Monday, December 28, 2009

చాణక్య నీతి సూత్రాలు

ऐरण्डमवलम्ब्य कुन्ञरम् न कोपयेत्
ఆముదం చెట్టు ఆసరా చూసుకుని ఏనుగకు కోపం కలిగించ కూడదు

अतिप्रवृद्धापि शल्मली वारणस्थम्भो न भवति
ఎంత లావుగా పెరిగినా బురుగచెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించదు

अतिदीर्घोऽपि कर्णिकारो न मुसली भवति
కర్నికారం (కొండగోడు) కర్ర ఎంత పొడవు గా ఉన్నా రోకలి గా ఉపయోగించదు

अतिदीप्तोऽपि खद्योतो न पावकः
ఎంత ప్రకాశిస్తున్నా మెరుగుడుపురుగు నిప్పు కాదు

न प्रवृद्धत्वम् गुणहेतुः
(ధనాదుల చేత) బాగా ఎదిగినంత మాత్రాన సద్గుణాలు రావు

सुजीर्णोऽपि पिछुमन्दो न शुञ्कलायते
ఎంత ముదిరినా వేపకర్ర అడకత్తెరకు (సరోతా) ఉపయోగపడదు

यथा बीजम् तथा निष्पत्तिः
విత్తనాన్ని బట్టి దిగుబడి ఉంటుంది

यथा श्रुतं तथा बुद्धिः
చదువును పట్టి బుద్ధి

यथा कुलं तथाचारः
కులాన్ని పట్టి ఆచారం (నడవడిక)

संस्कृतः पिचुमन्दो न सहकारो भबति
ఎంత దోహదం చేసినా వేప తియ్యమామిడి కాదు

-చాణక్య నీతి సూత్రాలు (ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు గారి ఆంధ్ర తాత్పర్యం)
ఇటువంటి 562 సూత్రాలు 8 అధ్యాయాల్లో "రాజనీతి సూత్రాణి" పేరుతొ రచించ బడ్డాయి. ఇవి అందరికీ ఉపకరిస్తాయి.

Wednesday, December 2, 2009

గీతా సారం - The essence of Gita

By the grace of god, I was at the lotus feet of my Guru on this Gita Jayanti Day. A message from my Guru regarding Gita.

ESSENCE OF BHAGAVAD GITA

Srimad bhagavadgita occupies prominent place in the spiritual and religious literature of India, next only to Upanishads and is rapidly gaining worldwide popularity for several reasons. First, its language is simple easy enough to understand Second, it serves as a practical guide for religion and philosophy even to common man. Third, it contains essence of all religions and guides men in all walks of life - saints and sinner alike to the highest knowledge of Self. It is the store house of Knowledge Wisdom and Truth. It is in effect the essence of upanishads.

It is not enough just to recite and listen Gita. But its values have to be incorporated in our daily life. Then only the grace of God is fully bestowed.

Gita jayanti
28 – November – 2009

Swami Virajeshwara
“Hamsa”

त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्।।16.21।।
Lust, anger and greed the three main gates of hell in which the condemned soul enters. They are the worst enemies of man that leads him to sin and thereby he enters the hell upon death. Therefore these should be abandoned purposefully.

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृहणाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णा-
न्यन्यानि संयाति नवानि देही।।2.22।।
A man discards his worn out cloths and wears new ones, analogously atman changes worn out bodies with new one's. Change is the law of nature. Spring marks the birth of new life, in summer reaches full maturity, the autumn brings old age and the winter sees the death. Again new birth is seen in spring. This cycle of birth and death is incessant and man's life too follows the same pattern. There is no escape.

चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ।।7.16।।
Arjuna, four kinds of men worship me; the seeker of worldly objects - wealth, fame, position; the sufferer and worried; seeker of real knowledge (jnana) and the man of wisdom.

पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः।।9.26।।
Any devotee when offers a fruit, a flower or even water with full faith and devotion, I delightfully accept such offerings. (What is offered to God is not important, but the pure conviction, faith and devotion to Him is important)

मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय।
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः।।12.8।।
Fix your mind in Me and employ your buddhi(intellect) in Me alone. Then there is no doubt thay you will dwell in Me. When the mind and the buddhi become one in seeing Me, the ego which impresses the feeling of I and mine perishes.

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु।
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे।।18.65।।
Fix your mind on Me, be my devotee, worship Me with pure bhakti and enter into My Being. Because you are dear to Me, I promise that you shall attain Me alone.

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः।।18.66।।
Without bothering too much about wrong & righteous deeds and their rewards, surrender all you activities to Me and without fear and worry take refuge in Me alone. I shall free you from all sins. Fear Not.

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते .
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।।9.22।।
I look after the needs and protection of those who constantly think of Me and remain absorbed in My thought with pure devotion and contentment.

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया।।18.61।।
The LORD is seated in the hearts of all beings who are like toys mounted on the giant wheel and He is causing them to move around in circles through his deluding potency (maya).

(God is everywhere, omnipresent and omniscient. Since the hearts of ignorant are covered by filth of desire and passion, they do not transmit the image of Lord. The heart of noble souls have been cleaned and purified, the veil of ignorance has been lifted and Lord reflects clearly as the Sun in the clean mirror)

-- స్వామి విరాజేశ్వర, గీతా జయంతి సందర్భంగా.
The above message is for daily reading and individual practice. The nine gems from the storehouse of wisdom - Srimad Bhagavad Gita.

Sunday, November 15, 2009

శివ పూజ, హరి కీర్తన

చేతులారంగ శివునిఁ బూజింపడేఁని
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువఁడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేని
గలుగనేటికిఁ దల్లుల కడుపుచేటు

-- శ్రీ మదాంద్ర భాగవతం నుంచి శ్రీ విరోధి నామ సంవత్సర కార్తిక మాస శివరాత్రి సందర్భం గా

Saturday, November 14, 2009

శైశవగీతి

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!

మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!

అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!

గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు

ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు!
మీ హాసంలో మెరుగులు తీరును
వచ్చేనాళ్ల విభాప్రభాతములు!

ఋతువుల రాణి వసంతకాలం
మంత్రకవాటం తెరచుకునీ,
కంచు వృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ
ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,
హిమానీ నిబిడ హేమంతములు,
చలివడకించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల
క్రీడలాడుతవి మీ నిమత్తమే!

