Thursday, December 20, 2012

నారాయణ నవరత్నములు

సిరులన్ మించిన వాడటంచు బహుదాసీ దాసవర్గంబులన్
గరులన్ గల్గినవాడటంచు బహుభోగాఢ్యుండటంచున్ మహా
హరులన్ గల్గినవాడటంచు నధికారారూఢుడంచున్ సదా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 1

సిరులన్ చేకుర చేతురో విభవమున్ సిద్ధింపగా చేతురో
పరమారోగ్యము సంఘటింతురో జరావ్యాధుల్ నివారింతురో
పరిపూర్ణాయువు గల్గజేయుదురొ దంభప్రజ్ఞులే గాని యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా -2

సిరిమంతుల్ సిరులిచ్చినన్ నిలుచునే శ్రీమంతులొక్కప్డు దు
ర్భర దారిద్ర్య దశావశాత్ములగుచున్ రారాని దుఃఖమ్ములన్
దురపాయంబుల చిక్కి స్రుక్కుటలు నెందున్ చూడమే మూఢతన్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 3

సిరులే లేశము నివ్వ నేర్చునవి రక్షింపంగ దా నేర్చునే
సిరులన్ నిల్పగ నేర్చుగాక నరుడా శ్రేయంబులీ నేర్చునే
స్మరణీయుండితరుండు లేడు హరియే సర్వార్థ సంధాత యీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 4

కరుణాసాగరుడార్తబంధుడు జగత్కళ్యాణ సంధాత సం
సరణాంబోనిధినౌక సాధుజనహృత్సత్పద్మసంవాసి దు
ర్భర సంసారహరుండు భక్త సుమనోవాంఛా ప్రదుండుండగా
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 5

దురహంకారులు గర్వచిత్తులు సదాదోషైక దృక్కుల్ మహా
దురితాచార పరాయణుల్ చపల చిత్తుల్ (చోరులుం) ధూర్తులున్
పరమార్థ ప్రతికూలవర్తనులు లోభగ్రస్తులాశాపరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 6

కరుణాదూరులు వంచనాపరులు శుష్కాతి ప్రియాలాపకుల్
పరవిద్యాబలవిత్త వృద్ధులు సహింపన్ లేని నీచాత్మకుల్
పరదాక్షిణ్య పరోపకార రహితుల్ స్వార్థప్రియుల్ మచ్చరుల్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 7

నరులెవ్వారలు సర్వసంపదలతో నానాధికారాలతో
సరస ప్రజ్ఞలతో మహామహిమతో జానొందిరేనిన్ పరా
త్పరు నిన్ గూరిచి వారు చేసిన సుపూజాలబ్ధముల్ సర్వమున్
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 8

దొరలందిట్టి సమర్థుడున్ సరసుడున్ దూరార్థ సందర్శియున్
వరదాక్షిణ్యుడు స్వాశ్రితావన మహాప్రావీణ్యుడున్ పుణ్యుడున్
దొరకంజాలడు సుమ్ము ముజ్జగములందున్ నమ్ము నామాట నీ
నరులన్ నమ్మెదవేల వెర్రి మనసా నారాయణున్ నమ్ముమా - 9

-- మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి గ్రామవాసులు కీ. శే. శ్రీమాన్ తిరునగరి వెంకయ్య గారు వ్రాసియుంచుకున్న లిఖితప్రతి యందు 9 పద్యాలు. (కవి ఎవరో తెలియదు.)

If anyone wants to spend 20minutes listening to reading this padyas out by me to myself and thinking aloud slightly in English, please watch the video....


Saturday, December 15, 2012

तोटकाष्टकं - తోటకాష్టకం


విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ 1
vidita-akhila-SAstra-sudhA-jaladhE; mahita-upanishat-kathita-artha-nidhE; hRdayE kalayE vimalaM caraNaM bhava Sankara dESika mE SaraNam

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదం
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ 2
karuNA-varuNA-Alaya pAlaya mAm; bhava-sAgara duHkha vidUna-hRdam; racaya akhila-darSana-tattva-vidaM bhava Sankara dESika mE SaraNam
 
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ 3
bhavatA janatA suhitA bhavitA nija-bOdha-vicAraNa cArumatE; kalaya-Iswara-jIva-vivEka-vidam bhava Sankara dESika mE SaraNam

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణమ్ 4
bhava Eva bhavAn iti mE na itarAm sam-ajAyata cEtasi kautukitA mama vAraya mOha-mahA-jaladhiM bhava Sankara dESika mE SaraNam

సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ 5
sukRtE-adhikRtE bahudhA bhavataH bhavitA sama-darSana-lAlasatA ati-dInam-imam paripAlaya mAm bhava Sankara dESika mE SaraNam

జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ 6
jagatIM avituM kalitA kRtayO vicaranti mahAmaha sat calataH ahimASuH-iva-atra-vibhAsi gurOH bhava Sankara dESika mE SaraNam

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోఽపి సుధీః
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ 7
guru-pungava pum-gava kEtana tE samatAm ayatAm na-hi kah api su-dhIH SaraNAgata-vatsala-tattva-nidhE bhava Sankara dESika mE SaraNam

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ 8
viditA na mayA visad-Eka-kalA na ca kincana kAncanam asti gurOH drutam Eva vi-dhEhi kRpAM sahajAM bhava Sankara dESika mE SaraNam

-- ఆనందగిరి (తోటకాచార్యులు) శంకరులనుద్దేశించి ఆశువుగా చెప్పిన అష్టకం

దేశిక అంటే "దిశ్" నుంచి వచ్చిన దిశ, సరైన దిశ, దారి చూపించే గురువు.

