సకరుణదివ్యచిత్త పరి శాంతమహత్త్వవిధానవిత్త ని
ర్వికృతవిలాసహృద్య శ్రుతివిస్తరవిస్ఫురణైకవేద్య పా
వకబహుభవ్యనామ పరివర్ధనసంక్షయదూరధామ వి
శ్వకలితతోషణా సుభగ సాత్యవతేయ వచోవిభూషణా.
సత్సేవ్యచరణ శమవద్వాత్సల్యాభరణ ధర్మతత్త్వోద్ధరణా
హృత్సంగతభక్తిక దురితోత్సారణధుర్యదృఙ్మయూఖవిసరణా
స్మయవిరహితపూజ్యా మంత్రగీతాధిరాజ్యా
నయనహిమగుసూర్యా నైష్ఠికక్షేమధుర్యా
దయితభువనరక్షా దాంతిసంపద్యతాక్షా
నియమ నికటవర్తీ నిష్కళానందమూర్తీ
--శ్రీమదాంధ్రమహాభారతము, అనుశాసనిక పర్వము, పంచమాశ్వాసము ౪౮౨,౪౮౩,౪౮౪
(భీష్మ ఏకాదశి సందర్భంగా)
Monday, February 14, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment