Showing posts with label సుభాషితం. Show all posts
Showing posts with label సుభాషితం. Show all posts

Wednesday, May 19, 2021

రఘువంశం - యజ్ఞ సంస్కృతి

తవ మంత్రకృతో మంత్రైర్దూరాత్ప్రశమితారిభిః .

ప్రత్యాదిశ్యంత ఇవ మే దృష్టలక్ష్యభిదః శరాః .. 1-61..

--రఘువంశం - 1 వ సర్గ, 61వ శ్లోకం

ఇవి దిలీప చక్రవర్తి వశిష్ఠ మహర్షితో అన్న మాటలు. 

సనాతాన యజ్ఞ సంస్కృతి లో దేశాన్ని పరిపాలించే రాజులు, ఋషుల మంత్ర శక్తి తో అతీంద్రియమైన శక్తిని పొందేవారు.  

శత్రువులు రెండు రకాలు. 1. బాహ్యం గా కనిపించే శత్రువులు 2. అంతరంగా కనిపించకుండా రాజ్యానికి అపకారం చేసే (దూర శత్రువులు) 

బాహ్య శత్రువులను జయించడానికి అస్త్రాలు అవసరమైతే, సూక్షమైమన శత్రువులను శాంతింపజేయడానికి మంత్రశక్తి తో కూడిన శస్త్రాలు, వాటి ప్రయోగం తెలిసిన పురోహితులు అవసరమవుతారు. 

పైన చెప్పిన శ్లోకానికి అర్థం ఇలా చెప్పుకోవచ్చు:

ఓ మహర్షీ! మీ మంత్రములతో దూరమునుంచే శాంతింపబడిన సూక్ష్మ శత్రువులు నివారించ బడుతున్నారు (నా రాజ్యం రక్షించ బడుతోంది) నా శరములు కనిపించే శత్రువులను మాత్రమే భేదిస్తున్నాయి.

ఇదీ యజ్ఞ సంస్కృతి. క్షాత్రం, బ్రాహ్మం సహాయంతో ప్రజా రక్షణ చేయాలి. 


Saturday, July 2, 2016

భావగ్రాహీ జనార్దనః

మూర్ఖో వదతి విష్ణాయ విద్వాన్ వదతి విష్ణవే
ఉభయో స్సదృశం పుణ్యం భావగ్రాహీ జనార్దనః

mUrkhO vadati vishNAya = An uneducated person not knowledgeable of vyAkaraNa and the declination of words ending with "u" says "vishnAya namaH" to pray

vidvAn vadati vishNavE = a learned person properly prays "vishNavE namaH"

ubhayOH sadRSam puNyam = (but) both achieve the same virtue

bhAvagrAhI janArdanaH = The supreme lord janArdana only takes the essential intent i.e, bhAva and not the words / material stuff used to convey it!

Nagalingeshwara swami as seen through Nandi's horns after a special rudrabhishekam on occasion of Sani trayOdaSi mAsa SivarAtri today on behalf of self, family, relatives, friends, followers and everyone for the sake of reduction in hardships and improved peace and prosperity 😊 (bhAva)

-- Quoted by SrI SrI SrI bhAratI tIrtha mahAswami in one of the pravacanas came to my notice recently through a WhatsApp post.

Monday, April 18, 2016

తల్లివిన్కి

నిండారు నోరిమి నిబ్బరికంబు
మాటనిల్కడ తన్వి మంచినడువడి
గుండెబిగువు కల్పుగోలుతనమ్ము
తాల్మి దొఱగఁ బోని దక్కోలు బ్రతుకు
అవిటులఁ బిల్లల నరగడంబులను
నొప్పించకెప్పుడున్ బ్రోచెడి నేర్పు
జంజాటమెడిలి పీచమెడసి మిగుల
నడఁకువతోడుత నందరి పట్ల
నడచుచుఁ ద్రాగక నంజుడు దినక
చదువుగోటునఁ దెగ సాఁగక పనికి
మాలిన కోర్కులం బడయక లేని
పోని తలంపులఁ బొరయక తనకుఁ
గలదాని తోడుతన్గడుఁ దన్విఁ బొంది
పాటించి మైవంచి పాటున కోర్చి
కూడు గుడ్డలు కూర్చుకొని తోటి పాటి
వరలతోఁ గూడి వంతు పంచు కొని
క్రుంగు పొంగులు మానుకొని రేపుమాపు
లిమ్ములఁ గుడ్చువాఁడే తల్లివిన్కి
గిడియతోఁ జాటఁదగిన మొనకాఁడు

-- శ్రీమద్ ఆదిభట్ట నారాయణ దాసు, తల్లివిన్కి కుదురు నుంచి

Notes: tallivinki is a pure Telugu vivRti by srimad Adibhatta nArAyaNa dAsu of SrI lalitA sahasranAma stotram found in brahmANDa purANam.

Above is a list of prerequisites for the person studying and propagating the 1000 secret names of mother goddess SrImAtA the supreme mother.

"full of patience, compassion, truthfulness, righteous behaviour, friendliness, endurance, helpful towards weak, detachment from world, gentleness, away from habits of drinking and eating meat, away from useless desires, not entertaining useless thoughts, (i.e, internal and external sense control), contended with what is there, steadfast in performing duties, hard working, sharing what is there with others around, who is neither depressed nor raised, balanced one --- is eligible for study and promotion of the knowledge heard about the mother, the supreme reality!"


Wednesday, December 9, 2015

శుచిః - Holy and purifying

శుచిః భూమిగతం తొయం శుచిః నారీ పతివ్రతా |
శుచిః క్షేమకరో రాజా సంతోషీ బ్రాహ్మణః శుచిః ||

शुचि र्भूमिगतं तोयं शुचि र्नारी पतिव्रता ।
शुचिः क्षेमकरो राजा सन्तोषी ब्राह्मणः शुचिः ॥

Holy and purifying is the water underground. Woman, devoted to her husband is holy.
King, who protects is a purifier; and a contended & happy brahmaNa is holy.

 -- Attributed to chANakya on the occasion of most purifying kArTIka mAsa SivarAtri.... 

Saturday, December 5, 2015

ఈశ్వరేచ్చ

भ्रमन्वनान्ते नवमञ्जरीषु
न षट्पदो गन्धफलीमजिघ्रत् ।
सा किं न रम्या स च किं न रन्ता
बलीयसी केवलमीश्वरेच्छा ॥

వనంలో కొత్త లతల మధ్యలో సంచరిస్తున్న తుమ్మెద పక్కనే ఉన్న సంపెంగ ను ఆఘ్రాణించలేదు. ఆ పుష్పం రమ్యమైనది కాదా? లేక తుమ్మెదకు పుష్పం లో రమించడం తెలియదా? (రెండూ కాదు) కేవలం ఈశ్వరేచ్చ బలీయమైనది. 

bhraman vanAntE nava-manjarIshu
na shaTpadH gandha-phalIm ajighrat
sA kim na ramyA sa ca kim na rantA
balIyasI kEvalm IsvarEcchA

A bee roaming in the garden with lot of new flower creepers,
it did not smell the best smelling sampangi flower;
Is that flower is not enjoyable? Nor the bee do not know to enjoy?
(NO) most powerful is the wish of Iswara!


Thursday, December 3, 2015

స్వభావము - ప్రకృతి

काकः पद्मवने रतिं न कुरुते हंसो न कूपोदके ।
मूर्खः पण्डितसङ्गमे न रमते दासो न सिंहासने ।
दुष्टः सज्जनसङ्गमं न सहते नीचं जनं सेवते ।
या यस्य प्रकृतिः स्वभावजनिता केनापि न त्यज्यते ॥

व्याघ्रः सेवति काननं च गहनं सिंहो गुहां सेवते
हंसः सेवति पद्मिनीं कुसुमितां गृधः श्मशानस्थलीम् ।
साधुः सेवति साधुमेव सततं नीचोऽपि नीचं जनम्
या यस्य प्रकृतिः स्वभावजनिता केनापि न त्यज्यते ॥