1. గురు చరణలను హృదయం లో కలన చేయాలని (ధ్యానం లో) శిష్యుని కర్మ శరణాగతి!
2. రచయ - నా యందు అఖిల దర్శన తత్త్వాన్ని రచించవయ్యా అనే ప్రార్థన.
3. కలయ - ఈశ్వర జీవ వివేకాన్ని నాలో కలుగజేయ మనే ప్రార్థన.
4. వారయ - నాలోని మోహమనే మహాసముద్రాన్ని నివారిచమనే ప్రార్థన.
5. పరిపాలయ - దీనుడైన నన్ను పరిపాలించమనే ప్రార్థన.
6. మహామహులు జగత్తును రక్షించడానికి సంచరిస్తూ ఉంటారనీ, అటువంటి వారిలో శంకరులు సూర్యుని వంటి వారనే విషయాన్ని చక్కగా లెలియజేసారు తోటకాచార్యులు.
7. శరణన్న వారిని వాత్సల్యంలో రక్షించడం శంకరుల సహజ లక్షణం.
8.నాకేమీ తెలియదు. నా దగ్గరేమీ లేదు. (నా లాంటి అప్రయోజకుడైన, దేనికీ పనికిరాని శిష్యుడిని కూడా) గురువు తన సహజమైన కృపతో ఉద్ధరిస్తాడనే అపూర్వమైన రహస్యాన్ని చెప్పారు ఈ శ్లోకంలో!

For Meaning in English: http://sanskritdocuments.org/all_sa/totaka8_sa.html

Sunday, November 11, 2012

ధన త్రయోదశి

"ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" - మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా ధన్వంతరి అవతారం లో అమృతకలశం తో శ్రీ మహావిష్ణువు అవతరించిన ధన త్రయోదశి ఈ రోజు.

నేటి నుంచి 5 రోజులు ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, యమ ద్వితీయ అనే పర్వ దినాలు ఉత్తర దక్షిణ భారతదేశాల్లో ఆచరిస్తారు.

మా గురువుగారు స్వామి విరాజేశ్వర సరస్వతి సరిగ్గా 40 సంవత్సరాల క్రితం జ్ఞానోదయం పొందిన సందర్భంగా దీపావళి గూర్చి స్వామి విద్యానంద సరస్వతి మహరాజ్ చెప్పిన మాటలు "వైజ్ఞానికుని సత్యాన్వేషణ" నుంచి:

"Deepavali is a very important festival celebrated with lights, sweets, new clothes and a lot of joy everywhere. Everybody is happy and the whole atmosphere is charged with something new. Darkness is driven out with lights and the old is replaced by the new. Deepavali is symbolic of the day Rama killing the daemon Ravana and Krishna killing Narakasura. The daemons symbolise ego, the product of ajnana (ignorance) while Rama and Krishna symbolise jnana or Brahma. We celebrate the occasion with lights which drive away the darkness of ignorance with the light of knowledge (jnana). Where there is jnana there is no ajnana. Actually darkness and ignorance have no independent existence, absense of light (jnana) is the existence of darkness (ajnana). Death of ego spells the end of suffering, so it is the occasion for celebration."

-- From "Scientist's Search for Truth" an autobiography of Swami Virajeshwara
-- This is the 200th post on to this blog.

Wishing one and all an enlightening season of this SrI Nandana Naama Samvatsara DeepavaLi.


Sunday, November 4, 2012

విజ్ఞాన నౌక - स्वरूपानुसन्धानाष्टकम्

तपोयज्ञदानादिभिः शुद्धबुद्धि
र्विरक्तो नृपादेः पदे तुच्छबुद्ध्या ।
परित्यज्य सर्वं यदाप्नोति तत्त्वं
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ १॥

दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं
समाराध्य मत्या विचार्य स्वरूपम् ।
यदाप्नोति तत्त्वं निदिध्यास विद्वान्
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ २॥

यदानन्दरूपं प्रकाशस्वरूपं
निरस्तप्रपञ्चं परिच्छेदहीनम् ।
अहंब्रह्मवृत्त्यैकगम्यं तुरीयं
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ३॥

यदज्ञानतो भाति विश्वं समस्तं
विनष्टं च सद्यो यदात्मप्रबोधे ।
मनोवागतीतं विशुद्धं विमुक्तं
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ४॥

