Wednesday, June 3, 2026

నిమిత్తమాత్రం భవ – శ్రీకృష్ణ మాధుర్య లీలల అంతరార్థం

నిమిత్తమాత్రం భవ – శ్రీకృష్ణ మాధుర్య లీలల అంతరార్థం

శ్రీ గురుభ్యో నమః
కృష్ణం వందే జగద్గురుం

ఈ భారతభూమి ఆర్షధర్మ స్వరూపిణి. ఋషులు దర్శించిన పరమార్థ తత్త్వం వేదరూపంగా ప్రతిష్ఠింపబడి, గురుపరంపర ద్వారా యుగయుగాలుగా మనకు ప్రసరిస్తూనే ఉంది. ఈ సనాతన జ్ఞానప్రవాహంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక విశిష్ట గురుస్వరూపుడు. అర్జునుని నిమిత్తంగా చేసుకొని ఆయన బోధించిన భగవద్గీత సర్వమానవాళికి శ్రేయోమార్గదర్శిని.

అదే సమయంలో బృందావనంలో పరమాత్మ ప్రదర్శించిన మాధుర్యలీలలు ఆ గీతాతత్త్వానికి సజీవ దృష్టాంతాలుగా వెలుగొందాయి. అందువల్లనే ఆచార్యులు “గీత బోధ అయితే — భాగవతం ఆచరణ; అక్కడ వచనం — ఇక్కడ చేష్ట” అని పేర్కొన్నారు.

గీతలో బోధించిన “నిమిత్తమాత్రం భవ” అనే సూత్రాన్ని, భక్తి ప్రధానమైన గోపికల ద్వారా అనుభవరూపంగా సాక్షాత్కరింపజేసి, వ్యాసమహర్షి భాగవతాన్ని పరమహంస సంహితగా ఆవిష్కరించారు.


లీల తాత్విక స్వరూపం

“లీలా” అనే పదానికి తాత్విక అర్థం — దివ్యమైన ముక్తి ప్రధాన కార్యం.
సామాన్యజనులు ఆచరించే కర్మలు బంధాన్ని కలిగిస్తే, పరమాత్మ లీలలు మోక్షాన్ని ప్రసాదిస్తాయి. పరమాత్మను ఏ భావంతో ఆశ్రయించినా, ఫలితంగా లభించేది పరమశ్రేయస్సు ఐన ముక్తియే.   

కృష్ణలీలలు రెండు విధాలుగా అవగతమవుతాయి:

  • ఐశ్వర్యలీలలు – ఈశ్వరత్వ ప్రకటన

  • మాధుర్యలీలలు – పరతత్త్వ సౌందర్య ప్రకాశం

శ్రీకృష్ణావతారం మాధుర్యావతారం. ఇందులో
నామమాధురి, రూపమాధురి, వేణుమాధురి, లీలామాధురి, తత్త్వమాధురి
అనే ఐదు మాధుర్యాలు సంపూర్ణంగా వికసిస్తాయి. ఇవి భక్తుని అంతర్ముఖంగా నడిపించి తత్త్వసాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాయి.


వస్త్రాపహరణలీల – ఆవరణక్షయం, శరణాగతి సిద్ధి

నందవ్రజ గోపికలు కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి, శ్రీకృష్ణుని ప్రాప్తిని కోరుకొన్నారు. యమునాతీరంలో స్నానం చేస్తూ వ్రతాంతిమదినాన నియమాన్ని అతిక్రమించిన సందర్భంలో, కృష్ణుడు వారి వస్త్రాలను అపహరించాడు.

ఈ లీలా బాహ్యంగా చూడగా సాధారణంగా కనిపించినా, అంతరార్థంగా ఇది —
అహంకార, లజ్జా, ఉపాధి రూప ఆవరణల నివృత్తి.

కృష్ణుడు వారిని శిక్షించలేదు;
వారి వ్రతభంగాన్ని నివారించి,
వారి అంతఃకరణాన్ని శుద్ధిపరచి,
సంపూర్ణ శరణాగతికి సిద్ధం చేశాడు.

యోగపరంగా ఇది ప్రత్యాహార స్థితి —
బాహ్య ఆధారాలన్నింటినీ ఉపసంహరించి, అంతర్ముఖతకు ప్రవేశం.


వేణునాదం – ఆహ్వానం నుండి ఆత్మసమర్పణం వరకు

శరదృతువులో పూర్ణిమా రాత్రి, కృష్ణుడు తన వేణుమాధుర్యంతో గోపికలను ఆహ్వానించాడు. ఆ నాదం సంగీతం కాదు — అది ప్రతి గోపికను వ్యక్తిగతంగా పిలిచిన పరమాత్మ స్వరం.

ఆ పిలుపుకు స్పందించి గోపికలు:

  • లౌకిక ధర్మాలను

  • దేహాభిమానాన్ని

  • సంబంధబంధాలను

అన్నిటినీ విడిచిపెట్టి, “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” అనే గీతావాక్యానికి సజీవ రూపంగా బృందావనానికి చేరుకున్నారు.


విరహం – భక్తి నుండి జ్ఞానానికి మార్పు

గోపికలలో సూక్ష్మమైన సౌభాగ్యమదాన్ని తొలగించేందుకు కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
విరహతాపం ద్వారా వారు బాహ్యాన్వేషణ నుండి అంతరాన్వేషణకు ప్రవేశించారు.

గోపికాగీతం ఈ స్థితికి ప్రతిబింబం:
అక్కడ వారు కృష్ణుణ్ని యశోదాతనయుడిగా మాత్రమే కాక,
సర్వభూతహృదయవాసి అంతర్యామిగా దర్శించారు.

ఇది భక్తి జ్ఞానరూపంలో వికసించిన క్షణం.


రాసలీల – చైతన్య ఏకత్వ అనుభవం

విరహం ద్వారా పాపక్షయం, సాంగత్యం ద్వారా పుణ్యక్షయం కలిగిన తరువాత, గోపికలు మోక్షయోగ్యులయ్యారు. కృష్ణుడు వారిని మహారాసలీలలో ప్రవేశింపజేశాడు.

యమునాతీరంలోని రాసమండలంలో, యోగీశ్వరేశ్వరుడు తన యోగమాయాశక్తితో ప్రతి గోపికతో కూడి విహరించాడు.

ఇది:

  • అనేకత్వంలో ఏకత్వం

  • జీవబ్రహ్మ ఐక్యం

  • చైతన్య పరిపూర్ణ అనుభవం

వస్త్రాపహరణంతో ప్రారంభమైన ఆవరణక్షయం, రాసలీలలో పరిపూర్ణ ఏకత్వానుభవంగా పరిపక్వమైంది.


సారాంశం – నిమిత్త భావ పరిపూర్ణత

శ్రీకృష్ణ మాధుర్యలీలలను యోగదృష్టితో దర్శించినప్పుడు, అవి మోక్షమార్గాన్ని మాత్రమే కాక, దృష్టిపరివర్తనాన్ని ప్రసాదిస్తాయి. ఈ పరివర్తనే “రసం” — ఆనందస్వరూపం.

మనమందరం ఆ జగద్గురువు చేతిలో నిమిత్తమాత్రులమే.
ఆయన వేణునాదానికి స్పందించే సాధనమాత్రులమే.

ఇదే గీతా సారం.
ఇదే భాగవతానుభవం.


మంత్రస్వరూపం

“శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః”


సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు

Note: This article was written by me for the souvenir edition of "Pravachana Rajatotsavam".




Sunday, August 31, 2025

శ్రీరాధా కృపాకటాక్ష స్తవరాజము

“శ్రీరాధా కృపాకటాక్ష స్తవరాజము”.

1. మునీంద్ర బృంద వందితే త్రిలోక శోక హారిణి
ప్రసన్న వక్త్ర పంకజే నికుంజభూ విలాసినీ |
వ్రజేంద్ర భానునందినీ వ్రజేంద్రసూనుసంగతే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O Shri Radhe, daughter of Vrishabhanu! Worshipped by the supreme sages like Shukadeva and Narada! Remover of sorrow from the three worlds! One with a cheerful lotus-like face! Who delights in the groves! You constantly enjoy pastimes with Nandanandan Shri Hari (Lord Krishna). O merciful one, when will you make me worthy of your glance of grace? ||1||


2. అశోక వృక్ష వల్లరీ వితాన మండపస్థితే

ప్రవాళ బాల పల్లవ ప్రభారుణాంఘ్రి కోమలే |
వరాభయస్ఫురత్ కరే ప్రభూత సంపదాలయే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O Radhika! Seated in a grove pavilion covered by charming creepers of Ashoka trees. O one whose feet are as tender as the fresh blush of new shoots! O one with beautiful lotus-like hands eager to bestow fearlessness! O giver of joy and abode of infinite treasures! When will you make me worthy of your glance of grace? ||2||

3. అనంగరంగ మంగళ ప్రసంగ భంగురభ్రువోః

సవిభ్రమం ససంభ్రమం దృగన్తబాణ పాతనైః |
నిరన్తరం వశీకృత ప్రతీతనన్దనన్దనే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O Shri Kishori! Possessing the power to continually enchant Nandanandan (Krishna) with illusion and bewilderment caused by arrow-like sidelong glances from your charming eyebrows in the auspicious play of Kamadeva! When will you make me worthy of your glance of grace? ||3||

4. తడిత్ సువర్ణ చంపక ప్రదీప్త గౌర విగ్రహే

ముఖప్రభా పరాస్త కోటి శారదేన్దుమండలే |
విచిత్ర చిత్ర సంచరచ్చకోర శాబలోచనే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్॥

O one with a radiant golden form shining like lightning, gold, and Champa flowers! O one whose facial glow surpasses the glory of millions of autumn moons! O one with beautiful, restless eyes like young chicks of the playful Chakor bird! O Shri Radhika! When will you make me worthy of your glance of grace? ||4||

5. మదోన్మదాతియౌవనే ప్రమోదమాన మండితే

ప్రియానురాగరంజితే కళా విలాస పండితే |
అనన్య ధన్య కుంజ రాజ్య కామకేళి కోవిదే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O one with supremely intoxicated youthful charm! Adorned with bliss from love’s pride! Colored by the affection of Shri Krishnachandra! Expert in endless artistic pastimes! O Shri Radhika, knower of love plays in the supreme grove kingdom! When will you make me worthy of your glance of grace? ||5||

6. అశేష హావభావధీర హీర హార భూషితే

ప్రభూతశాత కుంభకుంభ కుంభికుంభ సుస్తని |
ప్రశస్త మన్దహాస్య చూర్ణ పూర్ణ సౌఖ్య సాగరే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O adorned with endless graceful expressions and dignified emotional states! O one with high, rounded breasts like golden pitchers and female elephants’ heads! O Shri Radhika, whose form is a sea of happiness overflowing with gentle smiles! When will you make me worthy of your glance of grace? ||6||

7. మృణాల బాల వల్లరీ తరంగ రంగ దోర్లతే

లతాగ్రలాస్యలోల నీల లోచనావలోకనే
లలల్లులన్మిళన్మనోజ్జ ముగ్ధమోహనాశ్రయే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O one with beautiful arms swaying like tender lotus stalks in water waves! O one whose blue eyes gaze like the tips of dancing creepers! O Shri Radhika, beloved of the enchanting Manmohan (Krishna)! When will you make me worthy of your glance of grace? ||7||

8. సువర్ణ మాలికాంచిత త్రిరేఖ కంబు కంఠగ

త్రిసూత్ర మంగళీ గుణ త్రిరత్న దీప్త దీధితే |
సలోల నీలకున్తల ప్రసూన గుచ్ఛ గుంఫితే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O one with a conch-like neck adorned with three lines and golden garlands! O shining with necklaces of gems like diamonds, pearls, and rubies! O Radhika, who wears bunches of flowers in your swaying blue hair! When will you make me worthy of your glance of grace? ||8||

9. నితంబ బింబ లంబమాన పుష్పమేఖలాగుణే

ప్రశస్త రత్న కింకణీ కలాప మధ్యమంజులే |
కరీన్ద్ర శుండ దండికా వరోహసౌభగోరుకే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O daughter of Vrishabhanu! Wearing a long jeweled girdle adorned with flowers on your hips! O one whose waist is adorned with splendid jewel-studded tiny bells! O Shri Radhika, whose graceful thighs are rounded like the trunk of an elephant! When will you make me worthy of your glance of grace? ||9||

10. అనేక మంత్ర నాద మంజునూపురారవస్ఖలత్

సమాజ రాజహంస వంశ నిక్వణాతి గౌరవే |
విలోలహేమవల్లరీ విడంబి చారు చంక్రమే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O Radhika, who enhances Krishna’s beauty! Your anklets produce sounds sweeter than many captivating mantras. They diminish the charm of royal swan lineages, and your gait outshines the movement of restless golden creepers. When will you make me worthy of your glance of grace? ||10||

11. అనంత కోటి విష్ణులోక నమ్ర పద్మజార్చితే

హిమాద్రిజా పులోమజా విరించజా వరప్రదే |
అపార సిద్ధి వృద్ధి దిగ్ధ సంపదాంగుళీ నఖే
కదా కరిష్యసీహ మాం కృపాకటాక్షభాజనమ్ ||

O Radhika! Infinite millions of Vishnulokas bow to your lotus-like toenails. You grant boons to goddesses like Parvati, Indrani and Saraswati. Infinite siddhis and prosperity reside in the toenails of your lotus feet. When will you make me worthy of your glance of grace? ||11||

12. మఖేశ్వరి క్రియేశ్వరి స్వధేశ్వరి సురేశ్వరి

త్రివేద భారతీశ్వరి ప్రమాణ శాసనేశ్వరి ।
రమేశ్వరి క్షమేశ్వరి ప్రమోద కాననేశ్వరి
వ్రజేశ్వరి వ్రజాధిపే శ్రీరాధికే నమోస్తుతే॥

O Shri Radhika! Mistress of all sacred rituals and actions! Sovereign goddess of all deities! Embodiment of Vedic knowledge and speech! Supreme ruler of Vrindavan and Vraja! Salutations again and again to you! ||12||

13. ఇతీ తమద్భుతం స్తవం నిశమ్య భానునందినీ

కరోతు సంతతం జనం కృపాకటాక్షభాజనమ్ |
భవేత్తదైవ సంచిత త్రిరూప కర్మనాశనం
భవేత్తదా వ్రజేంద్రసూను మండల ప్రవేశనమ్ ||