1. A crow do not enjoy in the garden of lotus ponds; A swan can't enjoy in a small pit of water. A fool will not enjoy the company of wise; a servant can't hold the throne of a leader. Wicked one can't bear pious people and works for wicked only. Each one follows the character as per their own nature and hardly give up on "prakRti"

2. A tiger enjoys in the deep forest, a lion enjoys the cave, a swan enjoys on the lotus flowers, a hawk enjoys in the burial ground. People with soft nature enjoy in the company of soft people and wicked enjoy among wicked. Each one follows the character as per their own nature and hardly can give up on "prakRti"

yA yasya prakRtiH svabhAva janitA kEnApi na tyajatE - Above two verses show the difficulty of giving up one's own nature. Everyone thus should focus on building right character considering the fact!

Thursday, November 26, 2015

క్రియాసిద్ధిః సత్త్వే భవతి

विजेतव्या लङ्का चरणतरणीयो जलनिधिः ।
विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः ।
तथाप्येको रामः सकलमवधीद्राक्षसकुलं ।
क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे ॥

रथस्यैकं चक्रं भुजगयमिताः सप्ततुरगाः ।
निरालंबो मार्गश्चरणविकलो सारथिरपि।
रविर्यात्यंतं प्रतिदिनमपारस्य नभसः ।
क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे॥

घटो जन्मस्थानं मृगपरिजनो भूर्जवसनं ।
वने वासः कन्दैरशनमपि दुःस्थं वपुरिदम् ।
अगस्त्यः पायोधिं यदकृत करांभोजकुहरे ।
क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे ॥

Above three samskruta subhAshita gives three examples of how accomplishment of task depends on the inner strength irrespective of how weak the environmental support one has.

1. what has to be conquered is Lanka, Ocean has to be crossed by foot, opponent is the great son of pulastya, the army is only monkeys; even then the RAMA, single handed won over the mighty rAkshasas.

2. The chariot has only one wheel, seven horses are tied to it by snakes, the path is sky without any directions, the driver has no legs; even then the SUN traverses the horizon every day.

3. Birth place is a pot (a test tube!), followers are animals, dress is made up of bark of birch plant, living place is forest, eats only bulbous roots, body is short; even then sage agasthya was able to take the water form all the oceans in his palm.

"kriyAsiddhiH sattvE bhavati mahatAm nOpakaraNE"
Hence, the accomplishment of great people depends purely on their innate strength and not on the helping tools or support from outside.

--- Today is auspicious full moon day of month of kArtIka celebrated as jvAlA tOraNam, mahA kArtIki, guru nAnak jayanti

Sunday, November 1, 2015

బ్రహ్మ వృన్దం

మార్గే మార్గే నిర్మలం బ్రహ్మ వృన్దం
వృన్దే వృన్దే తత్త్వ చిన్తానువాదః
వాదే వాదే జాయతే తత్త్వబోధో
బొధే బొధే భాసతే చన్ద్రచూడః

mArgE mArgE nirmalam brahma vRndam 
vRndE vRntE tattva cintAnuvAdaH 
vAdE vAdE jAyatE tattvabOdhO 
bodhE bodhE bhAsatE candracUDaH 

On each path there is a purified group of individuals i.e.,  brahma vRndam
in each group there is a discussion on reality
in each discussion, arises the realization
in each realization shines the supreme lord!


Sunday, September 20, 2015

తిమిరారి

తిమిరారి స్తమోహంతి శఙ్కాతఙ్కిత మానసాః
వయం కాకా వయం కాకా ఇతి జల్పంతి వాయసాః

timirAriH - the (ari) enemy of (timira) darkness
tamOhanti - destroying the (tamas) cause of darkness
SankAtankita mAnasAH - having a doubt (that misidentifying them as darkness due to black color) in the mind
vayam kAkA vayam kAkA iti = "we are crows, we are crows"
jalpanti vAyasAH = crows are making noise!

Today is bhAnu (Sunday) saptami (7th moon phase) a combination that is auspicious.