ఇవాళలాగే ఎప్పుడు కూడా
ఇనబింబం పయనించు నింగిపై!
ఎప్పుడు కూడా ఇవాళలాగే
గాలులు వీచును, పూవులు పూచును!
నాకు కనంబడు నానాతారక,
లనేక వర్ణా, లనంత రోచులు
దిక్కు దిక్కులా దివ్యగీతములు
మీరూ వాటికి వారసులే! ఇవి
మీలో కూడా మిలమిలలాడును!

నా గత శైశవ రాగమాలికల
ప్రతిధ్వనులకై,
పోయిన బాల్యపు చెరిగిన పదముల
చిహ్నాల కోసం,
ఒంటరిగా కూర్చిండి వూరువులు
కదిలే గాలికి కబళమునిస్తూ,
ప్రమాద వీణలు కమాచి పాడగ
సెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,
పాతాళానికి పల్టీకొట్టీ
వైతరణీనది లోతులు చూస్తూ,
శాంతములే, కేకాంతముగా, ది
గ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ
మెటిక విరుస్తూ ఇట కూర్చిండిన
నను చూస్తుంటే నవ్వొస్తోందా?
ఉడుతల్లారా!
బుడతల్లారా!

ఇది నా గీతం, వింటారా?

-- శైశవగీతి, శ్రీ శ్రీ. బాలల దినోత్సవం సందర్భంగా

Thursday, October 22, 2009

పురాణ సారం

అష్ఠాదశపురాణేషు వ్యాసస్య వచనద్వయమ్
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్

--పురాణ సారం రెండు మాటల్లో చెప్పాలంటే ఇదే (ఈ శ్లోకాన్ని రాసిన కవి ఎవరో తెలియదు)

Saturday, October 10, 2009

చాణక్య నీతి

साधूनां दर्शनं पुण्यं तीर्थभूता हि साधवः |
कालेन फलते तीर्थं सद्यः साधुसमागमः || १२\-०८
(సత్సంగ ఫలితం సత్వరమని చెపుతుంది)
--------------------------------------------
विप्रास्मिन्नगरे महान्कथय कस्तालद्रुमाणां गणः
को दाता रजको ददाति वसनं प्रातर्गृहीत्वा निशि |
को दक्षः परवित्तदारहरणे सर्वोऽपि दक्षो जनः
कस्माज्जीवसि हे सखे विषकृमिन्यायेन जीवाम्यहम || १२\-०९

విప్ర అస్మిన్ నగరే కః మహాన్ కథయ?
తాలద్రుమాణామ్ గణః
కో దాతా?
రజకో దదాతి వసనం ప్రాతర్గృహీత్వా నిశి
కో దక్షః?
పర విత్తదారోపహరణే సర్వోపి దక్షో జనాః
కస్మాజ్జీవసి హే సఖే?
విష కృమి న్యాయేన జీవాస్మ్యహం! ౧౨-౦౯
(ఈనాటి పరిస్థితులకి దర్పణం ఈ శ్లోకం)
--------------------------------------------
न विप्रपादोदककर्दमाणि
न वेदशास्त्रध्वनिगर्जितानि |
स्वाहास्वधाकारविवर्जितानि
श्मशानतुल्यानि गृहाणि तानि || १२\-१०
(ఏవి లేక పొతే గృహం స్మశాన తుల్యం అవుతుందో చెపుతుంది ఈ శ్లోకం)
--------------------------------------------

-- చాణక్య నీతి నుంచి మూడు శ్లోకాలు

Friday, September 18, 2009

బ్రహ్మవేద, చాంద్రమస, యోగయుక్త మార్గాలు

यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः .
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ .. ८\.२३..

अग्निर्जोतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् .
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः .. ८\.२४..

धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् .
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते .. ८\.२५..

शुक्लकृष्णे गती ह्येते जगतः शाश्वते मते .
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुनः .. ८\.२६..

नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन .
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन .. ८\.२७..

-- శ్రీమద్భగవద్గీత నుంచి, మహాలయ అమావాస్య సందర్భంగా

Thursday, September 17, 2009

శ్రీ రుద్ర సూక్త ధ్యానమ్

ఆపాతాళనభఃస్థలాన్త భువన బ్రహ్మాండ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాన్తామృతైః
అస్తోకాప్లుతమేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే ఛ్ఛివమ్

బ్రహ్మాండవ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలిత శశికలా శ్చండకోదణ్డ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శ్శాంభవా మూర్తిభేదాః
రుద్ర శ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్

ఓం నమో భగవతే రుద్రాయ

-- శ్రీ విరోధి నామ సంవత్సర భాద్రపద బహుళ చతుర్దశి, వ్యతి మహాలయం, మాస శివరాత్రి, గురువారం.

Tuesday, September 15, 2009

కలి సంతరణం

శ్లో. యద్దివ్య నామస్మరతాం సంసారో గోష్పదాయతే
స్వానన్యభక్తిర్భవతి తద్రామపద మాశ్రయే

ॐ सह नाववतु . सह नौ भुनक्तु .
सह वीर्यंकरवावहै . तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै .
ॐ शान्तिः शान्तिः शान्तिः .

हरिः ॐ . द्वापरान्ते नारदो ब्रह्माणं जगाम कथं भगवन् गां पर्यटन् कलिं सन्तरेयमिति .
स होवाच ब्रह्मा साधु पृष्टोऽस्मि सर्वश्रुतिरहस्यं गोप्यं तच्छृणु येन कलिसंसारं तरिष्यसि .
भगवत आदिपुरुषस्य नारायनस्य नामोच्चारणमात्रेण निर्धृतकलिर्भवतीति .. १

नारदः पुनः पप्रच्छ तन्नाम किमिति . स होवाच हिरण्यगर्भः .
हरे राम हरे राम राम राम हरे हरे . हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
इति षोडशकं नाम्नां कलिकल्मषनाशनम् . नातः परतरोपायः सर्ववेदेषु दृश्यते
षोडशकलावृतस्य जीवस्यावरणविनाशनम् . ततः प्रकाशते परं ब्रह्म मेघापाये रविरश्मिमण्डलीवेति .. २

पुनर्नारदः पप्रच्छ भगवन् कोऽस्य विधिरिति . तं होवाच नास्य विधिरिति . सर्वदा शुचिरशुचिर्वा पठन् ब्राह्मणः सलोकतां समीपतां सरूपतां सायुज्यमेति . यदास्य षोडशकस्य सार्धत्रिकोटीर्जपति तदा ब्रह्महत्यां तरति . तरति वीरहत्याम् . स्वर्णस्तेयात् पूतो भवति . वृषलीगमनात् पूतो भवति . पितृदेवमनुष्याणामपकारात् पूतो भवति . सर्वधर्मपरित्यागपापात् सद्यः शुचितामाप्नुयात् . सद्यो मुच्यते सद्यो मुच्यते इत्युपनिषत् .. ३

ॐ सह नाववतु . सह नौ भुनक्तु .
सह वीर्यंकरवावहै . तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै .
ॐ शान्तिः शान्तिः शान्तिः .