రాకాయాం చ సితాష్టమ్యాం దశమ్యాం చ విశుద్ధధీః |

ఏకాదశ్యాం త్రయోదశ్యాం యః పఠేత్ సాధకః సుధీః ||

యంయం కామయతే కామం తంతం ప్రాప్నోతి సాధకః।

రాధాకృపాకటాక్షేణ భక్తిః స్యాత్ ప్రేమలక్షణా ||

ఊరుదఘ్నే నాభిదఘ్నే హృద్దఘ్నే కంఠదఘ్నకే |

రాధా కుండజలే స్థిత్వా యఃపఠేత్ సాధకః శతమ్ ||

తస్య సర్వార్థసిద్ధిః చ వాక్సామర్థ్య తతోలభేత్ |

ఐశ్వర్యం చ లభేత్ సాక్షాత్ దృశా పశ్యతి రాధికామ్ ||

తేన సా తక్షణాదేవ తుష్టా దత్తే మహావరమ్ |

యేన పశ్యతి నేత్రాభ్యాం తత్ప్రియం శ్యామసుందరమ్ ||

నిత్యలీలా ప్రవేశం చ దదాతి హి వ్రజాధిపః |

అతః పరతరం ప్రాప్యం వైష్ణవానాం చ విద్యతే॥

- ఈ స్తోత్రాన్ని పూర్ణిమ, శుద్ధాష్టమి, దశమి, ఏకాదశి, త్రయోదశి నాడు పారాయణ చేస్తే అభీష్ట సిద్ధి లభిస్తుంది. రాధాకృప చేత ప్రేమ స్వరూప భక్తి లభిస్తుంది. బృందావనంలోని రాధా కుండ జలంలో ఊరువుల వరకు, నాభి వరకు, హృదయం వరకు, కంఠం వరకు (వీలైనంత) నిలబడి నూరు మార్లు పఠించినవారికి సర్వార్థ సిద్ధులు, వాక్సమర్థత, రాధా దర్శన సిద్ధి లభిస్తాయి. శ్రీకృష్ణుని నిత్య లీలలో ప్రవేశించే భాగ్యం ప్రాప్తిస్తుంది.

-- Sri Viswavasu nAma samvatsara rAdhAshTamI

Wednesday, February 26, 2025

ఆర్తత్రాణస్తోత్రం

 శ్రౌతస్మార్తపథే పరాఙ్ముఖమపి ప్రోద్యన్మహాపాతకం

   విశ్వాతీతమపత్యమేవ గతిరిత్యాలాపయంతం సకృత్ .

రక్షన్ యః కరుణాపయోనిధిరితి ప్రాప్తప్రసిద్ధిః పురా

   హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః 

https://sanskritdocuments.org/doc_shiva/ArttatrANastotram.html


Monday, January 13, 2025

శ్రీ కుఞ్చతాఞ్ఘ్రి స్తవమ్‌

బ్రహ్మైవాహం శివో హం విభురహమమలశ్చిద్ఘనోఽహం విమాయః
సోఽహం హంసస్స్వతన్త్రస్తదహమతిజరః ప్రజ్ఞయా కేవలోఽహమ్ ।
ధ్యేయధ్యాతృప్రమాణై: గలితమతిరహం నిశ్చలోఽహం సదేత
ప్రాజ్ఞా యచ్చిత్సభాయామతిశయమభజత్ కుఞ్చతాఞ్ఘ్రిం  భజేహమ్ ||242


నేను బ్రహ్మను, నేను శివుడను, నేను విభువును, పాపం లేనివాడను, చిద్ఘనుడను, మాయారహితుడను, హంసస్వరూపుడను, స్వతంత్రుడను, వార్ధక్యంలేని వాడను, కేవలం ప్రజ్ఞతో కూడినవాడను, ధ్యేయం, ధ్యాత, ప్రమాణం - అనే వీనికి అందనివాడను, సదా నిశ్చలుడను అని ప్రాజ్ఞులు ఏ పరమేశ్వరుని చిత్సభలో ఆనందాతిశయాన్ని పొందుతారు. అటువంటి, కుంచితాఞ్ఘ్రిని కల్గిన నటరాజమూర్తిని భజిస్తున్నాను.


--- ఉమాపతి శివ విరచితమ్‌ ( శ్రీ  క్రొధి నమ సంవత్సర భొగి, పుష్య పూర్ణిమ,  ఆరుద్రా నక్షత్రమ్‌, సోమవారం )



Wednesday, March 13, 2024

ముగ్ధనాయిక

 ముగ్ధనాయిక పారవశ్యము

ఉ॥ పానుపుఁ జేరినంతఁ బతిప్రక్కను నీవిక జాఱి (వల్వయుం దానట మేఖలాగుణధృతంబయి నిల్చె నితంబ మం దటన్) మేనతఁ డంట, నాతఁడని, నేనని, యిట్టిది కేళి యంచు, నే మైనను భేదమే యెఱుఁగ నంగన! యంగజు మాయ యెట్టిదో! 

శ్రీ తాళ్ళపాక తిరువెంగళప్ప శృంగార అమరు కావ్యము 31 ( సంస్కృత మూలం 97 )

ఇందులో త్రిపుటి లీనమయ్యే భావన స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నే సంస్కృత మూలంలో:

कान्ते तल्पमुपागते विगलिता नीवी स्वयं तत्क्षणाद्‌ तद्वासः श्लथमेखल गुणधृत्तं किंचिन्नितम्बे स्थितम् ।

एतावत्सखि वेद्मि केवलमहं तस्याङ्गसङ्गे पुनः कोऽमै कास्मि रतं तु किं कथमिति स्वत्पापि मे न स्मृतिः ॥९७॥

-- Amaru kaavyam 97

In yogic paralance this is known as triputi layam by the jeeva, who is the mugdha nAyika. This Telugu kavyam was dedicated to Lord Venkateswara by the poet. 

Saturday, March 4, 2023

శివానందలహరి 81 (The way I feel now!)

कञ्चित्कालमुमामहेश भवतः पादारविन्दार्चनैः  
कञ्चिद्ध्यानसमाधिभिश्च नतिभिः कञ्चित्कथाकर्णनैः ।
कञ्चित् कञ्चिदवेक्षनैश्च नुतिभिः कञ्चिद्दशामीदृशीं
य प्राप्नोति मुदा त्वदर्पितमना जीवन् स मुक्तः खलु ॥ ८१॥ 

కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః 
కంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః 
కంచిత్ కంచిదవేక్షనైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం 
యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ స ముక్తః ఖలు .. 81.. 

kañcitkālamumāmaheśa bhavataḥ pādāravindārcanaiḥ 
kañciddhyānasamādhibhiśca natibhiḥ kañcitkathākarṇanaiḥ . 
kañcit kañcidavekṣanaiśca nutibhiḥ kañciddaśāmīdṛśīṃ 
yaḥ prāpnoti mudā tvadarpitamanā jīvan sa muktaḥ khalu .. 81.. 