Thursday, March 5, 2015

కామ దహనం


శమ్భుస్వయమ్భుహరయో హరిణేక్షణానాం యేనాక్రియన్త సతతం గృహకర్మదాసాః,
వాచామగోచర చరిత్ర విచిత్రితాయ తస్మై నమో భగవతే మకరధ్వజాయ. (శృంగార శతకం, మంగళాచరణం)

Sambhu i.e, the lord of transformation, svayambhu the lord of creation and hari the lord of sustainability; this trinity also been made to work for their ladies pArvati, saraswati and lakshmi by the power of that lord who is having makara dhvajam (manmadha i.e., the lord of desire) and whose ability and history can't be described in words, for him I bow down!



చూడొత్తంసిత చారు చంద్ర కలికా చంచచ్చిఖా భాస్వరో
లీలాదగ్ధవిలోల కామశలభః శ్రేయోదశాగ్రేస్ఫురన్
అంతఃస్ఫూర్జదపార మోహ తిమిర ప్రాగ్భారముచ్చాటయం
శ్చేతస్సద్మని యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరః (వైరాగ్య శతకం మొదటి శ్లోకం)

While the crescent moon adorned on the forehead appears like the tip of the fire and the manmadha (god of desires) falls in it like a locust being burnt away; the internal ignorance which is completely removed by the light emitted within the minds of yOgis, let the victory be to the light of knowledge in the form of Hara i.e, the supreme lord!

-------------------------------
To complete three Satakams of Bhartrihari - nIti Satakam mangalAcaraNam in last post - http://nonenglishstuff.blogspot.in/2015/02/sivaratri-of-sri-jaya-year.html 

Friday, January 2, 2015

పూతం - purified

దృష్టిపూతం న్యసేత్పాదం వస్త్రపూతం పిబేజ్జలమ్
సత్యపూతాం వదేద్వాచం మనఃపూతం సమాచరేత్ - 16


-- శ్రీమద్భాగవతం 11 స్కందం, 18 అధ్యాయం 16 శ్లోకం


ఈ అధ్యాయము వానప్రస్థ, సన్న్యాస ధర్మాలను సమీక్షిస్తుంది.
చక్కగా పరిశీలించి చూసి అడుగు వెయ్యాలి (ఇతర ప్రాణులకు హాని కలగకుండా, బురద లాంటి వాటిలో పడకుండా)
చక్కగా వడపోసి నీరు తాగాలి (ఇప్పటి కాలం లో ఆర్.ఓ పూతం అనాలేమో!)
చక్కగా తెలుసుకొని మాట చెప్పాలి (సత్యమైన, శాస్త్ర హితమైన దాన్నే చెప్పాలి)
చక్కటి మనసుతో ఆచరించాలి (మనస్సుని శుద్ది చేసుకుని ఆలోచించి పనులు చెయ్యాలి)


ఈ ధర్మం అందరికీ వర్తిస్తుంది.


dRshTi pUtam nyesEt pAdam - put the foot forward after having purified by observing properly; not to harm other beings or to get into mud etc.,
vastra pUtam pibEt jalam - drink water after having purified by filtering with a cloth (may be R.O these days!)
satya pUtAm vadEt vAcam - speak only after purifying the words by truth and scriptures
manaH pUtam samAcarEt - act with purified mind or act only after deciding with pure thoughts.


From Srimad bhAgavatam, 11 skandam, 16 verse


Friday, December 5, 2014

నిజమైన రాజులు

గుడులు కట్టించె కంచర్ల గోపరాజు
రాగములు కూర్చె కాకర్ల త్యాగరాజు
పుణ్యకృతి చెప్పె బమ్మెర పోతరాజు 
రాజులీ మువ్వురును భక్తిరాజ్యమునకు 
 - కరుణశ్రీ 
 

అలాంటి రాజులేలిన శ్రీ రామ భక్తి సామ్రాజ్యానికి నన్ను చేర్చిన నావలు స్వామి శ్రీ విరాజేశ్వర సరస్వతి పాదుకలు

Sunday, October 12, 2014

ద్వివిధ వ్యాధులు

व्याधिर्द्विधाऽसौ कथितो हि विद्भिः कर्मोद्भवो धातुकृतस्तथेति ।
आद्यक्षयः कर्मण एव लीनाच्चिकित्सया स्याच्चरमोदितस्य ॥

వ్యాధిః ద్వేధా అసౌ కథితో హి విద్భిః కర్మోద్భవః ధాతుకృతాః తథా ఇతి
ఆద్యక్షయః కర్మణ ఏవ లీనాః చికిత్సయా స్యాత్ చరమోదితస్య

-- From mAdhavIya Sankara vijayam, 16th Sarga, 10th SlOka.