निषेधे कृते नेति नेतीति वाक्यैः
समाधिस्थितानां यदाभाति पूर्णम् ।
अवस्थात्रयातीतमद्वैतमेकं
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ५॥

यदानन्दलेशैः समानन्दि विश्वं
यदाभाति सत्त्वे तदाभाति सर्वम् ।
यदालोकने रूपमन्यत्समस्तं
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ६॥

अनन्तं विभुं निर्विकल्पं निरीहं
शिवं सङ्गहीनं यदोङ्कारगम्यम् ।
निराकारमत्युज्ज्वलं मृत्युहीनं
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ७॥

यदानन्द सिन्धौ निमग्नः पुमान्स्या
दविद्याविलासः समस्तप्रपञ्चः ।
तदा नः स्फुरत्यद्भुतं यन्निमित्तं
परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ८॥

स्वरूपानुसन्धानरूपां स्तुतिं यः
पठेदादराद्भक्तिभावो मनुष्यः ।
श्रुणोतीह वा नित्यमुद्युक्तचित्तो
भवेद्विष्णुरत्रैव वेदप्रमाणात् ॥ ९॥

इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छङ्करभगवतः कृतौ स्वरूपानुसन्धानाष्टकम् संपूर्णम् ॥
 
विज्ञान नावं परिगृह्य कश्चि
त्तरेद्यदज्ञानमयं भवाब्धिं
ज्ञानाशिनायोहि विच्छिद्य तृष्णां
विष्णोः पदं याति स एव् धन्यः ॥
 
 


 
-- విజ్ఞాన నౌక, స్వరూపానుసంధాన స్తోత్రం

Saturday, October 27, 2012

गान्धर्व विवाह

Argument 1:

"गान्धर्वमित्येके प्रशंसन्ति स्नेहानुगत्वात्" - गौतम धर्म सूत्र २-१-३१

"सकामायाः सकामेन निर्मन्त्रः श्रेष्ठ उच्यते" - कण्व (शकुन्तल) महाभारत

Argument 2:

"गान्धर्वस्तु क्रियाहीनः रागादेव प्रवर्तते"- वीरमित्रोदय संस्कार प्रकाश

गान्धर्वादिविवाहेषु पुनर्वैवाहिको विधिः
कर्तव्यश्च त्रिभिर्वर्णैः समयेनाग्निसक्षिकः  - देवल

Following the Devala's advice and removing the defects of it by making it "dharma pravravartana", "gAndharva" is the best mode of vivAha.

-- ఆశ్వయుజ శుక్ల త్రయోదశీ, నా 18 వ గృహస్థాశ్రమ ప్రవేశ వార్షికోత్సవ సందర్భంగా!



Monday, October 22, 2012

దుర్గా తత్త్వం

మంత్రాణాం మాతృకా దేవీ శబ్దానాం జ్ఞానరూపిణీ
జ్ఞానానాం చిన్మయానందా శూన్యానాం శూన్యసాక్షిణీ
యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా
తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం
నమామి భవభీతోఽహం సంసారార్ణవతారిణీం 
-- దేవీ అథర్వ శీర్షం  దుర్గాష్టమి సందర్భంగా  
mantrANAm mAtRkA dEvI SabdAnAM jnAnarUpiNI
jnAnAnAM cinmayAnandA SUnyAnAM SUnyasAkshiNI
yasyAH parataraM nAsti saishA durgA prakIrtitA 

tAM durgAM durgamamAM dEvIM durAcAra vighAtinIm
namAmi bhavabhItOham samsArArNavatAriNIm 
In the mantras she is the tArakatvam i.e., mAtRka; In the sabdAs (sounds) she is the meaningful knowledge. In the knowledge she is the bliss! In the emptiness she is  the witness. 
for whom, there is nothing beyond; SHE is praised as "DurgA" 
Durga, difficult to attain, who is destroyer of durAcAra (bad ways of living)
I bow down being afraid of birth (again!) to thee; Thou alone can rescue me from the ocean of unending births and deaths! 


Saturday, October 20, 2012

అపూర్వ "భారతీ" కోశం

अपूर्वः कोऽपि कोशोऽयं विद्यते तव भारती ।
व्ययतो वृद्धिमायाति क्षयमायाति सञ्चयात् ॥

BhAratI! ayaM tava kOSaH kO'pi apUrvaH vidyatE. (yat ayaM) vyayataH vRddhim AyAti. (ayaM) sanjcayAt kshyaM AyAti.

O BharatI (godess of knowledge), the treasure (of knowledge) is very strange. It gorws by spending and saving causes to diminish.




యా దేవీ సర్వ భూతేషు విద్యా రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

The dEvI who is established in all the beings (not only humans!) as the capacity of knowing; I bow down to her; I bow down to her; I bow down to her again and again.

om tat sat

-- ఆశ్వయుజ శుద్ధ పంచమీ + షష్ఠి తిథి ద్వయం మూలా నక్షత్రం - సరస్వతీ పూజ