ జగమంతా రామమయం
సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు నఖిల జగంబులు అంతా రామమయం బీ జగమంతా రామమయం
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ అంతా రామమయం బీ జగమంతా రామమయం
నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేదశాస్త్రములు అంతా రామమయం బీ జగమంతా రామమయం
అష్ట దిక్కులును ఆదిశేషుడును అష్ట వసువులును అరిషడ్వర్గము అంతా రామమయం బీ జగమంతా రామమయం
ధీరుడు భద్రాచల రామదాసుని కోరిక లొసగెడి తారక నామము అంతా రామమయం బీ జగమంతా రామమయం
---- భద్రాచల రామదాసు

Tuesday, September 28, 2010
అరణ్యరోదనము - మహలయ శ్రాద్ధము
కర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే | యాచిత్వాపి నరః కుర్యాత్ పితౄణాం తన్మహాలయం ||151||
బ్రాహ్మణేభ్యో విశిష్టేభ్యోయాచేతధనధాన్యకం | పతితే భ్యోనగృహ్ణీయాత్ ధనధాన్యంకదాచన ||152||
బ్రాహ్మణేభ్యోనలభ్యేత యదిధాన్యధనాదికం | యాచేతక్షత్రియ శ్రేష్ఠాత్ మహాలయ చికీర్షయా ||153||
దాతారశ్చేన్నభూపాలావైశ్యేభ్యో೭పిచయాచయేత్ | వైశ్యా అపిహిదాతారోయదిలోకే న నంతివై ||154||
దద్యాద్ఛాద్రవదేమాసే గోగ్రాసరిపతృత్నప్తయే | అథవారోదనం కుర్యాత్ బహిర్నగ్గత్యకాననే ||155||
పాణిభ్యాముదరం స్వీయం ఆహత్యాశ్రూణివర్తయన్ | తేష్వరణ్యప్రదేశేషు ఉచ్చైరేవంవదేన్నరః ||156||
శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ | అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్ || 157 ||
ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః | కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై || 158 ||
భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే | అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం || 159 ||
క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః | దరిద్రోరోదనం కుర్యాత్ ఏవంకాననభూమిషు || 160 ||
తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః | హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః || 161 ||
మహాలయార్ధేవిప్రౌఘే భుక్తేతృప్తిర్యథా భవేత్ | గోగ్రాసారణ్యరుదితైః పితృతృప్తిస్తథా భవేత్ || 162 ||
మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి (151) ధనదాన్యమును విశిష్టులైన బ్రాహ్మణుల నుండి యాచించాలి. ధనధాన్యమును ఎప్పుడుకూడా పతితుల నుండి తీసుకోరాదు (152) ధనధాన్యాదికము బ్రాహ్మణుల నుండి లభించని పక్షంలో, మహాలయం చేసే కొరకు క్షత్రియ శ్రేష్ఠులను యాచించాలి (153) రాజులు ఇచ్చేవారు లేని పక్షంలో వైశ్యుల నుండైనా యాచించాలి. లోకంలో వైశ్యులు కూడా ఇచ్చేవాళ్ళు లేని పక్షంలో (154) పితరుల తృప్తి కొరకు గోవుల గ్రాసమును (గడ్డిని) భాద్రపదమాసంలో ఇవ్వాలి. లేని పక్షంలో, బయటికిపోయి అడవిలో ఏడవాలి (155) చేతులతో తన కడుపును కొట్టుకొంటూ కన్నీరు కారుస్తూ, ఆ అరణ్య ప్రదేశములందు గట్టిగా నరుడు ఇట్లా చెప్పాలి (156) మాకులంనకు చెందిన పిలరులందరు నా మాట వినండి. నేను దరిద్రుణ్ణి. కృపణుణ్ణి. సిగ్గులేని వాణ్ణి, క్రూరకర్మ ఆచరించిన వాణ్ణి (157) పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు. (158) భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు. (159) మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి (160) అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు (161) బ్రాహ్మణుల సమూహం మహాలయంకొరకు భుజిస్తే తృప్తిచెందినట్లు గోగ్రాస, అరణ్యరోదనములతో కూడ పితృదేవతల తృప్తి అట్లా కలుగుతుంది. (162)
--- శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి

Sunday, September 19, 2010
వామన జయంతి
బలి పాశ బద్ధుడై వామనమూర్తి తో :
చెలియే మృత్యువు చుట్టమే యముడు సంసేవార్థులే కింకరుల్
శిలలం జేసెనె బ్రహ్మ దన్ను దృఢమే జీవంబు నోచెల్లరే
చలితం బౌట యెఱుంగ కీకపటసంసారంబు నిక్కంబుగా
దలచున్ మూఢుడు సత్యదానకరుణాధర్మాది నిర్ముక్తుడై 8 - 647
celiyE mRtyuvu cuTTamE yamuDu samsEvaarthulE kiMkarul
SilalaM jEsene brahma dannu dRDhamE jIvaMbu nOcellarE
calitaM bauTa ye~ruMga kIkapaTasaMsaaraMbu nikkambugaa
dalacun mooDhuDu satyadaanakaruNaadharmaadi nirmuktuDai
http://nonenglishstuff.blogspot.com/2008/10/blog-post_28.html
-- పోతన భాగవతం నుంచి