-- అజ ఏకాదశి సందర్భంగా

Note: English Translation can be found at http://www.celextel.org/upanishads/krishna_yajur_veda/kalisantarana.html

Wednesday, September 2, 2009

సత్యం "ఏవ" జయతే!

सत्यमेव जयते नानृतम्
सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमत् ऋष्यो ह्याप्तकामो
यत्र तत् सत्यस्य परं निधानं ॥
satyameva jayate nānṛtaṁ
satyena panthā vitato devayānaḥ |
yenā kramantyṛṣayo hyāptakāmā
yatra tat satyasya paramaṁ nidhānam ||

సత్యం ఏవ జయతే న అనృతం
సత్యేన పంథా వితతో దేవ యానః |
ఏన ఆక్రమత్ ఋష్యోః ఆప్తకామా
యత్ర తత్ సత్యస్య పరమం నిధానం ||

Truth alone prevails, not falsehood. By truth the path is laid out, the Way of the Gods, on which the seers, whose every desire is ever-fulfilled, proceed to the Highest Abode of the Truth.

--- ముండక ఉపనిషద్ - ౩.౧.౬

Sunday, August 30, 2009

పరమార్ధం

చేతులారంగ శివునిఁ బూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపడేనిఁ , గలుగ నేటికిఁ దల్లుల కడుపుచేటు.

-- పోతన భాగవతం నుంచి వామన జయంతి మరియు పరివర్తన ఏకాదశి సందర్భం గా

ఈ టపాలు గుర్తుకు తెచ్చుకుందాం!!

1. పోతనామాత్యుని పేదఱికము

2. బలి వృత్తాంతం

3. విష్ణు తిధి...ఏకాదశి

Monday, August 24, 2009

భ్రమ - భ్రాంతి - అజ్ఞానం

సంసారమనే భ్రమ కేవలం భ్రాంతి మూలకమే కాని పరమార్థ సత్యం కాదు.

ఆత్మ ఎకమూ అవయువ రహితమూ; శరీరం ఎన్నో అవయువాలు కలిగినది. కాని జనం ఈ రెండిటినీ ఒకటే అని భావిస్తారు. ఇంతకన్న అజ్ఞానం ఇంకొకటి ఉంటుందా?

-- శ్రీ శంకర ఉవాచ నుంచి

Thursday, August 20, 2009

వ్యర్ధ ప్రలాపం

ఏదైనా కాస్త ఉపయోగం కూడా లేని సంగతి చెపితే మా నాయనమ్మ చెపుతూ ఉండేది.
ఒరే, నువ్వు చెప్పింది "మా చచ్చిపోయిన గేద పగిలిపోయిన కుండెడు పాలు ఇచ్చేది" అన్నట్లు గా ఉందిరా! అని.

అంత గొప్ప విషయం సరే చూద్దాం అంటే "గేదా" చచ్చిపోయింది. పోనీ కుండ చూసి అది ఎంత గొప్ప గేదో నిర్ణయిద్దామంటే కుండా పగిలిపోయింది.

ఏ రకమైన జ్ఞానాన్నీ కలిగించ లేని ఇలాంటి విషయాలని "వ్యర్ధ ప్రలాపం" అనవచ్చు.

ఈ మధ్యన వార్తా పత్రికల్లొనూ, టి వీ చానళ్ళ లోనూ, ఇటువంటి విషయాలు చాల ప్రాముఖ్యతనిచ్చి చెపుతూ ఉంటే చూసి ఇక్కడ రాయాలనిపించింది.

బ్లాగుల్లో వ్యర్ధ ప్రలాపాలు ఎంతైనా చెయ్య వచ్చు.. ఇవి ఉన్నది అందుకే కదా!

--- ఈ రోజు పొలాల అమావాస్య. పొలం పనులన్నీ అయిపోయి పశువులకు పూజ చేసే రోజు . వర్షాభావం వాళ్ళ ఈ సంవత్సరం పొలం పనులు ఇంకా మొదలే కాలేదు!

Tuesday, August 11, 2009

జ్ఞాత

ధీ శక్తి ఉన్నంతదాకా అందు జ్ఞేయ వస్తువులుంటాయి. అది లేనిచో అవీ ఉండవు
జ్ఞాత సర్వకాలాలలోనూ జ్ఞాతయే
కనుక ద్వైతానికి అస్తిత్వం లేదు!

-- శ్రీ శంకర ఉవాచ నుంచి

నా వివరణ:
"ధీ శక్తి" జాగ్రత్, స్వప్న అవస్థల్లో మాత్రమే ఉంటుంది. సుషుప్తి లో ఉండదు.
1. జగ్రదావస్థలొ ఇంద్రియాల ద్వారా బయటికి ప్రసరించి బాహ్య జ్ఞేయ వస్తువులని ప్రకాశవంతం చేస్తుంది
2. స్వప్న అవస్థలో ఇంద్రియాలన్నీ మూయబడి ఉండటం వల్ల అంతరంగంలో జ్ఞేయ వస్తువులని సృష్టి చేస్తుంది
3. సుషుప్తి లో ధీ శక్తి లేక పోవడం వల్ల జ్ఞేయ వస్తువులు ఉండవు

కాని ఈ మూడు అవస్థల్లోనూ జ్ఞాత ఉంటాడు. (ఏకం ఏవ అద్వితీయం)
"ధీశక్తి", "జ్ఞేయ వస్తువులు" ఒక దాని మిద ఇంకొకటి ఆధార పడి ఉండగా, జ్ఞాత సర్వాధారమైన ఆత్మ గా, నిరాధారుడైన బ్రహ్మగా సర్వకాలాలలోనూ జ్ఞాతగా ఉంటాడు.

శ్రీ శంకరులు ఇంకొక సందర్భం లో ఇలా అంటారు
"ఆత్మ జ్ఞేయ విషయం కాదు. అందు బహుత్వ దోషం లేదు. కనుక అది ఎవరిచేతనైనా అంగీకరింపబడినదీ, నిరాకరింపబడినదీ కాదు."
మరొక సందర్భం లో:
"దేని జ్ఞానం వలన ఇక జ్ఞేయ విషయం మిగలదో, దేని ఆనందం వలన ఇక వాంఛనీయమైన ఆనందం ఉండదో, ఏది ప్రాపించుట వలన ఇక ప్రాప్యమే ఉండదో, దానిని బ్రహ్మమని తెలుసుకో"

ఓం తత్సత్

Friday, August 7, 2009

విష్ణు తిధి...ఏకాదశి

తొలి ఏకాదశి... వైకుంఠ ఏకాదశి... ముక్కోటి ఏకాదశి... ఆ పేరులోనే ఏదో పవిత్రత! అంతెందుకు, ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు.