These words are spoken by BhagavAn Adi Sankara bhagavatpAda to the disciples.

Due to a magical spell of abhinava gupta, who could not digest the defeat of his own matam by bhagavadpAda, Bhagavan Sankara was inflicted by a disease called bhagandhara vyAdhi. When disciples want to treat the disease jagadguru says:

Wise say the disease is of two types. karmakRtam - originated due to actions and dhAtukRtam - originated due to dhAtus i.e, the fundamental building blocks of body. In these two types, the first one is only cured by depletion of karmas and the second one only can be cured by treatment through medicines etc.,

ArOgyam is a combination of righteousness and treatment.

om tat sat

Tuesday, July 15, 2014

జననీ జన్మభూమి

అపి స్వర్ణమయీ లఞ్కా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ 

(The last family photo taken with my mother)
अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते।
 जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी॥

Let this "Golden Lanka" be filled with all wealth, It is not charming me, O LakshmaNa! mother and motherland are greater than even the heaven.

-- It has been three years since my mother left this world; and about a decade since I returned to my motherland.

Wednesday, June 25, 2014

నామ మహిమ

హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః 
అనిచ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః 
-- శ్రీ బృహన్నారద పురాణం పూర్వభాగం 11 వ అధ్యాయం 100 శ్లోకం  
-- జ్యేష్ఠ మాస శివరాత్రి సందర్భంగా

hariH harati pApAni dushTa cittaiH api smRtaH 
anicchya api samspRshTO dahati eva hi pAvakaH 

-- SrI bRhannArada purANam pUrvabhAgaM 11th Adhyaya, 100th SlOka. 


hari = Lord Hari
harati = removes
pApAni = sins
dushTa-chittaiH api = even with a wicked mind
smRataH = by remembering, uttering
anicchayA = even without the desire or unknowingly 
samspRshTO = touching, getting in to contact with 
pAvakaH = fire
dahati eva hi = burns only certainly  

Remembering "Lord Hari" even with wicked intention removes sins just like even unknowingly touching fire burns. 

Today is the auspicious mAsa Siva rAtri of jyeshTha mAsa of SrI jaya year. Remembering the name of Lord purifies. That is the power of nAma japa. 

My guru, Swami Virajeshwara Saraswati used to quote this verse before his anugraha bhAshaNa.



Thursday, January 9, 2014

ప్రయత్నం ఎప్పుడు చేయ్యాలి?

వర్షార్థమష్టౌ ప్రయతేత మాసా న్నిశార్థ మర్థం దివసం యతేత
వార్ధక్య హేతో ర్వయసా నవేన పరత్ర హేతో రిహజన్మనా చ

వానకాలమునకు వలసినవి యెల్ల నార్జింపవలయు మాసాష్టకమున
రాత్రులకొనరు నర్థములెన్ని యన్నియు ఘటియింపవలయు బగళ్ళ యంద
అపరవయో యోగ్యమగు వస్తుజాలంబు సాధింపవలయును జవ్వనమున
పరలోకమునకు సంపాద్యమెయ్యది యది గడియింపవలయు నీ యొడలియంద

varshArthamashTau prayatEta mAsA nniSArtha martham divasam yatEta
vArdhakya hEtO rvayasA navEna paratra hEtO rihajanmanA ca

vAnakAlamunaku valasinavi yella nArjiMpavalayu mAsAshTakamuna
rAtrulakonaru narthamulenni yanniyu ghaTiyimpavalayu bagaLLa yanda
aparavayO yOgyamagu vastujAlambu sAdhimpavalayunu javvanamuna
paralOkamunaku sampAdyameyyadi yadi gaDiyimpavalayu nI yoDaliyanda

One has to attempt to attain all the things needed for rainy season in the rest eight months, things needed for the night to be attained during the day time, whatever is needed for old age to be attained during the working age and whatever needed for heaven (para lOkam) during this very lifespan.

