Wednesday, June 29, 2011

హృదయకపి

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః |
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంతచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ||

-- శివానందలహరి

అత్యంత చపలమైన నా హృదయ కపి ఎల్లప్పుడూ మోహారణ్యంలో యువతుల కుచ గిరులపైన తిరుగుతూ, ఆశా శాఖలను (ఊడలనూ) పట్టుకుని ఊగుతూ, స్వైర విహారం చేస్తొంది. ఓ శివా, నీవు కపాలివి, భిక్షుడవు; ధృఢమైన భక్తి అనే బంధనం తో దీనిని బంధించి నీ అధీనం చేసుకోవయ్యా! (ఈ కోతి నీ వెనకాల తిరుగుతూ ఉంటే ఉపయోగం గా ఉంటుందేమో! దీనిని నేనే పట్టి నీకప్పగించే శక్తి నాకు లేదు!! స్వామీ శరణు!!!)

ఇదే భావాన్ని భక్త రామదాసు:
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ.

ధూర్జటి:
తమకొం బొప్పఁ బరాంగనాజనపర ద్రవ్యంబులన్ మ్రుచ్చిలం
గ మహోద్యోగము సేయనెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములం జుట్టి బిగియించి నీదుచరణ స్తంభంజునం గట్టివై
చి ముదం బెప్పుడుఁ గల్గఁజేయ గడవే శ్రీ కాళహస్తీశ్వరా!

Tuesday, June 21, 2011

నా భూషణములు

నిను సేవింపగ నాపదల్ వొడమనీ నిత్యోత్సవం బబ్బనీ
జనమాత్రుండననీ మహాత్ము డననీ సంసారమోహంబు పై
కొననీ జ్ఞానము గల్గనీ గ్రహగతుల్ గుందింపనీ మేలువ
చ్చిన రానీ యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!

--ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము నుంచి

నిను సేవింపగ నాపదల్ వొడమనీ,
నిత్యోత్సవం బబ్బనీ,
జనమాత్రుండననీ,
మహాత్ము డననీ,
సంసారమోహంబు పైకొననీ,
జ్ఞానము గల్గనీ,
గ్రహగతుల్ గుందింపనీ,
మేలువచ్చిన రానీ,
యవి నాకు భూషణములే శ్రీ కాళహస్తీశ్వరా!
(అన్ని ద్వంద్వాలూ నాకు భూషణములే; భూమికి ఉత్తరార్ధ గోళం లో అతి దీర్ఘమైన రోజు June 21st సందర్భంగా!)

Friday, June 17, 2011

భక్తార్భకుని రక్షణ

ఆనన్దాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్ఛాదనం
వాచా శంఖ ముఖే స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః ।
రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా
పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి ।।

ఆనన్ద అశ్రుభిః ఆతనోతి పులకం నైర్మల్యతః ఛాదనం
వాచా శంఖముఖే స్థితైః చ జఠరా పూర్తిం చరిత్ర అమృతైః
రుద్రాక్షైః భసితేన దేవ వపుషః రక్షాం భవద్ భావనా
పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్త అర్భకం రక్షతి

ఓ దేవా , భక్తి అనే తల్లి భక్తుడైన అర్భకుడిని ఇలా రక్షిస్తుంది:
ఆనందాశృవులతో పులకింపజేస్తూ, నిర్మలత్వం అనే బట్టలు కట్టి, నీ చరిత్రామృతమును మాటలనే ఉగ్గుగిన్నె తో పోసి ఆకలి తీర్చుతూ, రుద్రాక్ష భస్మములచేత శరీరాన్ని రక్షిస్తూ, నీ భావనా ధ్యానమనే ఊయల లో ఉంచి భక్తుడు అనే బాలుడిని భక్తి అనే జనని రక్షిస్తుంది.

-- శివానందలహరి నుంచి

(ఇటువంటి తల్లి రక్షణ లో ఉన్న మనకెందుకింక భయం?)

Wednesday, June 15, 2011

ఏకత్వం, భిన్నత్వం

कृष्णो भोगी शुकः त्यागी जनको राजकार्यकृत्
दत्तो वेश्यासुरासक्तः विष्णुमक्तस्तु नारदः
लीला स्वपतिरक्ता च कर्कटी पिशिताशना
इतिहास पुराणानां कर्ता व्यासो महान् ऋषिः
ज्ञानमेकं तु सर्वेषां कर्म तेषां पृथक् पृथक्

-- గురువులు రకరకాల కర్మల్లోనూ కనిపించినా వారందరి లోని జ్ఞానం ఒక్కటే!
(జ్ఞానం ఎల్లప్పుడూ ఏకత్వమే, కర్మ ఎప్పుడూ భిన్నత్వమే)

Saturday, June 11, 2011

రామేశ్వరం ఏ సమాసం?

విష్ణుస్తత్పురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః
ఉభయో రప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్‌

-- దశ పాపహర దశమి, శ్రీరామ చంద్ర మూర్తి రామేశ్వరం లో ప్రతిష్ఠించిన రోజు

రామేశ్వరం ఏ సమాసం? తత్‌ పురుషమా? "రామస్యఈశ్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు- అని అర్థం ఏర్పడుతుంది. అపుడు అది శివాధిక్యం చెపుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివునికంటె ఏ విధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు. అతనికి పైన ఇంకో ఈశ్వరుడా? ఈసందేహాలన్నీ తీర్చెవా రెవరు? వారు విష్ణుమూర్తినే అడిగి చూడామని అనుకొని వైకుంఠం వెళ్ళారు. "ఇంత చిన్న విషయానికి ఇంతదూరం ఎందుకు వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెసుస్తున్నదే తత్పురుష అని. రామస్య ఈశ్వరః అని. విష్ణుమూర్తి దేవతలతో అన్నాడట. కాని దేవతలకు మాత్రం సందేహనివృత్తి కాలేదు.

విష్ణువు నడిగాం సరిగదా, ఇక ఆ శివుణ్ణే అడుగుదాం, ఆయన ఏంచెప్తాడో చూదాం అని అనుకొని "విష్ణు స్తత్పురుషం బ్రూతే" అని అనుకొంటూ కైలాసానికి వెళ్ళగా, శివుడు "ఇందులో సందేహానికి అవకాశం ఏముందయ్యా? రామేశ్వర పదం బహువ్రీహిసమాసం రాముడే ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు' అని ఆయన బదులు చెప్పాడట.

దేవతలకు ఏమీ తోచింది కాదు. వ్యాకరణ విషయంలో శివకేశవులకు ఈలాటి భేదాభిప్రాయాలు కలుగుతవని దేవతలకు కలలోనయినా తోచలేదు. "వీరిద్దరికి పేరుతో ప్రసక్తి ఉన్నందున వేరే మధ్యవర్తిని అడిగి సందేహం తొలగించుకొందామని "బహువ్రీహిం మహేశ్వరః" శివుడుబహువ్రీహీ సమాసం అని చెప్పుకొంటూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట.

బ్రహ్మదేవతలకు కలిగిన సందేహాన్ని జరిగినసమచారాన్నీ శాంతంగావిని "ఇది తత్పురుషసమాసము కాదు, బహువ్రీహిన్నీ కాదు, మరి కర్మధారయసమాసం, వీరరాఘవు డంటే వీరుడు ఒకడూ రాఘవుడు మరొకడూనా? కాదుగదా? ఆలాగే రామేశ్వరు డంటే రాము డొకడూనూ ఈశ్వరుడింకోడూనా? రాముడే యీశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అర్థం. కాగా "రామశ్చాసావీశ్వరశ్చ" రామేశ్వరః అని కర్మధారయమే యిది అని తీర్పు చేశారుట బ్రహ్మగారు.

-- జగద్గురు బోధలు నుంచి

Thursday, June 9, 2011

విజయసూత్రం

యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ
ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి

198. vaanarendra= O best among Vanaras! yasya= whoever, dhR^itiH= ( has) courage, dR^ishhTiH= vision, matiH= intellect, daakshyam= skill, etaani= (all) these, chatvaari= four (virtues), tava yathaa= like you, saH= that (him), na siidati= will not fail, karmasu= in (any) tasks.

"O best among Vanaras! Whoever has the four qualities of courage, vision, intellect and skill, all these four virtues like you, such a person will not fail in any task."


ధృతిఃదృష్టిః మతిః దాక్ష్యం స కర్మసు నసీదతి.

1. ధృతి - పట్టుదల. ఎట్టి పరిస్థితులలోనూ సడలని ప్రయత్నమే ధృతి.
2. దృష్టి - ఏకాగ్రత, పనియొక్క పరిపూర్ణతను ముందుగా దర్శించగలగడం. దీనినే దార్శనికత అనవచ్చు.
3. మతి - బుద్ధిబలం - ప్రణాళిక రచన (ప్లానింగ్‌) చక్కగా ఆలోచించడం.
4. దాక్ష్యం - (దక్షత) సమర్థత. పనికి తగిన శరీర, బుద్ధుల పనితీరు.
ఈ నాలుగూ ఎవరికి ఉంటాయో విజయం వారినే వరిస్తుంది.

- వాల్మీకి రామాయణము సుందరకాండ మొదటి సర్గ నుంచి