 శ్రీ శుభకృత్ ఫాల్గుణ శుక్ల ద్వాదశి, నరసింహ ద్వాదశి, శని త్రయోదశి ప్రదోషం, పుష్యమి నక్షత్రం

Oh, umA-mahESwarA, one who blissfully spends some time in the archana of thy lotus feet, sometimes in deep contemplation and absorption, sometimes in bowing down, sometimes in listening to your narrations, sometimes looking at thy form(s), sometimes singing your glory, sometimes merely being in presence; by surrendering the mind to thee - he is verily living liberated. 

-- This is how exactly I feel on this day! 



Tuesday, March 8, 2022

శివ పద మణి మాలా

శివేతి ద్వౌ వర్ణౌ పర పద నయత్ హంస గరుతౌ

తటౌ సంసారాబ్ధేః నిజ విషయ బొధాంకుర దలే

శృతేః అంతః గోపాయిత పర రహస్యౌ హృది చరౌ 

ఘరట్ట గ్రావాణౌ భవ విటపి బీజౌషు దలనే 


శివ పద మణి మాలా - శ్లోకం 1


SivEti dvau varNau para pada nayat hamsa garutau

taTau samsArAbdhE@h nija vishaya bodhAnkura dalE

SRtE@h anta@h gOpAyita para rahasyau hRdi charau 

gharaTTa grAvANau bhava viTapi bIjaushu dalanE 


Siva pada maNi mAlaa - SlOkam 1

For one hour long monologue: https://youtu.be/-s18yE4K-Sc


Wednesday, May 19, 2021

రఘువంశం - యజ్ఞ సంస్కృతి

తవ మంత్రకృతో మంత్రైర్దూరాత్ప్రశమితారిభిః .

ప్రత్యాదిశ్యంత ఇవ మే దృష్టలక్ష్యభిదః శరాః .. 1-61..

--రఘువంశం - 1 వ సర్గ, 61వ శ్లోకం

ఇవి దిలీప చక్రవర్తి వశిష్ఠ మహర్షితో అన్న మాటలు. 

సనాతాన యజ్ఞ సంస్కృతి లో దేశాన్ని పరిపాలించే రాజులు, ఋషుల మంత్ర శక్తి తో అతీంద్రియమైన శక్తిని పొందేవారు.  

శత్రువులు రెండు రకాలు. 1. బాహ్యం గా కనిపించే శత్రువులు 2. అంతరంగా కనిపించకుండా రాజ్యానికి అపకారం చేసే (దూర శత్రువులు) 

బాహ్య శత్రువులను జయించడానికి అస్త్రాలు అవసరమైతే, సూక్షమైమన శత్రువులను శాంతింపజేయడానికి మంత్రశక్తి తో కూడిన శస్త్రాలు, వాటి ప్రయోగం తెలిసిన పురోహితులు అవసరమవుతారు. 

పైన చెప్పిన శ్లోకానికి అర్థం ఇలా చెప్పుకోవచ్చు:

ఓ మహర్షీ! మీ మంత్రములతో దూరమునుంచే శాంతింపబడిన సూక్ష్మ శత్రువులు నివారించ బడుతున్నారు (నా రాజ్యం రక్షించ బడుతోంది) నా శరములు కనిపించే శత్రువులను మాత్రమే భేదిస్తున్నాయి.

ఇదీ యజ్ఞ సంస్కృతి. క్షాత్రం, బ్రాహ్మం సహాయంతో ప్రజా రక్షణ చేయాలి. 


Friday, June 21, 2019

స్మరామి వేంకటేశ్వరం

సరోజపత్ర లోచనం సుసాధు ఖేద మోచనం 
చరాచరాత్మక ప్రపంచ సాక్షిభూత మవ్యయమ్ 
పురారి పద్మజామరేంద్ర పూజితాంఘ్రి పంకజం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

పురాణపూరుషం సమస్త పుణ్యకర్మ రక్షణం 
మురాసురాది దానవేంద్ర మూర్ఖజాల శిక్షణమ్ 
ధరాధరోద్ధరం ప్రశాంత తాపసాత్మ వీక్షణం 
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

శరాసనాది శస్త్రబృంద సాధనం శుభాకరం 
ఖరాఖ్య రాక్షసేంద గర్వకాననోగ్రపావకమ్
నరాధినాధ వందితం నగాత్మజాత్మ సన్నుతం 
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

సురారి శౌర్య నిగ్రహం సుపర్వరాట్ పరిగ్రహం 
పరాత్పరం మునీంద్రచంద్ర భావగమ్య విగ్రహమ్
ధరామరాఘ శోషణం సుధాతరంగ భాషణం
స్మరామి వేంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరమ్

https://m.facebook.com/story.php?story_fbid=10162246572960151&id=776915150


Tuesday, June 18, 2019

శ్రీకృష్ణుడు - శృంగారము

శృంగారాకృతితోడ వచ్చి 'పదముల్ శృంగార సారంబుతో
డం గూఢంబుగఁ జెప్పు' నీ వనగ 'నట్లా చెప్పలే' నన్న నన్
ముంగోపంబునఁ జూచి లేచి యట నే మ్రొక్కంగ మన్నించి త
చ్చృంగారోక్తులు తానె పల్కికోను నా శ్రీకృష్ణు సేవించెదన్

-- మాతృశ్రీ తరిగొండ వేంగమాబ, శ్రీ వేంకటాచల మహాత్మ్యము (పద్య కావ్యము), ప్రథమాశ్వాసము, 13 వ పద్యం. శార్దూల విక్రీడితము

In a kAvya, the rasa rAja SRngAra is a must.