హిందూ సంప్రదాయంలో పరమపవిత్రమైన తిథి ఏకాదశి. ఎంత పవిత్రమైనదంటే... ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకూ ఏదో ఒక విశిష్టతను ఆపాదించి హరినామస్మరణ చేస్తారు భక్తులు. ఒక్కోరోజుకూ ఒక్కో ప్రాధాన్యత. వాటిలో ముఖ్యమైనది ఆషాడమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీన్నే ‘తొలిఏకాదశి’ అంటారు. పూర్వం ఆషాడశుద్ధ ఏకాదశినే సంవత్సరారంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై శయనించే రోజు కాబట్టి ఈ రోజును శయనైకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఖగోళపరంగా చూస్తే ఈరోజుదాకా ఉత్తరదిశగా వాలి కనిపించే సూర్యుడు ఒకింత దక్షిణ దిశగా వాలినట్లు కనిపిస్తాడు. సూర్యుడంటే ప్రత్యక్షనారాయణుడు. అందువల్ల కూడా మన పూర్వులు ఈరోజును శయనైకాదశిగా వ్యవహరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయం.

ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు. చాలా ప్రాంతాల్లో తొలిఏకాదశి నాడు ‘గోపద్మ వ్రతం’ చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నాలుగు నెలలూ వర్షాకాలం కాబట్టి పశువుల కొట్టాలను శుభ్రం చేసి వాటికి ఎలాంటి అనారోగ్యమూ రాకుండా కాపాడుకునే ప్రయత్నం ఇది. అలాగే ఈ నెల బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణువును పూజించి ఏకాదశివ్రతం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక.

శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈరోజున వెన్న దానం చేయాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశిఘడియల్లో హరిని పూజిస్తే కరవుకాటకాలు తొలగిపోతాయని పద్మపురాణంలో ఉంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి రాజ్యాన్నీ భార్యాబిడ్డలనూ కోల్పోయిన హరిశ్చంద్రుడు భాద్రపద బహుళ ఏకాదశి(దీన్నే అజ ఏకాదశి అంటారు)నాడు వ్రతం ఆచరించి అన్నిటినీ పొందగలిగాడని పురాణప్రవచనం.

ముక్కోటి ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి బహుళంలోది ఉత్పత్తి ఏకాదశి. విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టిన కన్య మురాసురుని సంహరించిన దినం ఇది. తొలిఏకాదశినాడు శయనించిన విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఈ రోజును ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు భక్తులు. మార్గశిర శుద్ధంలో వచ్చేది మోక్షొకాదశి, సౌఖ్యదా ఏకాదశి. అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే ఆరోజును ‘ముక్కోటి/వైకుంఠ ఏకాదశి’ అంటారు. చాంద్రమానాన్ని బట్టీ ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణ్వాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆరోజున స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని ప్రతీతి. అలాగే, అర్జునుడికి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో విశ్వరూపం చూపి గీతాబోధన చేసింది ఈరోజేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక మార్గశిర బహుళంలో వచ్చేది విమలైకాదశి. దీన్నే సఫలైకాదశి అని కూడా అంటారు. పుష్యశుద్ధంలిో వచ్చేది నంద/పుత్ర ఏకాదశి. అదే మాసం బహుళంలో వచ్చేది కల్యాణైకాదశి.

భీష్మఏకాదశి
మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగా ఆచరిస్తారు భక్తులు. ఈరోజునే కామదైకాదశి, జయైకాదశి అని కూడా వ్యవహరిస్తారు. మరో పదిహేను రోజులకు వచ్చేది విజయైకాదశి. ఆరోజున పాదరక్షలు దానం చేయడం మంచిదంటారు. రాముడు సేతువు నిర్మాణాన్ని ప్రారంభించి విజయం పొందిన రోజు ఇదేనని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఫాల్గుణ మాసంలో ధాత్రైకాదశి, సౌమ్యైకాదశి వస్తాయి. చైత్రశుద్ధంలో వచ్చే ఏకాదశిని దమనైకాదశి అంటారు. దీనికే అవైధవ్య ఏకాదశి అని కూడా పేరు. చైత్ర బహుళ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే వేయి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందంటారు. ఈ రోజును వరూధిన్యైకాదశి అంటారు. వైశాఖ మాసంలో మొదట వచ్చే మోహిన్యేకాదశి నాడు చెప్పులు, పాలు, చల్లటినీరు... బహుళంలో వచ్చే సిద్ధైకాదశినాడు గొడుగు... దానం చేస్తే మంచిదంటారు. ఇవన్నీ సూర్యప్రతాపం నుంచి రక్షణ కల్పించేవే. జ్యేష్ఠంలోనూ అంతే. మొదటిది త్రివిక్రమైకాదశి. నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు కాబట్టి దీన్నే నిర్జలైకాదశి అంటారు. ఆరోజు నీళ్లకుండలు, నెయ్యి, గొడుగు వంటివి దానం చేస్తారు. ఇక ఆఖరిది జ్యేష్ఠ బహుళ ఏకాదశి... దీన్నే యోగిన్యైకాదశి అంటారు.

ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.

--- ఈనాడు ఆదివారం లో వచ్చింది

Wednesday, August 5, 2009

నేను నేనే!

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే!

ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిలో నేనే వరిష్ఠుడను
నా ఆనందాన్ని సాక్షత్కరించుకుని ఆనందించేది కూడా నేనే
బాలకులు, చదువురాని వారు కూడా దేని మహిమను "నేను" అంటూ గుర్తిస్తారో అదే నేను.

-- శ్రీ శంకర ఉవాచ నుంచి హయగ్రీవ జయంతి సందర్భంగా

నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాది కరణ ద్వార బహి స్పందతే
జానామీతి తమేవ భాంతమ్ అనుభాతి ఏతత్ సమస్తం జగత్
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

గురవే సర్వలోకానాం, భిషజే భవరోగిణామ్
నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః

Saturday, July 18, 2009

గోవింద ద్వాదశ మంజరికా స్తోత్రము

భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే


మూఢ! జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్భుద్ధిమ్ మనసి వితృష్ణామ్
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం - 1

నారీస్తనభర నాభీదేశం దృష్టామాగా మోహావేశం
ఏతన్మాంసవసాది వికారం మనసి విచిన్తయ వారం వారం - 2

నళినీదళ గత జల మతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తం - 3

యావద్విత్తోపార్జనసక్త స్తావన్నిజపరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్ఝరదేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే - 4

యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా భిభ్యతి తస్మిన్ కాయే - 5

అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతస్సుఖలేశ స్సత్యం
పుత్రాదపి ధనభాజాం భీతి స్సర్వత్రైషా విహితా రీతిః - 6

బాలస్తావ త్క్రీడాసక్త స్తరుణస్తావ త్తరుణీసక్తః
వృద్ధస్తావ చ్చిన్తాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః - 7

కా తే కాన్తా కస్తే పుత్త్ర స్సంసారోయ మతీవ విచిత్రః
కస్య త్వం వా కుత ఆయాతః తత్త్వం చిన్తయ యదిదం భ్రాంతః- 8

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మొహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చల తత్త్వే జీవన్ముక్తిః - 9

వయసి గతే కః కామవికార శుష్కే నీరే కః కాసారః
క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్త్వే క స్సంసారః - 10

మా కురు ధన జన యౌవన గర్వం హారతి నిమేషాత్కాల స్సర్వమ్
మాయామయ మిద మఖిలం హిత్వా బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా - 11

దినయామిన్యౌ సాయం ప్రాత శ్శిశిరవసన్తౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్చత్యాయు స్తదపి న ముఞ్చత్యాశావాయుః - 12

ద్వాదశ మఞ్జరికాభిర శేషః కథితో వైయాకరణ స్యైషః
ఉపదేశోభూ ద్విద్యానిపుణైః శ్రీమచ్చఞ్కర భగవచ్చరణైః


మోహ ముద్గరః

Thursday, July 2, 2009

యోగనిద్ర

చారుపటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూర మృణాల హార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సార నిభాంగ శోభితభుజంగమ తల్పమునందు యోగని
ద్రా రతిఁ జెంది యుండు జఠర స్థిత భూర్భువ రాది లోకుఁ డై

-- శయన ఏకాదశి సందర్భంగా శ్రీ మదాంధ్ర భాగవతము నుంచి

Thursday, June 18, 2009

నారద మహర్షి మాటల్లో 'ఈశ్వరుడు - విశ్వం'

గాంధారీ ధృతరాష్ట్రులు దేహ త్యాగము సేసికొనుట అనే ఘట్టము శ్రీ మదాంధ్ర భాగవతము ప్రధమ స్కంధము నుంచి

విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి యందుఁ బోయిరో వారల నిశ్చయంబులెట్టివో ఎఱుంగనని సంజయుండు దుఃఖించు సమయమున తుంబురు సహితుడై నారదుడు వచ్చిన,
వారిని పూజించి కౌంతేయాగ్రజుడు నారదుని తో ఇట్లనియె:


అక్కట తల్లి దండ్రులు గృహంబున లేరు మహాత్మ వారు నేఁ
డెక్కడ వోయిరో యెఱుఁగ నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ
బొక్కుచు నుండుఁ దల్లి యెటు వోయెనొకో విపదంబురాశికిన్
నిక్కము కర్ణధారుఁడవు నివు జగజ్జనపారదర్శనా.

అనిన విని సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె:

ఈశ్వరవశంబు విశ్వం బీశ్వరుండ భూతంబుల నొకటితో నొకటిఁ జేర్చునెడఁబాపు; సూచీభిన్ననాసిక లందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టంబడిన బలీవర్దంబులుంబోలెఁ, గర్తవ్యాకర్తవ్య వేద లక్షణ యగు వాక్తంత్రియందు వర్ణాశ్రమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులై, లోకపాలసహితంబైన లోకం బీశ్వరాదేశంబు వహించుఁ గ్రీడాసాధనంబు నక్షకందుకాదులకెట్లు సంయోగవియోగంబు లగుచుం; సమస్త జనంబును జీవ రూపంబున ధృవంబును, దేహరుపంబున నధృవంబునై యుండు; మఱియొక్క పక్షంబున ధృవంబు నధృవంబునుం గాక యుండు శుద్ధబ్రహ్మస్వరుపంబున రెండునై యుండు; నజగరంబు చేత మ్రింగబడిన పురుషుండన్యుల రక్షింప లేనితెఱుంగునఁ బంచభూతమయంబై కాలకర్మగుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్ధంబు గాదు; కరంబులుగల జంతువులు గరంబులు లేని చతుష్పదంబులు లాహరంబులగు, జరణంబులు గల ప్రాణులకుం జరణంబులు లేని తృణాదులు భక్షణీయంబులగు, నధిక జన్మంబు గల వ్యాఘ్రాదులకు నల్ప జనంబుగల మృగాదులు భొజ్యంబులగు, సకల దేహి దేహంబులందు జీవుండు గలుగుటం జేసి జీవునికి జీవుండ జీవిక యగు సహస్తాహస్తాదిరూపం బైన విశ్వమంతయు నీశ్వరుండుగాఁ దెలియుమతనికి వేరు లేదు; నిజమాయావిశేషంబున మయావియై జాతి భేద రహితుండైన యీశ్వరుండు బహు ప్రకారంబుల భోగి భోగ్య రూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించుం గాన, యనాథులు దీనులు నగు నా తలితండ్రులు ననుం బాసి యేమయ్యెదరో, యెట్లు వర్తింతురో యని వగవం బనిలే దజ్ఞానమూలంబగు స్నేహంబుననైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు మనెను.

Monday, June 15, 2009

ఆత్మ శాంతి కి తేలిక మార్గం

శౌనకాది మునులు సూత మహా ముని తో:

అలసులు మందబుద్ధిబలు లల్పతరాయువు లుగ్రరోగసం
కలితులు మందభాగ్యులు సుకర్మము లేవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్య మై
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే

దానికి సూత మహర్షి సమాధానం:

అతిరహస్య మైన హరిజన్మ కథనంబు మనుజుఁ డెవ్వఁ డేని మాపు రేపుఁ
జాల భక్తి తోడఁ జదివిన సంసార దుఃఖ రాశిఁ బాసు తొలఁగి పోవు.

--- ఆంధ్ర మహాభాగవతం నుంచి
(సద్విచారం చేయడానికి ఆత్మ శాంతి ఎంతో అవసరం; విచారం వలననే జ్ఞానం; జ్ఞానం వలననే మోక్షం కలుగుతాయి.)

Sunday, June 7, 2009

కృషి పౌర్ణమి

పొలాలనన్నీ,
హలాలదున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ,
జగానికంతా సౌఖ్యం నిండగ,
విరామమెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదులేదోయ్.

-- ప్రతిజ్ఞ అనే శ్రీ శ్రీ కవిత నుంచి (మహాప్రస్థానం సంకలనం) ఏరువాక పౌర్ణమి సందర్భంగా;

Friday, June 5, 2009

సాధనం

1. జ్ఞాన సాధనం
కాంతి తప్ప మరి దేనితోను ఏ వస్తువునైనా చూడజాలం. అట్లే విచారణ తప్ప మరొక సాధనంచే జ్ఞానం పొందలేం.

2. మోక్ష సాధనం
వంటకు అగ్నియే అపరోక్ష కారణమైనట్లు జ్ఞానం మాత్రమే మోక్షానికి అపరోక్ష సాధనం. మరి ఏ ఇతర సాధనాలూ కావు. ఎందుకంటే జ్ఞానం లేనిదే మోక్షం సాధ్యం కాదు కనుక.

--- శ్రీ శంకర ఉవాచ నుంచి

Saturday, May 30, 2009

విఘ్న దశకం

యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న ఇతి కథ్యతే
తతో అభ్యాసం త్యజే దేవం ప్రథమం విఘ్నముచ్యతే

ద్వితీయం సంశయాఖ్యం చ తృతీయమ్ చ ప్రమత్తతా
అలస్యాఖ్యం చతుర్థం చ నిద్రారూపమ్ తు పంచమం

షష్ఠం విరతి ర్భ్రాన్తిః సప్తమం పరికీర్తితమ్
విషమం చాష్టమం చైవ అనాఖ్యం నవమం స్మృతమ్

అలబ్ది ర్యోగతత్త్వస్య దశమం ప్రోచ్యతే బుధైః
ఇత్యేతద్విఘ్న దశకం విచారేణ త్యజే ద్బుధః

---యోగకుండల్యుపనిషత్తు (1:58 - 1:61)

English Translation from celextel.org
58. If a Yogin is afraid of such diseases (when attacked by them), he says, “my diseases have arisen from my practice of Yoga”. Then he will discontinue this practice. This is said to be the first obstacle to Yoga.
59. The second (obstacle) is doubt; the third is carelessness; the fourth, laziness; the fifth, sleep;
60. The sixth, the not leaving of objects (of sense); the seventh, erroneous perception; the eighth, sensual objects; the ninth, want of faith;
61. And the tenth, the failure to attain the truth of Yoga. A wise man should abandon these ten obstacles after great deliberation.

Wednesday, May 13, 2009

శ్రీరామ హృదయము

రామో న గచ్ఛతి న తిష్ఠతి నానుశోచ-
త్యాకాంక్షతే త్యజతి నో న కరోతి కించిత్
ఆనందముర్తి రచలః పరిణామహీనో
మాయాగుణాననుగతో హి తథా విభాతి - ౪౩
తతో రామః స్వయం ప్రాహ
హనూమంత ముపస్థితమ్
శ్రుణు తత్త్వం ప్రవక్ష్యామి
హ్యత్మానాత్మపరాత్మనామ్ - ౪౪
ఆకాశస్య యథా భేద స్త్రివిధొ దృశ్యతే మహాన్
జలాశయే మహాకాశ స్తదవచ్ఛిన్న ఏవ హి
ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః - ౪౫
బుద్ధ్యవచ్ఛిన్న చైతన్య మేకం పూర్ణమథాపరమ్
అభాసస్త్వపరం బింబ భూతమేవం త్రిధా చితిః - ౪౬
సాభాసబుద్ధేః కర్తృత్వ మవిచ్చిన్నే(అ) వికారిణి
సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీవత్వం చ తథాబుధైః - ౪౭
అభాసస్తు మృషా బుద్ధిరవిద్యాకార్యముచ్యతే
అవిచ్ఛిన్నం తు తద్ బ్రహ్మ విచ్ఛేదస్తు వికల్పతః - ౪౮
అవచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపాద్యతే
తత్త్వమస్యాది వాక్యైశ్చ సాభాసస్యాహమస్తధా - ౪౯
ఐక్య జ్ఞానం యదోత్పన్నం మహావాక్యేన చాత్మనోః
తదా (అ) విద్యా స్వకార్యైశ్చ నశ్యత్యేవ న సంశయః - ౫౦
ఏతద్విజ్ఞాయ మద్భక్తో మద్భావాయోపపద్యతే
మద్భక్తివిముఖానాం హి శాస్త్రగర్తేషు ముహ్యతామ్
న జ్ఞానం న చ మోక్షః స్యాత్తేషాం జన్మశతైరపి - ౫౧

--అధ్యాత్మరామాయణము, శ్రీరామ హృదయము అనబడే బాలకాండము ప్రధమ సర్గము నుంచి

Tuesday, May 5, 2009

ప్రార్ధన

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్
తత్త్వం పూషన్నపావ్రుణు సత్యధర్మాయ దృష్టయే

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రస్మింసమూహ
తేజో యత్తే రూపం కల్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి

వాయురనిలమమృతమథేదమ్ భాస్మాన్తం శరీరమ్
ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర

అగ్నే నయ సుపథా రాయే అస్మాన్విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భుయిస్ఠాం తే నమఉక్తిం విధేమ

- ఈశావాస్య ఉపనిషద్ (చివరి 4 శ్లోకాలు)

Friday, April 10, 2009

ఏక శ్లోకి

కిం జ్యోతిస్తవభానుమానహాని మే రాత్రౌ ప్రదీపాదికం
స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యొతిరాఖ్యాహి మే
చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్దియో దర్శనే
కిం తత్రాహమథొ భవాన్పరమాకం జ్యోతిస్తదస్మీ ప్రభో

Guru: కిం జ్యోతిస్తవ?
Sishya: భానుమానహాని మే; రాత్రౌ ప్రదీపాదికం|
Guru: స్యాదేవం| రవిదీపదర్శన విధౌ కిం జ్యొతిరాఖ్యాహి మే?
Sishya: చక్షుస్|
Guru: తస్య నిమీలనాదిసమయే కిం?
Sishya: ధీ|
Guru: ధీయో దర్శనే కిం?
Sishya: తత్రాహమ్|
Guru: అథ భవాన్పరమాకం జ్యోతిః|
Sishya: తదస్మీ ప్రభో||

Thursday, April 9, 2009

प्रातः स्मरणम्

प्रातः स्मरणम्

प्रातः स्मरामी हृदि संस्फुरदात्मतत्त्वं
सच्चित्सुखं परमहंस गतिं तुरीयं
यात्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यं
तद्ब्रह्म निष्कलमहं न च भूतसङघः - 1

प्रातर्भजामी मानसां वचसामगम्यं
वाचो विभांति निखिला यदनुग्रहेण
यान्नेतिनेतिवचनैर्निगमा अवोचं-
स्तं देवदेवमजमच्युतमाहुरग्र्यम् - 2

प्रातर्नमामि तमसः परमर्कवर्णम्
पूर्णं सनातनपदं पुरुषोत्तमाख्यम्
यस्मिन्निदं जगदशेषमशेषमूर्तौ
रज्ज्वां भुजङगम् इव प्रतिभासितं वै - 3

श्लोकत्रयामिदं पुण्यं लोकात्रयाविभुषणम्
प्रातःकाले पठेद्यस्तु सा गछेत्परमं पदम्

इति श्रिमच्छंकरभगवत्पादविरचितं परब्रह्मणः प्रातःस्मरणस्तोत्रं संपूर्णम्

Thursday, April 2, 2009

ఆత్మహత్య

అతిదుర్లభాలు, కేవలం భగవదనుగ్రహ హేతుకాలు అయినవి మూడున్నవి.
అవి:
1. మానవజన్మ
2. ముముక్షుత్వం
3. మహాపురుషుల ఆశ్రయం
------------------------------------------------------------------------------------------------------------
ఎట్లైనా మానవజన్మ పొంది, అందునా పురుష శరీరం దాల్చి, ఆపై వేదాధ్యయనం కూడా చేసి, అప్పటికీ ఆత్మ సాక్షాత్కారానికై ప్రయత్నించని మనిషి అనిత్యవస్తువులపట్ల ఆసక్తుడై ఆత్మహత్యే చేసికొంటున్నాడు.
------------------------------------------------------------------------------------------------------------

---శ్రీ శంకర ఉవాచ నుంచి

Tuesday, March 24, 2009

పూర్ణం, శూన్యం, అనంతం

ఉన్నది ఒక్కటే - పూర్ణం - సచ్చిదానందం - అద్వయం - ఏకం - 1
లేనిది ఒకటి - శూన్యం - అహంకారం - ఉహ జనితం - 0

ఉన్న పూర్ణాన్ని లేని శున్యంతో విభజిస్తే కనిపించేది ఈ అనంత దృశ్య ప్రపంచం!!!
(1/0 = Infinite)

దృగ్ దృశ్యౌ ద్వే పదార్ధౌః స్థః పరస్పర విలక్షణం |
దృగ్ బ్రహ్మ దృశ్యం మాయ ఇతి సర్వ వేదాంత డిండిమః ||

Wednesday, March 11, 2009

పరా పూజ

అఖండే సచ్చిదానందే నిర్వికల్పైకరూపిణి |
స్థితే అద్వితీయ భావే అస్మిన్ కథం పూజా విధీయతే ||

ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం,
పూజా తే వివిధొపభొగరచనా, నిద్రా సమాధిస్థితిః,
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః, స్తోత్రాణి సర్వాగిరౌ,
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం.

---శ్రీ శంకరాచార్య (పరా పూజ స్తోత్రం నుంచి)

నిజంగా చెప్పాలంటే ధర్మబద్దమైన కర్మలన్నీ ఆరాధనమే.
జ్ఞాని చేసే ప్రతి కర్మా ఈశ్వరారాధనమే.
ఈ పైన చెప్పిన "పరా పూజ" తత్త్వం అర్ధం కాక పోతే
"క్షమ" కోసం కరుణా సముద్రుణ్ణి ఇలాప్రార్ధించాలి:

కర చరణ కృతం వా, కర్మ వాక్కాయజం వా,
శ్రవణ నయనజం వా, మానసం వాపరాధం |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో ||

ఇక ఇదీ కుదరని పక్షంలో అమ్మవారికి పూర్తి శరణాగతిని తెలియజేసే మార్గం:

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || 


దేవీ! యావత్ప్రపంచంలో నాకు సముడైన పాపి లేడు. నీకు సాటి వచ్చే పాపక్షాళన శక్తి లేదు. దీనిని మనస్సున ఉంచుకుని నీకెలా తోస్తే అలా చేయి!

ఈ విధంగా జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు పరిసమాప్తమవుతాయి.

ఈశ్వరార్పణమస్తు

Wednesday, March 4, 2009

"పద" అరణ్యం - తత్త్వ "మార్గం"

శాస్త్ర సంచయంలోని పద సమూహాలు అరణ్యం వంటివి. మనస్సు అందు దారి తెలియక పరిభ్రమిస్తూ ఉంటుంది. అందుచేత తత్త్వజ్ఞుల నుండి ఆత్మ తత్త్వాన్ని ప్రయత్నించి తెలుసుకోవాలి.

-- శ్రీ శంకర భగవత్పాదులు, శ్రీ శంకర ఉవాచ నుంచి

Tuesday, March 3, 2009

ఇతరులకు నినునేరుగతరమా

ఇతరులకు నినునేరుగతరమా
ఇతరులకు నినునేరుగతరమా ఇందిరా రమణ

సతత సత్యవ్రతులు సంపూర్ణ మొహవిరహితులేరుంగుదురు నిను ఇందిరా రమణ
ఇతరులకు నినునేరుగతరమా

నారికఠాక్షపటునారాచభయరహిత శూరులేరుగుదురు నిను చూచేటి చూపు
ఘోర సంసార సంకులపరిచ్చేదులగు ధీరులెరుగుదురు నీ దివ్య విగ్రహము
ఇతరులకు నినునేరుగతరమా

రాగభోగవిదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రనుతించు విధము
ఆగమోక్త ప్రకారాభిగంయులు మహాయోగులెరుగుదురు నీవుండేటి వునికి 
ఇతరులకు నినునేరుగతరమా

పరమ భాగవత పదపద్మ సేవానిజాభరనులెరుగుదురు నీ పలికేటి పలుకు
పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్తిరులెరుంగుదురు నిని తిరు వెంకటేసా
ఇతరులకు నినునేరుగతరమా

సతత సత్యవ్రతులు సంపూర్ణ మొహవిరహితులేరుంగుదురు నిను ఇందిరా రమణ
ఇతరులకు నినునేరుగతరమా ఇతరులకు నినునేరుగతరమా
 

Monday, March 2, 2009

నే నేమిటి?

నేను శరీరం కంటే భిన్నుడను కనుక జన్మ వార్ధక్య చావు వంటి వికారాలు నాకు లేవు. ఇంద్రియ రహితుడను కనుక శబ్దరసాల వంటి ఇంద్రియవిషయాల పట్ల ఆసక్తి నాకు లేదు.
మనస్సు కంటే భిన్నుడను కనుక దుఃఖం, ఆసక్తి, ద్వేషం, భయాలు నాకు లేవు. ఉపనిషద్ వాక్యం ఇది : అప్రాణొహ్యమనాః శుభ్రోహ్యక్షరాత్పరతః పరః

दिव्यो ह्यमूर्तः पुरुषः स बाह्याभ्यन्तरो ह्यजः ।
अप्राणो ह्यमनाः शुभ्रो ह्यक्षरात् परतः परः

Mundaka Upanishad : ii-1-2

Monday, February 23, 2009

మహాశివరాత్రి

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతో పునః పునః

ఎవని సద్రూపమైన ప్రకాశమే అసద్రూపాలైన అర్థాలుగా కన్పించుచున్నదో,
తత్త్వమసి అనే వేద వాక్యంచే ఎవడు భక్తులకు ప్రత్యక్షంగా తెలుపుచున్నాడో,
ఎవనిని సాక్షాత్కరించుకుంటే సంసారసాగరాన పునర్భవముండదో,
ఆ గురుమూర్తియైన దక్షిణాముర్తికి ప్రణమిల్లుచున్నాను.


-- మహాశివరాత్రి సందర్భంగా

Thursday, February 12, 2009

ఆపద - సంపద

आपदः सम्पदः काले दैवादेवेती निश्चयी |
तृप्तः स्वस्थेन्द्रियो नित्यं न वाञ्छति न शोचति ||


ఆపదః, సంపదః, కాలే, దైవాత్, ఎవ, ఇతి, నిశ్చయీ
తృప్తః, స్వస్థేంద్రియః, నిత్యం, న, వాఞ్చతి, న, శోచతి

ఆపదలు సంపదలు కాలంలో దైవం వలన (మన పూర్వ కర్మ ఫలితాల వలన) మాత్రమే అని నిశ్చయించుకున్న వాడు నిత్యం త్రుప్తుడై, ఇంద్రియాలను నిగ్రహించి ఏమీ కోరడు, దుఃఖించడు.

(Astavakra Samhita - Chapter XI - Verse 3)

Thursday, January 29, 2009

గురువు - శిష్యుడు

వేదవిదుడు, పాపరహితుడు, కామనారహితుడు, బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడు, బ్రహ్మనిస్ఠుడు, ఇంధనం లేని అగ్ని లా శాంతుడు, అవ్యాజ కరుణా సముద్రుడు, శరణాగత సుజనులకు మిత్రుడు యైన వాడే నిజమైన గురువు.

మోక్షకామి, విధేయుడు, ప్రశాంతచిత్తుడు, శమదమాది గుణాన్వితుడై తనను శరణు వేడిన వానికి గురువు కేవలం అనుగ్రహమాత్రంచే తత్త్వోపదేశం చేస్తాడు.

అజ్ఞానాంధకారాన్ని నిర్మూలించి, సాక్షాత్కార కమలాన్ని వికసింపజేసే విష్ణుస్వరూపుడే గురుదేవుడు. ఆ గురు భాస్కరునిచే నా మనస్సనే ఆకాశం వెలుగు నొందినది.

--శంకర భగవత్పాదుల వారి శంకర ఉవాచ నుంచి

శ్రీ సర్వధారి నామ సంవత్సర మాఘ శుద్ధ తదియ గురు వారం

Friday, January 9, 2009

విజయ రధం

రామ రావణ సంగ్రామ క్షేత్రం
రావణుడు కవచం, బ్రహ్మ దేవుడు ఇచ్చిన అస్త్రం, రధంతో రణరంగంలో అడుగుపెట్టాడు.
శ్రీ రామచంద్రుడు కూడా సమరాంగణంలో నుంచున్నాడు. రామచంద్ర ప్రభువుకి రధం లేదన్న విచారం విభీషణుడి మనసుని కలచి వేసింది.
వెంటనే
"ప్రభూ, తమకు రధం లేదు; కవచం లేదు; పాదరక్షలు కూడా లేకుండా నేల మీద నిల్చున్నారు. కాని విరోధి ఐన రావణుడు రధం మీద వచ్చాడు. బలవంతుడు కవచధారి కూడా. రావణుడి పై విజయం సాధ్యమా?"

ఈ ప్రశ్నకు శ్రీ రామచంద్రుడు ఇలా అన్నాడు:
"మిత్రమా, విజయాన్ని అందించే రధం ఏ విధం గా ఉంటుందో విను. విజయరధానికి శౌర్యధైర్యాలు చక్రాలైతే సత్యశీలాలు జెండాలుగా భాసిస్తాయి. బలం వివేకం ఇంద్రియ నిగ్రహం పరోపకారం ఈ నాలుగు ఆ రధానికి అశ్వాలు. ఈ గుర్రాలను రధానికి పూన్చడానికి ఉపయోగించే రజ్జువు క్షమ దయ సమత్వాల ముప్పేటల సమన్వయము తో తయారవుతుంది. ఇక దైవ సంస్మరణే చతురుడైన సారధి. వైరాగ్యమే డాలు, సంతోషం ఖడ్గం, దానం పరశువు, బుద్ధి ప్రచండమైన భుజ శక్తి. విశిష్టమైన విజ్ఞానమే ధనుస్సు. నైర్మల్య స్థిరత్వాలు తూణీరాలు. శమ దమ యమాదులు నిశిత శరాలు. గురు బ్రహ్మణులపై గల భక్తి శ్రద్ధలే కవచం.
విభీషణా! ధర్మ సమన్వితమైన ఇలాంటి రధమే విజయ రధం. దీన్ని అధిరోహించి ఉన్న రధికుణ్ణి జయించే శక్తి గల శత్రువు ఎక్కడా ఉండడు. ఈ రధం పై అధిరోహించి ఉన్న వీరుణ్ణి జనన మరణాలనే దుర్జయ శత్రువులూ జయించలేవు. ఇలాంటి రధం మీద ఉన్న నా ముందు రావణుడు అతని శక్తి పరాజయం కాక తప్పదు"

తులసీ రామాయణం నుంచి (ఈనాడు అంతర్యామి శీర్షికలో ఈరోజే వచ్చింది) - కాలిపు వీరభద్రుడు