Sunday, September 12, 2010
సప్తర్షి రామాయణము
కశ్యపః
జాతః శ్రీ రఘునాయకొ దశరథాన్మున్యాశ్రయాత్ తాటకాం
హత్వా రక్షిత కౌశిక క్రుతువరః కృత్వాప్యహల్యాం సుభామ్
భంక్త్వా రుద్రశరాసనం జనకజాం పాణౌ గృహిత్వా తతొ
జిత్వార్ధా ధ్వని భార్గవం పునరగాత్ సీతా సమేతః పురీమ్ - 1
అత్రిః
దస్యా మంధరయా దయారహితయా దుర్భొధితా కైకయీ
శ్రీరామ ప్రధమాభిషేక సమయే మాతా ప్యయాచద్వరౌ
భర్తారం "భరతః ప్రశాస్తు ధరణీం" "రామోవనం గచ్ఛతా"
దిత్యాకర్ణ్య సచొత్తరం నహి దదౌ దుఃఖేన మూర్ఛాం గతః - 2
భరద్వాజః
శ్రీరామః పితృ శాసనా ద్వనమగాత్ సౌమిత్రి సీతాన్వితో
గంగాం ప్రాప్య జతాం నిదధ్య సగుహః సచ్చిత్రకూటేవసన్
కృత్వా తత్ర పితృ క్రియాం సభరతో దత్త్వా2భయం దండకే
ప్రాపా గస్త్య మునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చాక్షయమ్ - 3
విశ్వామిత్రః
గత్వా పంచవటీ మగస్త్య వచనాద్ దత్త్వా2భయం మౌనినాం
ఛిత్వా శూర్పణఖాస్య కర్ణ యుగళం త్రాతుం సమస్తాన్ మునీన్
హత్వా తం చ ఖరం సువర్ణ హరిణం భిత్వా తథా వాలినం
తారారత్న మవైరి రాజ్యమకరోత్ సర్వంచ సుగ్రీవసాత్ - 4
గౌతమః
దూతో దాశరథీస్సలీలముదధిం తీర్త్వా హనూమాన్ మహాన్
దృస్ట్వా2శోకవనే స్థితాం జనకాజాం దత్వాంగుళేర్ముద్రికాం
అక్షాదీనసురాన్ నిహత్య మహతీం లంకాచ దగ్ధ్వా పునః
శ్రీరామం చ సమేత్య "దేవ! జననీ దృష్టామ" యేత్యబ్రవీత్ - 5
జమదగ్నిః
రామో బద్ధ పయో నిధిః కపివరై ర్వీరై ర్నలాద్యై ర్వృతో
లంకాం ప్రాప్య సకుంభకర్న తనుజం హత్వా రణే రావణం
తస్యాం న్యస్య విభీషణం పునరసౌ సీతాపతిః పుష్పకా
రూఢస్సన్ పురమాగతః సభరతః సింహాసానస్థౌ బభౌ - 6
వసిష్టః
శ్రీరామో హయమేధ ముఖ్యమఖకృత్ సమ్యక్ ప్రజాః పాలయన్
కృత్వా రాజ్య మధానుజైశ్చ సుచిరం భూరిస్వధర్మాన్వితౌ
పుత్త్రౌ భ్రాతృ సుతాన్వితౌ కుసలవౌ సంస్థాప్య భూమండలే
సో2యోధ్యాపురవాసిభిశ్చ సరయూ స్నాతః ప్రపేదేదివమ్ - 7
ఫలశ్రుతిః
శ్రీరామస్య కధా సుధా తి మధురాన్ శ్లొకా నిమాన్ యే జనాః
శృణ్వంతి ప్రపఠంతి చ ప్రతిదినం తే2ఘౌమ విధ్వంసినః
శ్రీమంతొ బహుపుత్త్ర పౌత్త్ర సహితా భుక్త్వేహ భోగాం శ్చిరం
భోగాంతే తు సదార్చితం సురగణై ర్విష్ణో ర్లభంతే పదమ్
-- ఋషి పంచమి సందర్భంగా

Wednesday, September 8, 2010
దుర్మతిని కృష్ణా
దుర్మతిని మిగుల దుష్టపు
గర్మములను జేసినట్టి కష్టుడ నన్నున్
నిర్మలుని జేయవలె ని
ష్కర్ముడ నిను నమ్మినాను సతతము కృష్ణా!
This is from "Krishna Satakam" by Nrisimha Kavi. The poet is expressing his surrender to Lord Krishna as follows:
durmatini = wicked minded (I am)
migula dustapu karmamulanu chesinatti kastudanu = who has done several sinful actions
nannun nirmaluni cheyavale = (you should) purify me
nishkarmuda = (currently, I am) not engaged in actions
ninu namminaanu satatamu = always faithful to you / eternally surrendered to you
Krishna = O Krishna (Dear Lord!)

Subscribe to:
Posts (Atom)