Most handsome form of Sri kRSNa appears to poetess Tarigonda Vengamamba and instructs her to include the flavor of attraction in her devotional kAvya Sri Venkatachala mahatmyam and politely refuses to do so. Getting gently angry on her and getting up from there he only introduces those padyas of Sringara rasa into the kAvay; "such form of kRSNa i worship." - Says poetess.

How cute!

Thursday, November 22, 2018

ఋభు గీత

వామం యస్య వపుః సమస్తజగతాం మాతా పితా చేతరత్
యత్పాదాంబుజనూపురోద్భవరవః శబ్దార్థవాక్యాస్పదమ్
యన్నేత్రత్రితయం సమస్తజగతామాలోకహేతుః సదా
పాయాద్దైవతసార్వభౌమ గిరిజాలంకారమూర్తిః శివః
-- ఋభు గీత మంగళాచరణం, వైకుంఠ చతుర్దశి సందర్భంగా


Wednesday, October 17, 2018

ధర్మానికి పునాది - దాంపత్యం

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి  .. ఏష ధర్మః సనాతనః 195 ఎంతో ఉపయోగ కరమైన ధార్మిక వ్యాసాల సంకలనం. 

ధర్మానికి పునాది - దాంపత్యం అనే వ్యాసంలో "భార్యా దైవకృతా సఖా" అనీ "భార్యా శ్రేష్ఠతమా సఖా" అనీ శృతి చెప్పిన విషయాలు చెప్పబడ్డాయి.

ఇంకా మనుస్మృతి:
అర్థస్య సంగ్రహే చైనాం వ్యయే చైవ నియోజయేత్ శౌచే ధర్మేన్నపక్వాంచ పారిణాహ్యస్యచేక్షణే 

అంటే, "ఆర్జించిన ధనాన్ని రక్షించటంలోనూ వ్యయం లోనూ, గృహం లో శౌచ సదాచార ధర్మాల్లోనూ ఆహార విషయంలోనూ గృహిణీయే అధికారిణి" అని చెప్పారు. 

అందుకని, దాంపత్యమే ధర్మానికి పునాది. 

పూర్తి వ్యాసం: (ఎవరైనా కాపీరైటు ఉల్లంఘన గా భావిస్తే తెలియజేయండి - స్కానులను తొలగిస్తాము)






అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా అని శ్రీ రామ చంద్ర మూర్తి శ్రీ రామాయణం లో చెప్పినట్లుగా అనన్యా హి మయా శోభనా భాస్కరస్య ప్రభా యథా! 





Friday, March 30, 2018

సవిమర్శ ఆంధ్ర వాజ్ఞ్మయ చరిత్ర

ఆచార్య శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు సాహిత్య విమర్శ మరియు సాహిత్య చరిత్ర ఆంధ్ర విశ్వ విద్యాలయం లో బోధించేవారు.

ఒక భాష యొక్క సాహిత్య చరిత్ర గురించి పరిశోధించడం ఎంతో కష్టమైన పని. పైగా సాహిత్య విమర్శ చేస్తూ చరిత్రని గ్రాంధీకరించడం నా చిన్న బుర్రకి అందని అసాధ్యమైన ప్రక్రియ.


1. అసలు వాజ్ఞ్మయం అంటే యేమిటి? మనం రాసుకునే పద్దులు, వ్యవహార లావాదేవీలూ కూడా, ప్రతీ మాటా వాజ్ఞ్మయమే అని ఒక వాదం. అలాకాదు, చందోబద్ధమైన రచనలే వాజ్ఞ్మయం అని ఇంకో వాదం. ఈ రెండిటికీ మధ్యలో పద్య గద్య కావ్యాలూ, శాస్త్రాలూ విజ్ఞాన తాత్విక సంపన్నమైన రచనలను గుర్తించి ఆ ఆ సాహిత్య ప్రక్రియలకు కళారూపాన్ని సిద్ధింపచేసి వాజ్ఞ్మయమునకొక నిర్వచనాన్ని ఇచ్చారు.

2. సరే. ఆంధ్ర భాష లాంటి ప్రాకృతిక భాషా వాజ్ఞ్మయానికి మూలాధారం సంస్కృత భాషలోని శాస్త్రాలూ కావ్యాలూన్ను. చరిత్ర గా చూస్తే, మన మాతృభాష గొప్పతనాన్ని చెప్పుకోవటానికి సంస్కృతాన్ని ఏదోఒక విధంగా నిందించడం ద్రావిడ ప్రాముఖ్యతని పొగడటం లేదా ప్రాచీనత్వాన్ని ఆపాదించడం జరుగుతుంది. అలా కాకుండా, సంస్కృతం యొక్క ఔన్నత్యాన్ని ఏ మాత్రం తగ్గించకుండా మన మాతృభాష సౌందర్యాన్ని ప్రతిష్టించిన విధానం విమర్శకులందరూ గుర్తించ వలసి ఉంటుంది.

3. ఇకపోతే, సాహిత్య చరిత్రను యుగములుగా విభజించటం, ఆ ఆ యుగములకు ఒక యుగ కర్త పేరు ఇవ్వడం, ఆ యుగంలోని సమకాలీన కవుల కావ్యాలను పరిశీలించి ముఖ్యమైన ప్రక్రియా భేదములను ప్రకటించడం, విశ్లేషించడం విమర్శకుని ప్రతిభ పైన ఆధార పడుతుంది. లక్ష్మీకాంతం గారు అద్భుతంగా ఈ కార్యాన్ని నిర్వర్తించారు. శ్రీనాధుడి యుగంగా పేరొందిన కాలమే పోతన భాగవత కాలం కూడా కావటం విశేషం. ఇంకా చివరి యుగానికి "క్షీణ యుగం" అనటం కూడా సమంజసంగానే తోస్తుంది.

ఏది ఏమైనా తెలుగు సాహిత్యం తెలుసుకోవాలనుకునే వారందరూ ఈ పుస్తకాన్ని తప్పకుండా అభ్యసించవలసి ఉంటుంది. ముఖ్యంగా నేటి ఆధునిక "సినిమా" కవులు, రచయితలు, విమర్శకులూ ఇటువంటి గ్రంధాలను ఆశ్రయిస్తే మన మాతృభాష ఎంతో సంతోషిస్తుంది. 


శుభం భూయాత్ 


Monday, December 18, 2017

కామేశ్వరీ శతకము


జననాభావమనుగ్రహింపు, మది శక్యంబు కాదేని పై
జననంబందును నా కొసంబు మెటులో సంగీతసాహిత్యముల్
పనిలేదీయుదరంపు పోషణముకునై భాషాంతరమ్ముల్ జగ
జ్జననీ దీనికి నింత వ్యర్థపుఁ బ్రయాసంబేల కామేశ్వరీ!

-- తిరుపతి వెంకట కవుల కామేశ్వరీ శతకం నుంచి



Sunday, September 3, 2017

పాద దండం

ब्रह्बाण्डच्छत्रदण्डः शतधृतिभवनाम्भोरुहो नालदण्डः
क्षोणीनौकूपदण्डः क्षरदमरसरीद्पट्टिकाकेतुदण्डः ।
ज्योतिश्क्राक्षदण्डस्त्रिभुवनविजयस्तम्भदण्डोऽङ्घ्रिदण्डः
श्रेयस्त्रैविक्रमस्ते वितरतु विबुधद्वेषिणां कालदण्डः ॥


brahmANDa-chatra-daNDaH 
SatadhRti bahvana ambhOruhaH nAladaNdaH 
kshONI naukUpa daNDaH 
ksharad amara sarIt paTTikA kEtu daNdaH 
jyotish-chakra-danDaH 
tribhuvana vijaya stambha daNdaH , anghri daNdaH 
SrEyaH traivikramaH te vitaratu 
vibudha dvEshiNAM kAla daNDaH 

The middle shaft of the umbrella for the protective space, the stem of lotus of creator brahma, the conqueror of all worlds, the shaft of the earth-ship's mast, the flag shaft of infinite starry worlds, the central axis of bright wheel of light, the foot of trivikrama - may you be blessed by that daNDaH raised on high; for those enemies of wisdom it is the punishment rod of time!

-- From daNDi's daSa kumAra charitram invocation verse on the occasion of srI vAmana jayanti of SrI hEmalambi year 



Sunday, August 20, 2017

కైవార తాతయ్య కాలజ్ఞానం

దొడ్డ దొరలిండ్లలో - ధోవతులు కొలువున్న
వాని అధికార - మెవ్వరికి లేదు
గ్రామాధిపతి, పణతి - గౌడి మాటకు వెరచు
దాని అధికార - మెవ్వరికి లేదు
క్షవరికుడు పులివంటి - రాజు శిఖ పట్టుకొను
వాని అధికార - మెవ్వరికి లేదు
ప్రభువుల నగరిండ్ల - పాన్పులు సవరించు
వాని అధికార - మెవ్వరికి లేదు

వీరు అతిముద్దు రాజులకు - అనుదినంబు
చాడి కొండెములాడిన - చాలుననరు
అమర నారేయణుని సఖ - హర మహాత్మ
అధిక భవ భంగ కైవరము - భీమలింగా!

-- కాలజ్ఞాన సూక్ష్మ భీమలింగ శతకము, నక్షత్ర మాల, 3వ పద్యం

kaivAra tatayya (1726-1836) said a 27 verse nakshatra mala describing the future on SrImukha nama samvatsara SrAvaNa sukla panchami (1813-14 AD) 

Above is the third verse of the saying, which describes the future state of leadership / management. In 2017, I see this happening exactly as said. 

"The big leaders will listen to the rumors of their servants instead of the capable subordinates. The washer-man of a big leader will have more power than anyone else; the local leader who can't be controlled by anyone will be controlled by his wife, no one will have the power of the barber of the king, the servants of leaders will show all the power. Even the leaders / managers encourage such a behavior." O lord hara, my friend! bhImalinga of kaivara, capable of removing this worldly burden!!

