Monday, November 1, 2010

సంసార సాగరము

క్లేశాదిపంచకతరంగయుతం భ్రమాఢ్యం
దారాత్మజాప్తధనబంధుఝషాభియుక్తం
ఔర్వానలాభనిజరోషమనంగజాలం
సంసారసాగరమతీత్య హరిం వ్రజామి

-- ఆధ్యాత్మ రామాయణము, యుద్ధకాండము, దశమ సర్గ, 61

క్లేశ పంచకం = అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశము -ఇవి తరంగాలుగా కలిగి,
భ్రమలు అనే సుడిగుండాలు కలిగి,
దార, ఆత్మజ, ఆప్త, ధన, బంధువులు అనెడి ఝషా (సొరచేపలు) కలిగి,
క్రొధమను బడబాగ్ని, కామమను వలలు కలిగిన ఈ సంసార సాగరమును దాటి హరి సన్నిధిని చేరెదను. (రాముని తో యుద్ధమందు హతుడినై)

--రావణుడు మండొదరి తో

No comments: