Friday, June 29, 2012

తొలి ఏకాదశి

ఏకాదస్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజన ద్వయం
శుధ్ధోపవాసః ప్రథమః సత్కధా శ్రవణం తథా

-- దేహేంద్రియ సంఘాతాన్ని అదుపులోకి తెచ్చి అంతఃకరణ చతుష్టయాన్ని శుద్ధి చేసి ఐహిక ఆముష్మిక ఫలితాలను ప్రసాదించగల ఏకాదశీ వ్రతాన్ని ప్రారంభిచే తొలి ఏకాదశి సందర్భంగా

మొదటి పాదాన్ని మాత్రం చూస్తే ఏకాదశి నాడు రెండు పూటలా భొజనం చెయ్యడమే కర్తవ్యం అని చెప్పినట్లుగా ఉంటుంది. కానీ "భో, జన" =  "ఓ జనులారా" అని సరిగ్గా అన్వయం చేసుకున్న తరువాత అసలు రెండు కర్తవ్యాలూ శుద్ధోపవాసమూ మరియూ సత్ కధా శ్రవణమూన్ను. 
(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి "ఏకాదశి వ్రత మహత్యం" ప్రవచనం లో ఉటంకించ బడినది )

EkAdasyAntu kartavyam sarvEshAm bhO jana dvayam
SuddhOpavAsaH prathamaH sat katdhA SravaNam tathA

bhO jana sarveshaam - Oh all people, there are two things apply for a EkadaSi vratam. 1. Complete fasting (as much as possible to the body condition of the individual) 2. listening to sat kadhaa i.e, divine narrations of great people.

By doing these two on the Ekadasi day, the body and senses will come into control and mind gets purified giving wonderful results in the matters related to this world and beyond!

-- On the occasion of toli EkAdaSi tomorrow; the day when everyone can start the vrata of cAturmASya and EkAdaSi.


Wednesday, June 20, 2012

సర్వ ధన ప్రధానం - విద్యా ధనం

న చోర హార్యం న చ రాజ హార్యం
న భ్రాతృ భాజ్యం న చ భారకారి |
వ్యయే కృతే వర్థత ఏవ నిత్యం
విద్యా ధనం సర్వ ధన ప్రధానం ||

దొంగల చేత దోచ బడనిదీ, దొరల(రాజుల) చేత లాగుకొన బడనిదీ, సోదరులచేత పంచుకో బడనిదీ, ఎంత ఉన్నా భారము కానట్టిదీ, వెచ్చించిన కొద్దీ పెరిగేదీ అయినటువంటి విద్యా ధనమే అన్ని ధనములలో ప్రధానమైనది.

na cOra hAryam na ca rAja hAryaM
na bhrAtR bhAjyam na ca bhArakAri ,
vyayE kRtE varthata Eva nityam
vidyA dhanam sarva dhana pradhAnam.



The wealth of knowledge is the best / important wealth as it could not be robbed by the robbers, it could not be taken away by the government, it could not be partitioned by the brothers, it will not become heavy to carry as accumulated, it grows even when spent / shared.

Friday, June 15, 2012

మనసు - త్రుళ్ళు

రోసీ రోయదు కామినీజనుల తారుణ్యోరుసౌఖ్యంబులన్
బాసీ బాయదు పుత్రమిత్రజన సంపద్భ్రాంతి వాంఛాలతల్
కోసీ కోయదు నామనం బకట నీకుం బ్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళణపవే శ్రీ కాళహస్తీశ్వరా!

-- యోగిని ఏకాదశి

akkaTA - Oh! nA manambu - My Mind,
rOsI rOyadu kAminIjanula tAruNyOru saukhyambulan - not getting completely disgusted of the pleasures / beautiful bodies of women;
bAsI bAyadu putra, mitra, jana, sampat bhraanti - not getting released from the delusion of sons, friends, followers, wealth etc.,
vAnchAlatal kOsI kOyadu - not completely cutting off the creepers of desires,
nIkun prItigA sat kriyal cEsI cEyadu - not getting engaged completely in righteous activities that move me close to you,
dIni TrLLu aNapavE SrI kALahastISvarA - O, Lord of srI kALahasti - "IswarA", please fix the wavering nature (truLLu) of MY MIND!

-- yOgini EkAdaSi today

Thursday, June 7, 2012

మనో నైర్మల్యం,శాంతి

శ్రీ దేవీ భాగవతం - పదునెనిమిదవ అధ్యాయము (జనకుడు శుకునకు కర్మమార్గ ముపదేశించుట)
.
.
మనస్తు సుఖదుఃఖానాం మహతాం కారణం ద్విజ|
జాతేతు నిర్మలేహ్యస్మిన్సర్వం భవతి నిర్మలమ్‌. 37

భ్రమ న్సర్వేషు తీర్థేషు స్నాత్వాపునఃపునః |
నిర్మలం న మనో యావ త్తావ త్సర్వం నిరర్థకమ్‌. 38

న దేహో న చ జీవాత్మా నేంద్రియాణి పరంతప |
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః. 39

శుద్ధో ముక్తః స దైవాత్మా నవై బధ్యేత కర్హిచిత్‌ |
బంధమోక్షౌ మనః సంస్థౌ తస్మిన్‌ శాంతే ప్రశామ్యతి. 40
.
.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణే ప్రథమస్కంధేSష్టాదశోSధ్యాయః.

(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఉటంకించబడి నా దృష్టి లోకి వచ్చింది ఈ శ్లోకం "భ్రమన్సర్వేషు తీర్థేషు స్నాత్వా స్నత్వా పునః పునః నిర్మలం న మనః యావత్ తావత్ సర్వం నిరర్థకం" )

From: http://www.kamakoti.org/telugu/53/18.htm?PHPSESSID=0695d2a169d9205885ade88cd21a6924

Context: SrI suka, son of bhagavan veda vyasa was a virAgi by birth. Veda Vyasa tries to convince SrI suka to get married and take to grihastha ashrama. When SrI Suka is not satisfied by the argument of Veda Vyasa, Veda Vyasa suggests his son to visit the king of vidEha, the great karma yogi Janaka to get his advice on the matter. Following four verses appear in SrI dEvI bhAgavata, 18th Adhyaya which narrates the discussion between the great karma yogi King Janaka and the great virAgi of Jnana Sri Suka. 

 (bhraman sarveshu tIrthEshu snaatva snattva punaH punaH; nirmalam na manO yAvat tAvat sarvam nirarthakam - This verse is quoted by brahmasri ChaganTi kOteswara Rao gAru in his pravachanas that made me read this part of SrI dEvI bhAgavatam)

Janaka to Suka:
"
manas ("the mind" as loosely translated to English!) alone is the primal reason for pleasure and pain.
when it (manas) becomes cleansed  (nirmalam), everything (EVERYTHING!) becomes pure. 37

going around holy places taking holy dip again and again, if manas is not purified, all this is sheer waste. 38

not the body, not even the jeevatma (spirit in the body!), not the senses are the reason for bondage or release (moksha). manas alone is the reason for either bondage or for liberation. 39

ATMA (self) is ever pure, ever liberated, always the lord; never be a subject of bondage. The bondage and liberation are attached to the manas alone; when manas attains peace everything attains peace! 40
"

So, all the actions (karmas) should lead towards purity of mind and peace of being called chitta suddhi and atma saanti. These qualities leads one to highest realization of ever liberated ATMA i.e., SELF.

om tat sat

Sunday, June 3, 2012

ఋషి గాయత్రి

ఓం తత్సత్  
 
ఓం నమః స్కందాయ విద్మహే
ఋషి సాక్షాత్ ధీమహి
తన్నొః రమణః ప్రచోదయాత్ 



-- తమిళ కాలమానంలో ఈ రోజు వైశాఖ మాస విశాఖా నక్షత్రం జ్ఞానస్వరూపుడైన స్కంద జననం. 
స్కందాంశజులైన భగవాన్ రమణుల ఆమోదాన్ని పొందిన ఈ గాయత్రి సర్వజనులనూ అనుగ్రహించుగాక! 
(బుద్ధి ప్రచోదనముతో)
శుభం.