Thursday, November 22, 2018

ఋభు గీత

వామం యస్య వపుః సమస్తజగతాం మాతా పితా చేతరత్
యత్పాదాంబుజనూపురోద్భవరవః శబ్దార్థవాక్యాస్పదమ్
యన్నేత్రత్రితయం సమస్తజగతామాలోకహేతుః సదా
పాయాద్దైవతసార్వభౌమ గిరిజాలంకారమూర్తిః శివః
-- ఋభు గీత మంగళాచరణం, వైకుంఠ చతుర్దశి సందర్భంగా


Wednesday, October 17, 2018

ధర్మానికి పునాది - దాంపత్యం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి  .. ఏష ధర్మః సనాతనః 195 ఎంతో ఉపయోగ కరమైన ధార్మిక వ్యాసాల సంకలనం. 

ధర్మానికి పునాది - దాంపత్యం అనే వ్యాసంలో "భార్యా దైవకృతా సఖా" అనీ "భార్యా శ్రేష్ఠతమా సఖా" అనీ శృతి చెప్పిన విషయాలు చెప్పబడ్డాయి.

ఇంకా మనుస్మృతి:
అర్థస్య సంగ్రహే చైనాం వ్యయే చైవ నియోజయేత్ శౌచే ధర్మేన్నపక్వాంచ పారిణాహ్యస్యచేక్షణే 

అంటే, "ఆర్జించిన ధనాన్ని రక్షించటంలోనూ వ్యయం లోనూ, గృహం లో శౌచ సదాచార ధర్మాల్లోనూ ఆహార విషయంలోనూ గృహిణీయే అధికారిణి" అని చెప్పారు. 

అందుకని, దాంపత్యమే ధర్మానికి పునాది. 

పూర్తి వ్యాసం: (ఎవరైనా కాపీరైటు ఉల్లంఘన గా భావిస్తే తెలియజేయండి - స్కానులను తొలగిస్తాము)






అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా అని శ్రీ రామ చంద్ర మూర్తి శ్రీ రామాయణం లో చెప్పినట్లుగా అనన్యా హి మయా శోభనా భాస్కరస్య ప్రభా యథా! 





Friday, March 30, 2018

సవిమర్శ ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్ర

ఆచార్య శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు సాహిత్య విమర్శ మరియు సాహిత్య చరిత్ర ఆంధ్ర విశ్వ విద్యాలయం లో బోధించేవారు.

ఒక భాష యొక్క సాహిత్య చరిత్ర గురించి పరిశోధించడం ఎంతో కష్టమైన పని. పైగా సాహిత్య విమర్శ చేస్తూ చరిత్రని గ్రాంధీకరించడం నా చిన్న బుర్రకి అందని అసాధ్యమైన ప్రక్రియ.


1. అసలు వాజ్ఞ్మయం అంటే యేమిటి? మనం రాసుకునే పద్దులు, వ్యవహార లావాదేవీలూ కూడా, ప్రతీ మాటా వాజ్ఞ్మయమే అని ఒక వాదం. అలాకాదు, చందోబద్ధమైన రచనలే వాజ్ఞ్మయం అని ఇంకో వాదం. ఈ రెండిటికీ మధ్యలో పద్య గద్య కావ్యాలూ, శాస్త్రాలూ విజ్ఞాన తాత్విక సంపన్నమైన రచనలను గుర్తించి ఆ ఆ సాహిత్య ప్రక్రియలకు కళారూపాన్ని సిద్ధింపచేసి వాజ్ఞ్మయమునకొక నిర్వచనాన్ని ఇచ్చారు.

2. సరే. ఆంధ్ర భాష లాంటి ప్రాకృతిక భాషా వాజ్ఞ్మయానికి మూలాధారం సంస్కృత భాషలోని శాస్త్రాలూ కావ్యాలూన్ను. చరిత్ర గా చూస్తే, మన మాతృభాష గొప్పతనాన్ని చెప్పుకోవటానికి సంస్కృతాన్ని ఏదోఒక విధంగా నిందించడం ద్రావిడ ప్రాముఖ్యతని పొగడటం లేదా ప్రాచీనత్వాన్ని ఆపాదించడం జరుగుతుంది. అలా కాకుండా, సంస్కృతం యొక్క ఔన్నత్యాన్ని ఏ మాత్రం తగ్గించకుండా మన మాతృభాష సౌందర్యాన్ని ప్రతిష్టించిన విధానం విమర్శకులందరూ గుర్తించ వలసి ఉంటుంది.

3. ఇకపోతే, సాహిత్య చరిత్రను యుగములుగా విభజించటం, ఆ ఆ యుగములకు ఒక యుగ కర్త పేరు ఇవ్వడం, ఆ యుగంలోని సమకాలీన కవుల కావ్యాలను పరిశీలించి ముఖ్యమైన ప్రక్రియా భేదములను ప్రకటించడం, విశ్లేషించడం విమర్శకుని ప్రతిభ పైన ఆధార పడుతుంది. లక్ష్మీకాంతం గారు అద్భుతంగా ఈ కార్యాన్ని నిర్వర్తించారు. శ్రీనాధుడి యుగంగా పేరొందిన కాలమే పోతన భాగవత కాలం కూడా కావటం విశేషం. ఇంకా చివరి యుగానికి "క్షీణ యుగం" అనటం కూడా సమంజసంగానే తోస్తుంది.

ఏది ఏమైనా తెలుగు సాహిత్యం తెలుసుకోవాలనుకునే వారందరూ ఈ పుస్తకాన్ని తప్పకుండా అభ్యసించవలసి ఉంటుంది. ముఖ్యంగా నేటి ఆధునిక "సినిమా" కవులు, రచయితలు, విమర్శకులూ ఇటువంటి గ్రంధాలను ఆశ్రయిస్తే మన మాతృభాష ఎంతో సంతోషిస్తుంది. 


శుభం భూయాత్