--- On this SrI hemalambi year SravaNa mAsa Siva rAtri 

Sunday, August 13, 2017

అచ్యుతాష్టకం - achyuta-ashTakam

ధేనుకారిష్టహానిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మామ్ సర్వదా || ౬ ||

For full AchyutAShTakam in devanagari: http://www.stutimandal.com/poemgen.php?id=80 
Telugu: http://sanskritdocuments.org/doc_vishhnu/achyuta8.html?lang=te 

Who is unfavorable to daemons like dhEnuka, arishTa, who is destroyer of kEsi and kamsa, the player of a bamboo flute, who is angered by pUtana, who plays on yamuna river (the daughter of Sun), the young cow-heard boy, may he protect me always! 

--- From Adi SankarAcharya's achyutaashTakam - verse 6. 

--- On the occasion of kRshNAshTami of SrI hEmalambi nAma samvatsara on 14th August 2017

May that bAla-gOpAlaka protect everyone always! 

Saturday, July 8, 2017

వ్యాస పూర్ణిమ

वदव्यासंस्वात्मरूपंसत्यसन्धं परायणम ।
शान्तं जितन्दे्रियक्रोधंसशिष्यं प्रणमाम्यहम॥

From: 
http://www.sringeri.net/wp-content/uploads/2016/07/Gurusaparya_Telugu.pdf

వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం ।
శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం॥

I bow down to: vEda vyAsa, form of own self, truthful, supreme, peaceful, conqueror of senses and anger, along with his sishyas (- paila, vaiSampAyana, jaimini and sumantra. )

--- శృంగేరీ పీఠం వారి 'గురు సపర్య' అనే సంకలనం నుంచి

http://www.sringeri.net/wp-content/uploads/2016/07/05-Sri-VedaVyasa-StutiH-308.mp3
http://www.sringeri.net/wp-content/uploads/2016/07/Gurupaduka_Stotra_01.mp3




Friday, June 16, 2017

ధన్యుల కర్మ

త్యక్త్వా మమ-అహం ఇతి బంధకరే పదే ద్వే
మాన-అవమాన సదృశాః సమదర్శినః చ
కర్త్రః-అన్యం అవగమ్య తత్ అర్పితాని
కుర్వంతి కర్మ పరిపాక ఫలాని ధన్యాః

--- ఆది శంకరుల ధన్యాష్టకం నుంచి

Having given up two binding words "I and mine"
being equal towards the likes of honor-dishonor as well
understood that the doer is diffent (from self) and resigning (results thereof in that doer)
performs actions of fully ripened results (as duties) - those are blessed

---  Adi Sankara's "praise of the blessed" stotram

Remembered this SlOka when I heard through various social media channels that the jagadguru of Sringeri has been dishonored at a function by an ignorant person. The results surely bind the ignorant and never touch those with wisdom. May god forgive those ignorant people.

Full dhanyAshTakam can be read: http://sanskritdocuments.org/doc_z_misc_shankara/dhanyaa8.html?lang=te 

Tuesday, April 4, 2017

श्रीरामगीता - శ్రీరామగీతా

प्रत्यक्परोक्षादि विरोधमात्मनो-
र्विहाय सङ्गृह्य तयोश्चिदात्मताम् ।
संशोधितां लक्षणया च लक्षितां
ज्ञात्वा स्वमात्मानमथाद्वयो भवेत् ॥ २६॥

ప్రత్యక్పరోక్షాది విరోధమాత్మనో-
ర్విహాయ సఙ్గృహ్య తయోశ్చిదాత్మతామ్ ।
సంశోధితాం లక్షణయా చ లక్షితాం
జ్ఞాత్వా స్వమాత్మానమథాద్వయో భవేత్ ॥

http://sanskritdocuments.org/doc_giitaa/raamagitaa.html?lang=te

Swami ChinmayAnanda's English translation for the above verse:
Rejecting the difference of nearness and remoteness, and so on... between jIvAtma and paramAtma, one should know one's own nature as that of pure consciousness, arrived at through the inquiry and implied by the method of implication. Thereafter, realizing one's own true Self and Brahman, one should merge to become one with it.

In Adhyatma rAmAyaNa, uttara kAnDa, 5th sarga is called SrI rAma gItA. It has 62 verses and it is an instruction from Lord rAma to his brother LakshmaNa who is looking for surest path to supreme realization.
This verse is 26th SlOka in SrI rAma gIta.

pratyaksha-parOksha-Adi virOdham AtmanOH
vihAya; samgRhya tayOH cidAtmatAm
samSOdhirAm lakshaNayA ca lakshitAM
jnAtvA svamAtmAnam atha advayO bhavEt


My interpretation:
pratyaksham i.e, imminence and parOksham i.e, transcendence are virOdham mutually opposing qualities of Self. By vihAya giving up this contradictions within the description of Self, accepting the true nature of cidAtmatAm pure consciousness in them -- samSOdhitAm one should perform inquiry into its lakshaNayA quality as the goal and the one who is lakshitAm aiming at that goal. jnatvA Having realized svamAtmAnam the own Self as supreme, atha advayO bhavEt one should become non-dual .

Let one and all engage in such a great inquiry resulting in non-dual realization as instructed by Lord rAma. om tat sat.