Saturday, October 26, 2013

నర మేషం - కాల వృకం

దారా ఇమే మే, పశవశ్చ మే మే, ధనాని మే మే, ఇత్థం నరో మేష సమాన కంఠః అహోహ్యయం కాల వృకేణ నీతః

మే - అంటే సంస్కృతం లో "నాకు" లేదా "నాది" అనే అర్థం వస్తుంది. సామాన్యంగా నరులు "ఈ భార్య నాది నాది", ఈ పశువులు నావి నావి", ఈ ధనం నాది, ఇంకా నాకు కావాలి" అంటూ ఉంటారు. మేక కూడా "మే మే" అని అరుస్తూ ఉంటుంది.

అయ్యో! ఇలా జరుగుతూ ఉండగా, కాలం (మృత్యువు) లోడేలు (వృక) రూపంలో (తెలియకుండా వచ్చి)నరులను కబళించి వేస్తుంది కదా!!

--- ఈ శ్లోకాన్ని శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి గురువుగారు శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు చెపుతూ ఉండేవారట. ఆలా అని ఒక అనుగ్రహ భాషణం లో శృంగేరీ జగద్గురువులు సెలవిచ్చారు.

dArA imE mE, paSavaSca mE mE, dhanAni mE mE, ittham narO mEsha samAna kanThaH ahOhyayam kAla vRkENa nItaH

In Sanksrit, "mE" means "for me" or "mine". Usually man keeps bleating "this wife is mine and for me", "these animals are mine and more for me" and "this money is mine and need more for me" like a goat. Alas! as this bleating is going on, the kAla (time in the form of death which is not apparent) is taking away the man goat!

-- Quoted by Sri Sri bhAratI tIrtha mahA swami in one of the anugraha bhAshaNam in recent vijaya yAtra through Andhra pradesh. It used to be quoted by parama guru SrI SrI SrI abhinava vidyAtIrtha mahaswami.

Sunday, May 5, 2013

అవసరానికి ఉపయోగపడనివి

పుస్తకస్థా తు యా విద్యా పరహస్తగతం ధనం
కార్యకాలే సముత్పన్నే న సా విద్యా న తత్ ధనం

పుస్తకం లోనే ఉండిపోయిన విద్యా (చదువూ), పరహస్తగతమైన ధనమూ, అవసరానికి ఉపయోగపడనివి; అటువంటి విద్య విద్యా కాదు, ధనం ధనమూ కాదు.

pustakasthA tu yA vidyA parahastagataM dhanaM
kAryakAlE samutpannE na sA vidyA na tat dhanam

Knowledge that remains in the book, Money that is handed over to some one else, are not useful at the time of need; Such knowledge is not knowledge, such money is not money!

Note: As I am bringing the knowledge of arthaSAstra out of the book to make it useful, there are less posts on this blog. Any one interested can see posts related to artha SAstra @ http://sastra-artha.blogspot.in/

Friday, March 8, 2013

మోక్ష సాధన ఎప్పుడు?

సరిగ్గా పది మాసాల క్రితం భగవత్ చింతనకు తరుణం ఎప్పుడు? అని మహాకవీంద్రుడు గొప్ప శివ భక్తుడు అయిన ధూర్జటి యోక్క కాళహస్తీశ్వర శతకం లోని ఒక పద్యాన్ని చూశాం. 

ఇప్పుడు పరమ రామ భక్తుడైన రామదాసు గారి దాశరథీ శతకం నుంచి అదే భావాన్ని గమనిద్దాం:

మనమున నూహపోహణములు మర్వకమున్నె కఫాది రోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుటల్
తనువునకున్ విరోధమది దాశరథీ కరుణాపయోనిధీ.

--శ్రీ నందన నామ సంవత్సర మాఘ బహుళ ఏకాదశి (విజయ ఏకాదశి) సందర్భంగా...

A verse from dASarathI satakam of bhakta rAmadAsu that reinforces the same bhava as my past post - http://nonenglishstuff.blogspot.in/2012/04/blog-post_16.html made exactly 10 months back.

Uha (proper understanding), apOha (misunderstanding) are the capabilities of mind. While these capabilities of mind are strong, before the diseases take over the body and while body is still strong to take up the austereties, MAN should take up the sAdhana i.e., practice to attain mOksha (ultimate realization). Not performing tattva vicAra (self enquiry) is counter productive of having body (+ mind + intellect)

-- SrI nandana nAma samvatsara mAgha bahuLa EkAdaSi (Vijaya EkAdaSi)

Thursday, December 20, 2012

నారాయణ నవరత్నములు

సిరులన్ మించిన వాడటంచు బహుదాసీ దాసవర్గంబులన్
గరులన్ గల్గినవాడటంచు బహుభోగాఢ్యుండటంచున్ మహా
హరులన్ గల్గినవాడటంచు నధికారారూఢుడంచున్ సదా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 1

సిరులన్ చేకుర చేతురో విభవమున్ సిద్ధింపగా చేతురో
పరమారోగ్యము సంఘటింతురో జరావ్యాధుల్ నివారింతురో
పరిపూర్ణాయువు గల్గజేయుదురొ దంభప్రజ్ఞులే గాని యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా -2

సిరిమంతుల్ సిరులిచ్చినన్ నిలుచునే శ్రీమంతులొక్కప్డు దు
ర్భర దారిద్ర్య దశావశాత్ములగుచున్ రారాని దుఃఖమ్ములన్
దురపాయంబుల చిక్కి స్రుక్కుటలు నెందున్ చూడమే మూఢతన్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 3

సిరులే లేశము నివ్వ నేర్చునవి రక్షింపంగ దా నేర్చునే
సిరులన్ నిల్పగ నేర్చుగాక నరుడా శ్రేయంబులీ నేర్చునే
స్మరణీయుండితరుండు లేడు హరియే సర్వార్థ సంధాత యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 4

కరుణాసాగరుడార్తబంధుడు జగత్కళ్యాణ సంధాత సం
సరణాంబోనిధినౌక సాధుజనహృత్సత్పద్మసంవాసి దు
ర్భర సంసారహరుండు భక్త సుమనోవాంఛా ప్రదుండుండగా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 5

దురహంకారులు గర్వచిత్తులు సదాదోషైక దృక్కుల్ మహా
దురితాచార పరాయణుల్ చపల చిత్తుల్ (చోరులుం) ధూర్తులున్
పరమార్థ ప్రతికూలవర్తనులు లోభగ్రస్తులాశాపరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 6

కరుణాదూరులు వంచనాపరులు శుష్కాతి ప్రియాలాపకుల్
పరవిద్యాబలవిత్త వృద్ధులు సహింపన్ లేని నీచాత్మకుల్
పరదాక్షిణ్య పరోపకార రహితుల్ స్వార్థప్రియుల్ మచ్చరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 7

నరులెవ్వారలు సర్వసంపదలతో నానాధికారాలతో
సరస ప్రజ్ఞలతో మహామహిమతో జానొందిరేనిన్ పరా
త్పరు నిన్ గూరిచి వారు చేసిన సుపూజాలబ్ధముల్ సర్వమున్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 8

దొరలందిట్టి సమర్థుడున్ సరసుడున్ దూరార్థ సందర్శియున్
వరదాక్షిణ్యుడు స్వాశ్రితావన మహాప్రావీణ్యుడున్ పుణ్యుడున్
దొరకంజాలడు సుమ్ము ముజ్జగములందున్ నమ్ము నామాట నీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 9

-- మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి గ్రామవాసులు కీ. శే. శ్రీమాన్ తిరునగరి వెంకయ్య గారు వ్రాసియుంచుకున్న లిఖితప్రతి యందు 9 పద్యాలు. (కవి ఎవరో తెలియదు.)

If anyone wants to spend 20minutes listening to reading this padyas out by me to myself and thinking aloud slightly in English, please watch the video....